For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకానికి కారణం అయ్యే టాప్ 10 ఆహారాలు

|

ప్రస్తుత రోజు జీవనశైలిలో మార్పలు, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల శారీరకంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల్లో మలబద్దం అనే సమస్య చిన్న సమస్యే అయినా...అసౌకర్యమైనటువంటి అనారోగ్య సమస్య ఇది. అయితే ఈ మలబద్దకం అనే సమస్యకు తక్షణం చికిత్స అందించకపోతే అనేక అనారోగ్యం సమస్యలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. ఉదాహరణకు : మలబద్దకం ఎన్ని రోజులైనా తగ్గకుండా, సమస్య అలాగే కొనసాగితే పైల్స్(మొలలకు)దారితీస్తుంది. కాబట్టి, మలబద్దకం రెండు మూడు రోజుల్లో తగ్గనట్లైతే ఆ సమస్యకు గల ప్రధాణ కారణం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యకు ప్రధాన కరాణం ఆహారం, కొన్ని రకాల ఆహార పదార్థాలు మలబద్దకానికి గురిచేస్తాయి. అటువంటి ఆహారాలను తెలుసుకొని, నివారించడం వల్ల మీ రెగ్యులర్ బౌల్ మూమెంట్ సాఫీగా అయ్యేలా చేసుకోవచ్చు.

మలబద్దకానికి ప్రధాన కారణం ఫ్రైడ్ ఫుడ్స్. ఎందుకంటే, ఆయిల్ తో తాయరుచేసే వంటకాలు, జీర్ణం అవ్వడం చాలా కష్టం మరియు తిన్న ఆహారం ప్రేగులో విచ్చిన్నం చేయడానికి కూడా ఎక్కువ సమసయం తీసుకుంటుంది. జీర్ణవ్యవస్త నిదానం అవుతుంది, దాంతో మలబద్దకం మొదలవుతుంది. ఇంకా, ఫ్రోజన్ ఫుడ్స్ కూడా మలబద్దకానికి ప్రధాణ కారణాలలో ఒకటి . ఎందుకంటే ఫ్రోజోన్ ఫుడ్స్ లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి ఒక బెస్ట్ రెమడీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలే. లాక్సెటీవ్స్ కూడా మలబ్దకాన్ని నివారించడం సహాయపడుతాయి. కాబట్టి, సమస్యను తెచ్చుకోవడం కంటే ఇటువంటి ఆహారాలను తినడం మానేసి సమస్య రాకుండా నివారించడం చాలా ఉత్తమం.

మలబద్దకాన్ని రెగ్యులర్ ప్రాబ్లెమ్ గా చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి, ఒక వేళ మీరు ఈ సమస్యతో ఆల్రెడీ బాధపడుతున్నట్లైతే మలబద్దకానికి కారణం అయ్యే ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ నుండి తొలగించండి. ...

ఐస్ క్రీములు:

ఐస్ క్రీములు:

ఐస్ క్రీములలో చాలా వరకూ జిల్చ్ ఫైబర్ కలిగి ఉంటుంది. అది మీ రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్ కు ఏ మాత్రం సహకరించదు. ప్లస్ ఐస్ క్రీములలోని పంచదార మరియు పాలు వంటి పదార్థాలు సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.

చిప్స్:

చిప్స్:

చిప్స్ వేగించినవి, క్రిస్పీగా ఉన్నవి మరియు వీటిలో ఫైబర్ కంటెంట్ అస్సలుండదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మలబద్దకానికి దారితీసే ఆహారంగా గుర్తించి వీటికి తినకుండా నివారించడం చాలా ఉత్తమైన మార్గం.

అరటి:

అరటి:

అరటి పండు ఒక క్లాసిక్ ‘బిన్ డర్'. కాబట్టి, రెండుకు మించి ఎక్కువ మోతాదులో అరటిపండ్లను తీసుకుంటే మలబద్దకానికి గురికాక తప్పదు.

అత్యధికంగా పాల ఉత్పత్తులు:

అత్యధికంగా పాల ఉత్పత్తులు:

అత్యధికంగా డైరీ ప్రొడక్ట్స్ ఏదైనా సరే (బట్టర్, చీజ్ లేదా పనీర్)తీసుకుంటే , మీ జీర్ణవ్యవస్థను నిదానం చేసేస్తుంది. ఆ విరామం జీర్ణం అవ్వడానికి మరింత సమయం తీసుకుంటుంది. దాంతో మలబద్దకం మొదలవుతుంది.

అన్నం:

అన్నం:

అన్నంలో అధికంగా గంజి ఉంటుంది. ఈ స్టార్చ్ చాలా చిక్కగా ఉండటంతో ప్రేగులో ఆహారాన్ని ముందుకు కదలనివ్వదు. కాబట్టి స్ట్రార్చ్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణంకు మరియు మలబద్దకానికి గురికావల్సి వస్తుంది.

కుక్కీస్:

కుక్కీస్:

కుక్కీస్ లో ఫైబర్ మరియు ఫ్లూయిడ్స్ రెండూ తక్కువే. మరియు రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్ కు ఈ రెండూ చాలా ప్రధానమైనవని మీకు తెలుసు. ప్లస్, ఇందులో ఉండే సోడా కంటెంట్ మీ జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

రెడ్ మీట్ జీర్ణం అవ్వడానికి చాలా కష్టం మరియు ఇందులో అత్యధికంగా ఐరన్ కలిగి ఉంటుంది. రెడ్ మీట్ లో ఉండే ఐరన్ స్టూన్ ను మరింత డార్క్ గా మరియు నల్లగా మార్చుతుంది . అందువల్లే, రెడ్ మీట్ మలబద్ధం సమస్యతో బాధపడేవారికి చాలా చెడ్డదని చెప్పవచ్చు.

ఫ్రోజోన్ ఫుడ్స్:

ఫ్రోజోన్ ఫుడ్స్:

ఫ్రోజోన్ ఫుడ్స్ మన సమయాన్ని మరియు మన ఎనర్జీని తగ్గిస్తుంది, అయితే అనేక ఆనారోగ్యసమస్యలకు గురిచేస్తుంది. వీటిలో చాలా తక్కువ శాతంలో ఫైబర్ మరియు బౌల్ మూవ్మెంట్ కు అంతరాయం కలిగించే ప్రిజర్వేటివ్స్ ను కలిగి ఉంటుంది.

పిండి పదార్థాలు:

పిండి పదార్థాలు:

పిండిపదార్థాలు చాలా రిఫైండ్ చేయబడి ఉంటాయి మరియు వీటిలో ఫైబర్ మొత్తం తీసివేయబడి ఉంటుంది. కాబట్టి రిఫైన్డ్ పిండికంటే, మల్టీగ్రెయిన్ పిండిని తీసుకోవడం ఉత్తమం. దాంతో మీకు ఎక్కువ ఫైబర్ లభ్యమయ్యి, మలబద్దక సమస్య తక్కువ అవుతుంది.

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:

ఆహారాలను ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల వాటిలోని స్వచ్చమైన ఫైబర్ తొలగిపోతుంది. ఉదా: ఫ్రైడ్ చికెన్, బంగాళదుంప మొదలగునవి బౌల్ మూవ్మెంట్ కు చాలా చెడు చేస్తుంది.

English summary

Foods That Cause Constipation

Constipation is a minor for inconvenient health problems. But, if constipation becomes chronic it can cause many severe health problems too. For example, piles is a long term effect of constipation. So it is very important to detect the cause of constipation on time.
Story first published: Wednesday, October 30, 2013, 18:01 [IST]
Desktop Bottom Promotion