For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

|

కడుపులో గ్యాస్‌, కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది వైద్యున్ని సంప్రదించడం సాధారణమైంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గమనించాలి.

కారణాలు : ఎక్కువ సేపు ఒకే చోట కూర్చునేవారు, వ్యాయామం లేనివారు, అతిగా నిద్రపోయేవారు, కొన్ని మందుల వల్ల జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్‌ ఏర్పడుతుంది. ఇది ఉర్ధ్వముఖంగాని, అపానవాయువుగా గాని బయటికిపోవాలి. లేదంటే మనిషిని చాలా కష్టపెడుతుంది.

జీర్ణవ్యవస్థ లోపం వల్ల, పిత్తాశయ వ్యాధి వల్ల, జీర్ణాశయానికి, పేగులకు ఆపరేషన్‌ తర్వాత గాని, జీర్ణవ్యవస్థలో వ్యాధులవల్ల, పిండి పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల (కూరగాయలు అంటే క్యాబేజి, ఆలుగడ్డ, కందగడ్డ శ్యామగడ్డ, వుల్లి), పేగులలో వుండే కొన్ని బ్యాక్టీరియా ప్రభావం వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడుతుంది. అమీబియాసిస్‌లో గ్యాస్‌ ఎక్కువగా వుండవచ్చు.

లక్షణాలు : కడుపు ఎప్పుడు ఉబ్బరించుకోవడం. అన్నంతిన్న తర్వాత ఆయాసంగా ఉండడం. కడుపు, గుండెలో మంటగా ఉంటుంది. తేన్పు రావడానికి ఇబ్బంది. తేన్పులు వచ్చినప్పుడు అపానవాయువు ద్వారాగాని గ్యాస్‌ బయటికిపోతే ఉపశమనం కలగడం. ఏమి తిననప్పుడు కూడా కడుపు ఉబ్బరించుకోవడం. నడవడానికి కూడా ఇబ్బంది పడడం. మరి ఎసిడిటినీ తగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలున్నాయి..అవేంటో ఒక సారి పరిశీలించండి..

MOST READ: ఈ అలవాట్లు ఉంటే కిడ్నీ వ్యాధులు తప్పవుMOST READ: ఈ అలవాట్లు ఉంటే కిడ్నీ వ్యాధులు తప్పవు

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

ఓట్ మీల్: ఓట్ మీల్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ . ఇది కేవలం కడుపు నింపడమే కాదు రిప్లక్సన్ కు కారణం కాదు.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

అల్లంతో నియంత్రణ: యాసిడ్ రిఫ్లెక్షన్ కు అల్లం ఒక ఉత్తమ ఆహారం. అల్లంను యాంటీఇన్లమేటరీ మరియు జీర్ణకోశ వ్యాధులకు కొరకు పురాతన కాలం నుండి చికిత్సకు ఉపయోగిస్తున్నారు.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

అలోవెరా: కలబంద ఒక సహజ నివారిణిగా పనిచేస్తుంది.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

రూట్స్ అండ్ వెజిటేబుల్స్: క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, ఆస్పరాగస్, గ్రీన్ బీన్స్, మరియు ఇతర గ్రీన్ వెజిటేబుల్స్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు ఉత్తమ ఆహారాలు. ఈ గ్రీన్ మరియు రూట్ వెజిటేబుల్స్ ను ఎసిడి సమస్యతో బాధపడేవారికి ఎక్కువగా తీసుకోమని సలహా ఇస్తుంటారు.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

కాస్కస్ మరియు రైస్ కాస్కస్ (సెమోలినా వీట్)బుల్గుర్ వీట్, మరియు బియ్యం(ముఖ్యంగా బ్రౌన్ రైస్) యాసిడ్ రిఫ్లెక్షన్ కోసం ఇవన్నీ అత్యుత్తమ ఆహారాలుగా ఉన్నాయి. వీటిలో ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్ ఒక మంచి కార్బోహైడ్రేట్ ఉంది.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

చల్లటి పాలు: 2-3టేబుల్ స్పూన్ల చల్లటి పాలు ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

కాఫీ: కాఫీ, టీ, మానేయాలి. ఇవి ఆవ్లూశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. కాఫీ తాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇందులో ఎక్కువగా కెఫిన్ ఉండటం వల్ల ఎసిడిటికి కారణం అవుతుంది. కాఫీ, టీలకు బదులు హెర్బల్ టీ కి ప్రాధాన్యత ఇవ్వండి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

గోరువెచ్చని నీరు: ప్రతి రోజూ గోరువెచ్చని నీరు ఒక గ్లాసు త్రాగాలి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

అరటి: అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్(సహజ ఆమ్లహారం) ఉండి గుండె మంటను నుండి ఉపశమన పొందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణకోశం శుభ్రపరచడానికి మరియు మలబద్ధకం నివారికి బాగా సహయపడుతుంది. అరటి పండుతో పాటు పుచ్చకాయ మరియు కీరదోసకాయను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

కొబ్బరి బోండాం: తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎసిడిటి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

భోజన సమయం: భోజనానికి..భోజనాకి మధ్య ఎక్కువ సమయం తీసుకొన్నప్పుడు ఎసిడిటికి దారితీస్తుంది. సరైన సమయానికి తక్కువ ఆహారం తీసుకొన్నా పర్వాలేదు. టైమ్ టు టైమ్ భోజనం చేయాలి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

ఊరగాయలు: నిల్వ పచ్చళ్ళు తీసుకోవడం మానుకోవాలి. వీటిని నిల్వ చేయడం కోసం అధికంగా ఉప్పు, నూనెలు, కారం వంటివి అధికంగా ఉపయోగిస్తారు. ఇవన్నీ ఎసిడిటికి ప్రత్యక్ష కారణాలు. వీటితో పాటు కారంగా ఉన్న చట్నీలు, వెనిగర్ మొదలగునవి కూడా తగ్గించాలి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

పుదీనా ఆకులు: కొద్దిగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరగ కాచి, ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగాలి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

లవంగం: ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకొని నమలి సారాన్ని మింగడం ద్వారా ఎసిడిటి నుండి ఉపశమనం పొందవచ్చు .

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

బాదాం, పెరుగు, బెల్లం: బెల్లం, బాదం, మరియు పెరుగు వంటివి ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనంలో కలిగించడంలో సమర్తవంతంగా పనిచేస్తాయి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

ఆల్కహాల్: బీర్‌, వైన్‌, విస్కి, బ్రాంది తదితరాలను మానేయాలి. ఇవి ఆవ్లూశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళంలోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి ఆల్కహాల్, బెవరేజస్ ను తీసుకోకపోవడం మంచిది.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

చూయింగ్ గమ్: చూయింగ్ గమ్ నమలడం వల్ల లాలాజలం ఉత్పతి అయ్యి అన్నవాహిక ద్వారా ఆహారం తరలించడానికి సహాయపడుతుంది. దాంతో గుండెల్లో మంటను నివారించుకోవచ్చు.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

బీన్స్: వెజిటేబుల్స్ అంటే మునగకాడ, బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజ్, క్యారెట్ మరియు చిన్న ఉల్లిపాయలు వంటివి రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

స్మోకింగ్: స్మోకింగ్ చేయకూడదు. సిగరెట్ పొగవల్ల అమాశయపు లోపలి పొర రేగటమే కాకుండా, ఒకవేళ అల్సర్లు ఏవన్నా తయారైతే మొండిగా మారతాయి.

ఎసిడిటిని తగ్గించే ఆహారాలివి..!

కార్బోనేటెడ్ డ్రింక్స్: కాఫీ, టీ, కోలా డ్రింక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆవ్లూశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.

English summary

Foods that Help Fight Acidity

Acidity occurs when there is excess secretion of acids in the gastric glands of the stomach.Below are the foods which can help to reduce acidity.
Desktop Bottom Promotion