For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వికారం, వాంతులు & నీరసం తగ్గించే10 బెస్ట్ ఫుడ్స్

|

వికారం అనేది నిజంగానే సమస్యాత్మకం కవాచ్చు. మీరు ఆహారం చూసినప్పుడు, మీరు వాంతివస్తున్నట్లు భావించడం మరియు వెంటనే ఆహారాన్ని తినకూడదనో కోరికను మీరు స్టాప్ చేస్తారు. అయితే, మీరు వికారాన్ని నివారించడానికి కేవలం మీరు ఆహారాన్ని తినకుండా మాస్తే అది శరీర ఆరోగ్యానికి మరింత హాని కలుగజేస్తుంది.

మీలో వికారం కలగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అది మీ పొట్టలో పండ్లు, అసిడిటి, ప్రెగ్నెన్సీ లేదా స్టొమక్ అప్ సెట్ వంటివి కారణం కావచ్చు. వికారం మరియు కడుపు నొప్పి వంటివి అజీర్ణంతో సహా వివిధ ఆరోగ్య పరిస్థితులు మరియు ఫుడ్ పాయిజన్, వైరల్ గాస్ట్రో వంటివి బయటపడవచ్చు. ఇంకా అజీర్తి లేదా స్టొమక్ అప్ సెట్, అజీర్ణం వంటివి మీరు తీసుకొనే ఆహారం చాలా వేగంగా తినడం, అతిగా తినడం, లేదా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, కారం లేదా గ్రీస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా తరచుగా సంభవించే ఒక సాధారణ సమస్య వికారం.

వికారంతో బాధపడుతున్నప్పుడు, మీకు ఏమి తినాలనిపించదు. వికారంగా ఉన్నప్పుడు తినేవాటిని చూసినాకూడా వెంటనే వాటిని పడేస్తారు. మీరు వికారంగా భావిస్తున్నట్లైతే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలో వాటి మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఘమఘుమలాడే కొన్నిఆహారాలు(ఆరోమా వాసనలు) కూడా మీలో వికారం కలిగేలా చేస్తాయి.

కాబట్టి మీరు వికారంతో బాధపడుతున్నప్పుడు మీకు ఉపశమనం కలిగించేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. ఉదాహరణకు, జ్యూసీగా ఉండే ఆపిల్ తినడం వల్ల మీ మానసిక స్థితిని తగ్గిస్తుంది మరియు వికారం, వాంతులను నిరోధించే శక్తిని మీకు అంధిస్తుంది. అదేవిధంగా, నిమ్మరసం కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది. మీరు వికారంతో బాధపడుతున్నప్పుడు తీసుకోవల్సిన కొన్ని ఆహారాలను ఇక్కడ అందిస్తున్నాం, వాటిని పరిశీలించండి...

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

ఆపిల్స్: పుష్కలమైన విటమిన్స్ మరియు మినరల్స్ ఉండే ఈ జ్యూసీ ఫ్రూట్ వికారానికి మంచి విరుగుడుగా పనిచేస్తుంది . మరియు మొత్తం ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం మరియు స్టొమక్ అప్ సెట్ అనేది ఉండదు.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

అల్లం: మంచి వాసనతో కూడిన ఈ ఆరోమా ఫ్లేవర్ అల్లం వికారం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీకు వికారంగా ఉన్నప్పుడు, చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకోవడం కానీ లేదా అల్లం టీ, అల్లం రసం వంటి వాటిని తీసుకోవడం వల్ల వికారం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

నట్స్: ప్రోటీనుల లోపం వల్ల కూడా ఎక్కువగా వికారం పొదుతారు. నట్స్ లో బాదం మరియు పీనట్స్ వంటివి తీసుకోవడం వల్ల మీకు కావల్సినంత ఎనర్జీ అందివ్వడంతో పాటు వికారాన్ని నివారిస్తుంది.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

క్రాకర్ బిస్కెట్స్: క్య్రాకర్ బిస్కెట్స్ మరియు బ్రెడ్ వంటివి స్టొమక్ యాసిడ్స్ తో చాలా లేలికగా శోషణించబడుతాయి మరియు వికారం నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

అరటిపండు: బనాన్ తక్షణం ఎనర్జీని అందించే ఒక బూస్టర్. వికారం వల్ల మీరు ఎల్లప్పుడూ చాలా అలసట, శక్తి లేకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి తక్షణ శక్తి పొందడానికి మరియు వికారాన్ని నిరోధించడానికి అరటి పండ్లు చాలా ఉత్తమమైనవి.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

పండ్ల రసాలు: పండ్ల రసాలో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అదే విధంగా వికారాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఫ్రూట్స్ ను ఎంపిక చేసుకొని, జ్యూస్ తయారుచేసి తాగడమే. గొప్ప ఎనర్జీ.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

నిమ్మరసం: నిమ్మరసంలో అలసటను తగ్గించే శక్తిసామర్థ్యాలు మరియు శక్తిలేకుండా ఉన్నప్పుడు మీకు కావల్సిన ఎనర్జీన తక్షణం అంధించే గుణాలు నిమ్మరసంలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కొంత నిమ్మరసం తాగి మీ శరీరానికి కావల్సిన హైడ్రేషన్ అందించి, అలసటను తగ్గించుకోండి.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

సిట్రస్ పండ్లు: వికారాన్ని నివారించడం లేదా అదుపు చేయడానికి సిట్రస్ ఫ్రూట్స్ లోని ఆరోమా మరియు ఫ్లేవర్ బాగా సహాయపడుతాయి. కాబట్టి వికారం తగ్గించుకోవడానికి సిట్రస్ పండ్లను లేదా పండ్ల రసాలను తీసుకోండి.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

పుదీనా: కొంత మంది పుదీనా ఆకులను లేదా పుదీనా చూయింగ్ గమ్ ను నములుతుంటారు. ఘాటైన సువాసనలుండే పుదీనా ఆకులు, వికారం, వాంతులను నివారించండా బాగా సహాయపడుతాయి.

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

వికారం & వాంతులు తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్

నీళ్ళు: వికారం అనేది తలనొప్పితో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి నీళ్ళను ఒక్కే సారి గుటకలు మింగడం కంటే కొంత విరామం ఇస్తూ కొంచె కొంచెం తీసుకోవడం చాలా ముఖ్యం.

English summary

Foods To Cure Nausea

 Nausea can be really troublesome. Whenever you see food, you feel like vomiting and the urge stops you from eating as well! However, skipping meals just to avoid nausea can be really bad for the health.
Story first published: Monday, October 21, 2013, 11:43 [IST]
Desktop Bottom Promotion