For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తమా(ఉబ్బసం)తో బాధపడే వారికి 13 ఉత్తమ ఆహారాలు

|

ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య.ఆధునిక జీవన శైలి,కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం.

కారణాలు: చల్లగాలి(చల్లటి వాతావరణం), దుమ్ము, ధూళి, పొగ, అలర్జీ కారకాలు(గడ్డి చెట్లు, ఫంగస్, కాలుష్యం), రసాయనాలు(ఘాటు వాసనలు), శారీరక శ్రమ, వైరల్ ఇన్‌ఫెక్షన్, పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు, శ్వాసకోశాల్లో ఇన్‌ఫెక్షన్స్ వంటివి ఆస్తమాకు కారణమవుతున్నాయి.

ఆస్తమాను కంట్రోల్ చేయడానికి కొన్ని ఉత్తమ హోం రెమడీస్ ఉన్నాయి. ఉదాహరణకు, వేడినీటి ఆవిరిని పీల్చడం మరియు ఆస్తమాను నయం చేయడంలో తేనె కూడా ఒక బెస్ట్ పాపులర్ హోం రెమెడీ. మరియు మీరు తేనె మరియు నిమ్మరసంతో కూడా ఆస్తమాను నివారించుకోవచ్చు. ఇంకా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, తర్వాత ఉదయం తీసుకోవడం వల్ల ఆస్తమాను కంట్రోల్ చేయవచ్చు.

ఆస్తమాతో బాధపడే వారు క్రోనిక్ డిజార్డన్ ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే సరైన ఆహారనియమాలను పాటించాలి. ఆరోగ్యకరమైన విటమిన్స్ ఎ, ఇ, సి మరియు బీటాకెరోటిన్ వంటివి గొప్పసహాయకారిగా పనిచేస్తాయి . మీరు ఆస్తమాతో బాధపడుతున్నట్లైతే ఇక్కడ కొన్ని ఆహారాలున్నాయి, వీటిని మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంలో చేర్చుకోండి.

1. క్యారెట్స్:

1. క్యారెట్స్:

క్యారెట్స్ లో విటిమన్ ఎ మరియు యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది ఆస్తమాకు మేలు చేయడంతో పాటు, చర్మం, కేశాలకు మరియు పూర్తి ఆరోగ్యానికే చాలా మంచిది.

2. ఫిష్ ఆయిల్:

2. ఫిష్ ఆయిల్:

ఫిష్ ఆయిల్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శ్వాససంబంధిత సమస్యలకు చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యరకమైన ఫిష్ ఆయిల్ ను తీసుకోవడ ఉత్తమం.

3. రెడ్ బెల్ పెప్పర్:

3. రెడ్ బెల్ పెప్పర్:

వీటిలో విటిమన్ సి పుష్కలంగా ఉంది . శాస్వసంబంధనాళాల్లో ఇది ఇన్ఫ్లమేషన్ (మంటను)తగ్గిస్తుంది.

4. డైరీ ప్రొడక్ట్స్:

4. డైరీ ప్రొడక్ట్స్:

ఆస్తమా సమస్యతో బాధపడే వారు విటమిన్ డిని తక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి వారు హెల్తీ డైరీ ప్రొడక్ట్స్ ను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంట్రోల్ చేయవచ్చు.

5. బిటర్ గార్డ్:

5. బిటర్ గార్డ్:

కాకరకాయ మధుమేహగ్రస్తులకు ఒక ఉత్తమ నివారిణి, అలాగే ఆస్తమా వ్యాధి గ్రస్తులకు కూడా ఇది అద్భుత నివారిణిగా సహాయపడుతుంది. కాబట్టి కాకరకాయ రసాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల, ప్రేగులను శుభ్రం చేస్తుంది మరియు ఆస్తమాను కంట్రోల్ చేస్తుంది.

6. కాలీఫ్లవర్:

6. కాలీఫ్లవర్:

గ్రీన్ వెజిటేబుల్స్ చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో అత్యధిక శాతంలో విటమిన్స్, ప్రోటీన్స్ మరియు మినిరల్స్, శరీరానికి కావల్సినవి పుష్కలంగా ఉంటాయి.

7. కివి:

7. కివి:

కివి పండులో విటమిన్ సి పుష్కలం. ఇది ఆస్తమా పేషంట్స్ లో ఇన్ఫ్లమేషన్ మరియు ఊపిరితిత్తుల పనిచేయకపోవడాన్ని తగ్గిస్తుంది.

8. ఆరెంజెస్:

8. ఆరెంజెస్:

ఆస్తమా పేషంట్స్ లో ఇన్ఫ్లమేషన్ చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆరెంజెస్ ను తీసుకోని, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోండి.

9. ఆకుకూరలు:

9. ఆకుకూరలు:

మీకు ఆస్తమా ఉన్నట్లైతే మీ రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను చేర్చుకోండి. ఇవి ఆరోగ్యకరం మరియు పోషకారం కూడా.

10. జామకాయ:

10. జామకాయ:

జామకాయలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి ఆస్తమా రోగులకు చాలా మంచిది.

11. కాలే:

11. కాలే:

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ సి మరియు విటమిన్ ఏ అధికంగా ఉన్న ఒక సూపర్ ఫుడ్. మీరు ఆస్తమాతో బాధపడుతుంటే, మీరు కంట్రోల్ చేయాలంటే, కాలేను మీ డైట్ లో చేర్చుకోండి.

12.బ్రజల్ స్ప్రాట్స్:

12.బ్రజల్ స్ప్రాట్స్:

ఇవి అలెర్జీలను తగ్గిస్తుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆస్తమాకు గురిచేసే అలర్జీలనుండి రక్షణ పొందవచ్చు.

13. రెడ్ చిల్లీ:

13. రెడ్ చిల్లీ:

రెడ్ చిల్లీ, శ్వాసకు ఇబ్బంది కలిగించే మ్యూకస్ ను క్లియర్ చేస్తంది . ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది.

English summary

Foods To Control Asthma

Asthma is a very common health problem. Many people these days suffer from this breathing disorder. The chronic respiratory and lung disorder can be genetic at times. Other causes of asthma are internal allergy, eczema etc.
Story first published: Saturday, November 23, 2013, 13:09 [IST]
Desktop Bottom Promotion