For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలర్జీకి కారణాలు మరియు లక్షణాలు, నివారణ చిట్కాలు

By Super
|

ఆహారం, మందులు, పురుగులు కుట్టడం, పెంపుడు జంతువుల ద్వారా ఎలర్జీలు వచ్చే అవకాశాలు కలవు. ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల శరీరం లో ప్రధాన జీవరసాయన మార్పులు జరుగుతాయి. దాంతో కళ్ళు, ముక్కు, చర్మం, గొంతు అలాగే జీర్నవాహికకు హానీ చేసే హిస్తమైన్ విడుదల రక్తం లో జరుతుతుంది.

ఎర్రని దద్దుర్లు, బొబ్బలు, ముక్కు కారుట, వీజింగ్, తుమ్ములు మరియు కళ్ళలో దురద మొదలగునవి ఎలర్జీల లక్షణాలు. వీటిని గుర్తించి చికిత్స చెయ్యాలి లేకపోతే ప్రమాదకర అనఫైలక్షిస్ అనే స్థితి కి దారి తీయవచ్చు. ఈ సమస్యతో బాధపడే వాళ్ళకు మ్రింగడంలో ఇబ్బంది, ఉపిరి అందకపోవడం, కళ్ళు తిరగడం అలాగే పెదవులు, నాలుక, గొంతు మంట తో పాటు జీర్ణ వాహిక మంట కూడా ఉంటుంది. కొన్ని సార్లు, అపస్మారక స్థితి లో కి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.

ఎలార్జీలకి సహజ సిద్దమైన చిట్కాలు

యాంటి హిస్తమైన్, స్టెరాయిడ్స్ మరియు ఇకా కొన్ని చికిత్సా విధానాలు ఎలార్జీలని నిరోధించడానికి ఉపయోగపడతాయి. ఎలార్జీలని చికిత్స చేసేటప్పుడు ఎలర్జీ కారకాలని గుర్తిస్తే పూర్తిగా నిరోధించే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకి, వేరుశనగ ఎలర్జీ కలిగిన వారు ఆ పదార్ధాన్ని దూరం గా ఉంచాలి.

ఎలర్జీల నుండి బయటపడేందుకు కొన్ని చిట్కాలు

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

తేనె

ఎలార్జీలని నయం చేయడంలో అత్యుత్తమ ఫలితం తేనె వాడకం ద్వారా లభిస్తుంది. ఎలర్జీ కారకాలని తేనె నాశనం చేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచి ఎలర్జీ లక్షణాలను తగ్గించే విధంగా తేనె పనిచేస్తుంది. స్థానికంగా తయారు చెయ్యబడిన తేనె ఇందుకు సిఫార్సు చెయ్యబడుతుంది.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

క్వేర్సేటిన్

ఆపిల్స్, బెర్రీస్, ఉల్లిపాయలు అలాగే బ్లాక్ టీ లో క్వేర్సేటిన్ అనే యాంటిఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఎలర్జీలని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

విటమిన్ సి

విటమిన్ సి సహజసిద్దమైన యాంటిహిస్తమైన్ గా పనిచేస్తుంది. ఆహారంలో ని విటమిన్ సి యొక్క శాతం పెంచడం ద్వారా ఎలర్జీలను తగ్గించుకోవచ్చు. అన్తిహిస్తమైన్ డ్రగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

సహజసిద్దమైన యాంటీఆక్సిడెంట్లు

పళ్ళు మరియు కూరగాయాలలో సహజసిద్దమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ద్రాక్ష విత్తన సారం, అరటి పళ్ళు, టమాటో లు, కారట్స్ మరియు ఉల్లిపాయలు ఎలర్జీలకు చికిత్సగా పనిచేస్తాయి.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఉప్పు నీటితో పుక్కిలించడం

ఎలర్జీల వల్ల వాచిన గొంతు కి ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. వీటితో పాటు సెలైన్ నాసల్ స్ప్రే ని వాడటం వల్ల ముక్కు లో ఉన్న అలెర్జీ కారకాలను నిరోధించబడతాయి.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్

ఎలర్జిక్ రియాక్షన్స్ కలిగించే కెమికల్స్ ని నిరోధించే లక్షణాలు ఒమేగా - 3 ఫాటీ ఆసిడ్స్ కి ఉన్నాయి. వాల్నట్స్, ఫ్లాక్ష్సీడ్ ఆయిల్ ఇంకా ఫిష్ ఆయిల్ లో ఒమేగా - 3 ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

గ్రీన్ టీ

ఎలర్జీలకి విరుగుడుగా గ్రీన్ టీ పనిచేస్తుంది. రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఎలర్జీల సమస్య నుండి తప్పించుకోవచ్చు.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఆపిల్ సైడర్ వెనిగర్

ఎలర్జీల ద్వారా కలిగే దురదలు నశించే విధంగా ఆపిల్ సైడర్ వెనిగర్ పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్ళలో కలిపి ఎలర్జీ వచ్చిన ప్రాంతం లో ఈ వెనిగర్ రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కి బాక్టీరియా నుండి ఉపశమనం కలిగించే లక్షణం ఉంది.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

అల్లం

తేనె లాగే ఎలర్జీలని తగ్గించే లక్షణంగా అల్లం పనిచేస్తుంది. శ్లేష్మాన్ని తగ్గించే విధంగా అల్లం పనిచేస్తుంది. అర చెక్క అల్లం ని టీ లో కలిపి లేదా తేనె లో కలిపి తీసుకుంటే ఎలర్జీల నుండి రక్షణగా పనిచేస్తుంది.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

.వెల్లుల్లి

ఎలర్జీలని తగ్గించే లక్షణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వండిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి ఎంతో మంచిది. అందువల్ల 3 లేదా 4 రెబ్బల వెల్లుల్లిని తేనెతో కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలర్జీలు తగ్గుతాయి.

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

ఎలర్జీకి కారణాలు.. వాటి నివారణ చిట్కాలు..!

పిప్పరమెంట్

శ్లేష్మాన్నితగ్గించి అంటు వ్యాధులను అలాగే ఎలర్జీలను నివారించడం లో పిప్పరమెంట్ సహజమైన మందుగా పనిచేస్తుంది. అలాగే దగ్గు ,సైనస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Causes and Symptoms of Allergies

Allergies are caused by many factors such as food, drugs, insect bites, pet dander, and other allergens.
Desktop Bottom Promotion