For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్సర్ కు ఉపశమనం కలిగించే అత్యుత్తమ ఆహారాలు!

|

ప్రస్తుత కాలంలో చాలా మందిని పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్. చిన్న ప్రేగు, అన్నవాహిక మరియు కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగి ఉండటం అనేది అల్సర్ గా భావిస్తారు. దీనికి కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. వేళకు తీసుకోని ఆహారం, తీసుకున్నా హడా వుడిగా క్షణాల్లో ముగించటం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం.... వీటితో పాటు నిత్యం ఎదుర్కునే మానసిక ఒత్తిడి తోడుకావటంతో 'గ్యాస్ట్రిక్‌ అల్సర్‌' సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. కడుపు పై బాగంలో వచ్చేటటువంటి అలర్స్ గా భావిస్తారు.

పస్తుత సైంటిస్ట్ ల పరిశోధనల ప్రకారం అల్సర్ కు హిలికోబ్యాక్టర్ పైలోరి, లేదా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా కారణం కావచ్చు అని కనుగొన్నారు. వీటికి ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమే, చాలా వరకూ ఈ అల్సర్ అలాగే కొనసాగుతుంది. అల్సర్ అనేది కడుపులో యాసిడ్ పుడ్స్ జీర్ణం అవ్వడం కానీ లేదా చిన్న పేగు యొక్క గోడలు పాడవుతాయి. ఒక్కోసారి ఒత్తిడి, డయట్ మరియు జీవనశైలిలో మార్పులు ఇవన్ని కూడా అల్సర్ కు కారణం అవుతాయి.

లక్షణాలు: జీర్ణాశయంలో అల్సర్‌ ఏర్పడటం వల్ల కడుపులో నొప్పి, మంట రావటం తేనుపులు ఎక్కువగా ఉండటం, గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగ ఉండటం, కడుపులో గడబిడలతో పుల్లటి తేనుపులు రావడం, తిన్నది సరిగా జీర్ణం కాక పోవటం, వాంతులు కావటం వంటివి వుంటాయి. అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి, మంటతో నిద్రాభంగం కావడం ఏమీ తినకపోతే కడుపునొప్పి రావడం ఏదైనా తినగానే వాంతులు కావడం. భోజనం మొత్తం తినలేకపోవడం, అంటే... కాస్తంత తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపించడం. కొందరిలో రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి

చాలా మంది అల్సర్ తగ్గించుకోవడానికి యాంటిబయాటిక్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే కడుపు పుండు ఉపశమనానికి అత్యంత ప్రభావవంతమైన పరిహారం మంచి ఆహారం తీసుకోవడమే. కొన్ని రకాల ఆహారాలు ఈ స్టొమక్ అల్సర్ ను ఎదుర్కోవడానికి యాంటీబయాటిక్స్ లా సహాయపడుతాయి. ఈ ఆహారాలను మీ డైట్ చేర్చుకొన్నట్లైతే, అప్పుడు మీ సమస్యను పరిస్కరించుకొన్నట్లై..అటువంటి ఆహారాలు స్టొమక్ అల్సర్ ఉపశమనానికి కొన్ని ఉత్తమ ఆహారాలు మీకోసం...

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

ఆర్గానిక్ హనీ: ఆర్గానిక్ హనీ(తేనె)లో పుష్కలమైన యాంటీబాక్టీరియల్ మరియు యాంటీవైరన్ లక్షణాలు నిండిఉంటాయి. ఇవి చాలా ప్రభావంతంగా పోరాడే లక్షణాలను కలిగి ఉండి హె ను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. పైలారీ బాక్టీరియా మరియు కడుపు అల్సర్ కు ఉపశమనం కలిగిస్తుంది. తేనె కూడా కడుపు, అన్నవాహిక మరియు ప్రేగు యొక్క చిరాకును తొలగించి ఉపశమనం కలిగిస్తుంది. అల్సర్ వల్ల ఏర్పడే కడుపు ఉబ్బరాన్ని మరియు బాధకరమైన అనుభూతిని తగ్గిస్తుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

పెరుగు: స్టొమక్ అల్సర్ కు కారణం అయ్యే క్రిమిసంహారినిగా పెరుగులోని బ్యాక్టీరియా సహాయపడుతుంది. మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్సర్ వల్ల నొప్పి కలిగించే హానికరమై బ్యాక్టీరియాను నాశనం చేయడానికి, పెరుగులోని బ్యాక్టీరియా ఉపయోగకరమైనదిగా ఉంటుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

సెరీల్: సెరీల్ లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు పెద్ద మొత్తంలో కలిగి ఉండి స్టొమక్ అల్సర్ నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. సెరీల్ ను ఫైబర్ జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతాయి. మరియు తీసుకొన్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడాన్ని మెరుగుపరుస్తుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

క్యాబేజ్: స్టొమక్ అల్సర్ తొలగించడానికి సహాయపడే అమైనో ఆసిడ్స్, ఎల్ గ్లుటమైన్, మరియు gefarnateసమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవాహిక గోడలకు అంటుకొన్న అల్సర్ (పుండు)ను నాశనం చేయడానికి సళహాయపడుతాయి. మరియు అల్సర్ ఏర్పడే అవకాశం లేకుండా కాపాడుతుంది. మరియు ఉన్న అల్సర్ నుండి రక్షణ కల్పించడానికి మరియు నొప్పిని, డ్యామేజ్ ను తగ్గించడానికి ఇవి మ్యూకస్ ఉత్పత్తిని పెంచుతుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

అరటి పండు: అల్సర్ నుండి ఉపశనం కలిగించడంలో అరటిపండు అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులోని పిండి పదార్థాలు కడుపు మంటను చల్లార్చుతాయి . వీటిలో ఇంకా యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి, అల్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను రూపుమాపడానికి, బాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

బ్రౌన్ రైస్: స్టొమక్ అల్సర్ తో బాధపడేవారికి బ్రౌన్ రైస్ అద్భుతంగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ లోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి, గోధుమ బియ్యం కడుపు పూతల బాధపడుతున్న సమయంలో తినడానికి ఒక అద్భతమైన ఆహారం. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడానికి ఒక ధాన్యపు ఆహారం. ఇది శరీరం యొక్క పనితీరును దెబ్బతీయకుండా ఉండేందుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు అందిస్తుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

కాటేజ్ చీజ్: స్టొమక్ అల్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి కాటేజ్ చీజ్ లో ఉండే బ్యాక్టీరియా బాగా సహాయడుతుంది . ఇది అల్సర్ కు పూతలా పనిచేస్తుంది మరియు అల్సర్ వల్ల ఏర్పడే మంట, నొప్పిని నిరోధిస్తుంది. మరియు వాపునుండి ఉపశమనం కలిగిస్తుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

వెల్లుల్లి: స్టొమక్ అల్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను నిరోధించే లక్షణాలు కలిగి బ్యాక్టీరియా వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి, స్టొమక్ అల్సర్ నుండి పూర్తి రక్షణ కల్పించబడుతుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

సిట్రస్ లేని ఆహారాలు: స్టొమక్ అల్సర్ ను నిరోధించడం కోసం సిట్రస్ యాసిడ్ లేని ఆహారాలు తీసుకోడం అద్భుతమైన మార్గం. స్టొమక్ అల్సర్ తట్టుకొనేందుకు ఉపయోగపడే న్యూట్రీషియన్స్ ను ఇది అంధిస్తుంది. మరియు నొప్పిని నివారిస్తుంది. కాబట్టి అల్సర్ ఉన్న వారు, యాసిడ్స్ కలిగి ఉన్నటువంటి ఆరెంజ్, టమోటో, పైనాపిల్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

బంగాళదుంప: స్టొమక్ అల్సర్ నుండి ఉపశమనం కలిగించడంలో బంగాళదుంప ప్రయోజనకారిగి ఉంది. ఇందులో ఒక తేలికపాటి వాసన కలిగి ఉంటుంది. కానీ, మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే అల్సర్ లక్షణాలను వేగవంతం చేస్తుంది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

స్పైసీ ఫుడ్స్ కు దూరం: మీరు ప్రతి రోజూ తీసుకొనేటటువంటి ఆహారంలో కారం ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా వుండాలి. లేదంటే అల్సర్ నొప్పి విపరీతంగా మిమ్మల్ని బాధింవచ్చు.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

రెడ్ క్యాబేజ్: క్యాబేజ్ ను అలాగే తినడం కానీ లేదా జ్యూస్ చేసుకొని తాగడం కానీ చేయడం వల్ల అల్సర్ కు ఉపశమనం కలిగించవచ్చు.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

ఫైబర్ ఫుడ్: ఫైబర్ అధికంగా ఉన్నటువంటి తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తరచూ మీ డైయట్ లో చేర్చుకోవడం వల్ల అల్సర్ బారీన పడకుండా మిమ్మల్మి కాపాడుకోవచ్చు.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

ఫ్లెవనాయిడ్స్: ఫెవనాయిడ్స్ అధికంగా ఉండేటటువంటి ఆహారంను, పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్స్, సెలరీ, క్రాన్ బెర్రీస్, వెల్లుల్లి, మరియు ఉల్లిపాయలు, వంటి వీటిలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. కాబట్టీ ఇటువంటి పండ్లను, లేదా కూరగాయాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

అల్సర్ నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ ఆహారాలు!

యాంటీఆక్సిడెంట్స్: ఇన్ డైజషన్ లేదా ఛాతీలో మంట వంటి అల్సర్ లక్షణాలను నివారించడానకి యాంటాసిడ్స్ ఉన్న ఆహారాలను తిని కంట్రోల్ చేయవచ్చు.

English summary

Foods To Soothe Stomach Ulcers

Painful and tender sores that develop in the regions of your small intestine, esophagus and stomach are called ulcers. The main symptom of such ulcers are a burning sensation in your stomach.
Desktop Bottom Promotion