For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక క్యాన్సర్ కు కారణం అయ్యే 16 ఆహారాలు.!

|

క్యాన్సర్ ఒక భయంకర ప్రాణాంతక వ్యాధి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చికిత్సలేని వ్యాధి అని భావించే వారు. కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో చికిత్సపద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా నివారించడం సాధ్యమే అవుతుంది. ప్యాశ్చాత్య పోకడలతో ప్రస్తుత రోజుల్లో సిగరెట్లు, మద్యం, ఫ్యాట్ ఫుడ్స్ , నిద్రలేమి వల్ల ఇటువంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇటుంటి చెడు వ్యసనాల భారీన పడకుండా, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ ఎంత ఉన్నా దాన్ని చాలా వరకూ జయించినట్లే..

ముఖ్యంగా తీసుకొనే ఆహారం విషయంలో, మార్కెట్లో అనేక ఆహారాలు కలర్ఫుల్ గా కనిపిస్తూ, అనారోగ్యకరమైన ఆహారాలు మనల్ని ఆకర్శిస్తుంటాయి. అలాంటి ఆహారాలు, క్యాన్సర్ కు దారితీసే ఆహారాలు మార్కెట్లో అనేకం ఉన్నాయి. అటువంటి ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ నుండి వెంటనే తొలగించాలి. మనలో ఒక సాధారణ అలవాటు ఒకటుంది. సినిమాకెళ్ళినప్పుడు ఒక చేతిలో పాప్ కార్న్, మరోచేతిలో కలర్ఫుల్ కూల్ డ్రింక్ తీసుకొని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు . మరియు కొన్ని జ్యూసీ ఫ్రూట్ చూసి అవి మనకు ఆరోగ్యంకరం అనుకొంటాం. కానీ, ఇలాంటి కొన్ని ఆహారాలు, క్యాన్సర్ కారకాలని మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీకు ఆశ్చర్యం కలగవచ్చు.

అవుననే చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. మీరు రెగ్యులర్ తీసుకొని ఆహారాలు కొన్ని క్యాన్సర్ కు దారితీసే ఆహారాలు ఇక్కడ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. వాటిని మీ రెగ్యులర్ డైట్ నుండి తొలగించాలి లేదా వాటి లేబుల్స్ ను చదివి అవి క్యాన్సర్ సెల్స్ ను ఏవిధంగానైనా ప్రభావితం చూపెడుతాయో తెలుసుకోవాలి. కొన్ని హైడ్రెజనేటెడ్ ఆయిల్ మరియు సోడియం రిచ్ ఫుడ్ ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. కాబట్టి, క్యాన్సర్ వచ్చిన తర్వాత 'చికిత్స కంటే నివారణే ఉత్తమం' అనే విషయం మనకు తెలిసిందే. ఈ కాన్సర్ కారక ఆహారాలను తినడం మానేయండి...

పాప్ కార్న్:

పాప్ కార్న్:

ఈ ఆహారపదార్థం మనం తినడానికి చాలా సులభంగా అందుబాటులో ఉండవచ్చు. కానీ, మీరు ఆ మైక్రోవేవ్ పాప్ కార్న్స్ కాలేయం, వృషణ, మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు కారణమయ్యే రసాయనాలుతో కప్పబడి ఉంటాయని మీకు తెలుసా.

సోడా:

సోడా:

సోడాలో పంచదార, ఫుడ్ కెమికల్స్ మరియు కలర్స్ కలపబడి ఉంటాయని చెబుతుంటారు . సోడా శరీరంలో గ్యాస్ ఉత్పత్తికి కారణం అవుతుంది మరియు అలాగే కొద్దిగా తక్కువగా క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ కూడా మీరు దూరంగా ఉండాలి.

షుగర్ స్వీట్నర్స్:

షుగర్ స్వీట్నర్స్:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ క్యాన్సర్ కు దారితీసి ఒక ప్రధాన ఆహారం. ఇది పుట్టుకలోపాలను పెంచుతుంది. మరియు వివిధ రకాల క్యాన్సర్ కు దారితీస్తుంది.

పిండి:

పిండి:

ప్రొసెస్డ్ ఫుడ్స్ లో రిఫైన్ చేసిన పిండి పదార్థాలు మనం ఎక్కువగా, సాధారణంగా ఉపయోగిస్తుంటాం. కానీ, ఈ ప్రొసెస్డ్ ఆహారాల్లో అధిక కార్బోహైడ్రేట్స్ వల్ల 220శాతం బ్రెస్ట్ క్యాన్సర్ ను పెంచుతుంది.

పండ్లు:

పండ్లు:

ఆపిల్స్, ద్రాక్ష వంటి ఆరోగ్యకరమైన పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు అని, వీటిని చాలా మంది రెగ్యులర్ గా తింటుంటారు. కానీ రసాయనికంగా పండించిన పండ్లు క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి, మీ సేంద్రియ పద్దతిలో పండించిన పండ్లకు ఎక్కువ ప్రాధన్యత ఇవ్వండి.

హైడ్రోజనేటడ్ ఆయిల్స్:

హైడ్రోజనేటడ్ ఆయిల్స్:

క్యాన్సర్ కు కారణం అయ్యే ఒక ప్రదానమైన ఆహారాల్లో ఈ హైడ్రోజనేటడ్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెలను, తినే ఆహారాలు నిల్వచేయడానికి తయారు చేసే ఆహారాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండటం ఉత్తమం.

చేపలు:

చేపలు:

వ్యవసాయ భూముల్లో పెరిగే చేపలు(ఫార్మ్ సాల్మన్)క్యాన్సర్ పదార్థాలు కలిగి ఉన్నండే ఆహారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. వీటిలో విటమిన్ డి కూడా ఉండవు మరియు క్యాన్సర్ కు దారితీసే రసాయనాలో కలుషిత అయ్యి ఉంటుంది.

హాట్ డాగ్స్ :

హాట్ డాగ్స్ :

హాట్ డాగ్స్ మీకు ఇష్టం అయితే, ఈ ఆహారానికి స్వస్తి చెప్పి, ఆరోగ్యకరమైన, మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. హాట్ డాగ్స్ లో ఉన్న నూనెలు క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది.

దోనట్స్:

దోనట్స్:

దోనట్స్ హైడ్రోజెనేటడ్ ఆయిల్స్, వైట్ ఫ్లోర్, పంచదార, మరియు అక్రిలమిడ్స్ వంటివి శరీరానికి హాని చేసే పదార్థాలతో తయారు చేసి ఉంటారు. దోనట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కు దారితీసే కణాలు యాక్టివేట్ అవుతాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్:

ఫ్రెంచ్ ఫ్రైస్:

సాధరణంగా ఇవి మనకు క్యాన్సర్ ఫ్రైస్ అనికూడా తెలుసుకోవాలి. వీటిరి హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి.

ప్రొసెస్డ్ మీట్:

ప్రొసెస్డ్ మీట్:

ఇటువంటి ఆహారాలు కోలన్ క్యాన్సర్ కు దారితీస్తాయి. ఒక వేళ ఈ మాంసంను కాల్చి తిన్నా లేదా సరిగా ఉడికించక పోయినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

టోస్ట్:

టోస్ట్:

మీకు టోస్ట్ అంటే చాలా ఇష్టమైతే ఇది చాలా అనారోగ్యకరమైన ఆహారం. చాల్చిన ఆహారాలు హిటరోసిలిక్ ఆరోమాటిక్ అమినీస్ విడుదల చేస్తాయి. ఇవి కాన్సర్ ఉత్ప్రేరకాలు.

సాల్ట్ ఫుడ్స్:

సాల్ట్ ఫుడ్స్:

అధికంగా ఉప్పును ఉపయోగించి తయారు చేసిన ఆహారాలు ఊరగాయలు, కాల్చిన పదార్థాలు స్టొమక్ క్యాన్సర్ కు దారితీస్తాయి.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

అధికంగా ఆల్కహాల్ తీసుకొనే వారికి నోరు, అన్నవాహిక, ప్రేగు, కాలేయం మరియు రొమ్ము క్యాన్సర్ కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంది.

పీనట్స్:

పీనట్స్:

ఇది ఒక ప్రధానమైనటువంటి కాన్సర్ కారకమైన ఆహారం. మీరు ఉప్పుతో చేసిన లేదా మౌల్డ్ చేసిన వేరుశెనగ తింటే, అది కాలేయం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అఫ్లాటాక్సిన్స్ అని ఫంగస్ కలిగి ఉంది.

రెడ్ మీట్ :

రెడ్ మీట్ :

ఎవరైతే ఎక్కువ రెడ్ మీట్ (బీఫ్, సాసేజ్, బాకన్ మరియు హబర్గర్స్)వంటివి ఎక్కువగా తీసుకుంటారో వారికి బౌల్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

English summary

Cancer Causing Foods To Avoid

Today, every food we seem to set our eyes upon has some contents in which is unhealthy to consume. There are some foods in the market which also have ingredients which cause cancer, thus these foods should be immediately removed from our daily diet.
Story first published: Friday, August 30, 2013, 18:08 [IST]
Desktop Bottom Promotion