For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్స్

|

మన శరీరంలో ఒక సేంద్రీయ సమ్మేళనం అయిన యూరిక్ ఆమ్లం ఉంటుంది.ఇది ఒక ఉప ఉత్పత్తిగా రక్తప్రవాహంలో తిరుగుతూ మన శరీరం యొక్క జీవక్రియకు సహాయం చేస్తుంది. రక్తంలో యూరిక్ ఆమ్లం హెచ్చు స్థాయిలో ఉంటే ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తుంది. దీనిని గౌట్ అని పిలుస్తారు. శరీరం దీనిని విసర్జన చెయ్యలేకపోతే అప్పుడు దాని స్థాయి పెరుగుతుంది. శరీరంలో యూరిక్ ఆమ్లాలు పేరుకుపోతే గౌట్ మాత్రమే కాకుండా కిడ్నీలో రాళ్ళ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

మీరు ఈ పరిస్థితిని లేదా మీ తల్లిదండ్రులు లేదా తాతలకు ఈ సమస్య కలిగి ఉంటే కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తరచుగా యూరిక్ ఆమ్లం ప్రాసెస్,శరీరం యొక్క సామర్ధ్యానికి వారసత్వ అసాధారణతకు సంబంధం కలిగి ఉంటుంది. మీరు నిరోధించబడిన మరియు క్రమశిక్షణతో ఆహారపు అలవాట్లను అనుసరిస్తే కొంత వరకు నియంత్రించవచ్చు.

అనేక ఆహారాలు రక్తంలో యూరిక్ ఆమ్లంను పెంచుతాయి. కానీ నిజానికి కొన్ని ఆహారాలు ఈ సాంద్రతలు తగ్గించేందుకు సహాయపడతాయి.యూరిక్ ఆమ్లంతో బాధపడుతున్న వ్యక్తులు విటమిన్ సి,ఫైబర్ మరియు నీటిని,తాజా పండ్లు మరియు కూరగాయలను సమృద్ధిగా తీసుకోవాలని సూచించడం జరుగుతుంది.ఇవి శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాక వారు మాంసాహారాన్ని,ఆర్గాన్ మాంసాలు మరియు అత్యంత ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించమని సలహా ఇస్తారు.యూరిక్ ఆమ్లంతో బాధపడుతున్న వ్యక్తులు తినవలసిన ఆహారాలు గురించి తెలుసుకుందాము.

చెర్రీస్

చెర్రీస్

చెర్రీస్ రక్తంలో యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి వాడతారు. రక్తంలో మీ యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి చెర్రీస్ తప్పనిసరిగా తినాలి. మీరు చెర్రీ రసం లేదా డబ్బాలో ఉండే చెర్రీస్ ను కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి రోజు చెర్రీ సీరం తీసుకోవడం వలన శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తాయని నిరూపణ అయ్యింది.

రొట్టెలు, తృణధాన్యాలు

రొట్టెలు, తృణధాన్యాలు

సాధారణంగా రక్తం నుండి యూరిక్ ఆమ్లం తగ్గించేందుకు ఎవరికైనా సమతుల్య ఆహారం ఉండాలి.రొట్టెలు మరియు తృణధాన్యాలలో క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు,అధిక ప్రోటీన్ మరియు కొవ్వు తక్కువగా ఉంటుంది. తృణధాన్యాలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు,పండ్లు మరియు కూరగాయలలో ఫైబర్ ఉంటాయి. ఆహారాలు మరియు పోషకాలు సమానత్వం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫైబర్ శరీరంలో యూరిక్ ఆమ్లం అధికంగా పేరుకుపోకుండా నివారిస్తుంది.

అరటిపండ్లు

అరటిపండ్లు

అరటిపండ్లు మరియు కర్బూజాలలో పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం అంటే దానిలో సోడియం మంచి భాగంగా ఉండాలి.అరటిపండు మరియు ఇతర పండ్లలో ఉండే సోడియం రక్తంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గించడానికి సహాయం చేస్తుంది.

కూరగాయలు

కూరగాయలు

క్యాబేజీ,పార్స్లీ బచ్చలికూర,ఆస్పరాగస్,బఠానీలు మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలు శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిని తగ్గించడానికి సహాయం చేస్తాయి. ఆహారంలో క్యాబేజీ,బటానీలు మరియు కాలీఫ్లవర్ లాంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గించవచ్చు.

నీరు

నీరు

మీ శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయి తగ్గించడానికి కనీసం ప్రతి రోజు 2-3 లీటర్ల నీరు త్రాగటానికి ప్రయత్నం చేయాలి. నీరు యూరిక్ ఆమ్లంతో సహా మీ వ్యవస్థ యొక్క విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. ఎక్కువగా ద్రవాలు త్రాగటం వలన మీ శరీరంలో ఉన్న అదనపు యూరిక్ ఆమ్లంను తొలగించటానికి సహాయం చేస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసం

మీ శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజు నిమ్మరసం త్రాగాలి. కాల్షియం కార్బోనేట్ శరీరంలో తటస్థం ఆమ్లాలకు సహాయపడుతుంది. అయితే యూరిక్ ఆమ్లం మరియు నిమ్మరసం కలిపి కాల్షియం కార్బోనేట్ ఉత్పత్తికి సహాయపడతాయి.

గుడ్లు

గుడ్లు

గుడ్లులలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని తెలుసు. కానీ అది లెసిథిన్ కలిగి ఉంటుంది. ఇది కొవ్వు విడగొట్టగల సామర్థ్యాన్ని కలిగిన ఒక అద్భుతమైన జీవ డిటర్జెంట్ ఉందని చెప్పవచ్చు. అందువలన శరీరంలోయూరిక్ ఆమ్లం స్థాయిలుఎక్కువగా ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరమైన ఆహారంగా చెప్పవచ్చు.

నారింజ మరియు బంగాళదుంపలు

నారింజ మరియు బంగాళదుంపలు

విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లు మరియు కూరగాయలను తప్పనిసరిగా తినాలి. కొన్ని అధ్యయనముల ప్రకారం మూత్రపిండాలు ద్వారా యూరిక్ ఆమ్లం విసర్జన పెంచడానికి సహాయపడుతుందని నిరూపన అయ్యింది.

కాఫీ

కాఫీ

కాఫీ, హెర్బల్ మరియు గ్రీన్ టీ కూడా ఈ వైద్యపరమైన పరిస్థితిలో బాధపడుతున్న వ్యక్తుల కొరకు చాలా మంచివి. కెఫీన్ లేని కాఫీ అయితే యూరిక్ ఆమ్ల స్థాయిలను పెంచదు.

తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తులు

తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తులు

తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు రక్తంలో యూరిక్ ఆమ్ల స్థాయిని తగ్గిస్తాయి. తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులను ఎంచుకోండి.కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఉత్పత్తులు గౌట్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయం చేస్తాయని నిరూపన జరిగింది.

English summary

Foods For People With Uric Acid

Our body contains an organic compound, uric acid. It is a by-product of our body's metabolism that circulates in the bloodstream. The increased level of uric acid in blood leads to the arthritis problem known as gout.
Story first published: Friday, November 1, 2013, 10:48 [IST]
Desktop Bottom Promotion