For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల పండ్ల రసాలు... వాటి ఆరోగ్య ప్రయోజనాలు..

|

ప్రస్తుత రోజులలో ఒత్తిడి ప్రతి ఒక్కరిని అలసిపోయేలా చేస్తోంది. ఎన్ని ఆహారాలు తీసుకొన్నప్పటికీ ఒత్తిడి కారణంగా అవన్నీ మనలను నీరసించేలానే చేస్తూంటాయి. ప్రత్యేకించి చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. ఉదయం 11 గంటలకు ఒక కాఫీ లేదా సాయంత్రం 4 గంటలకు ఒక ‘టీ' వంటివి ఎప్పటికపుడు శక్తి పొందేందుకు తాగి పని చేస్తూంటారు. కాఫీలు, టీల వంటివి తాత్కాలికంగా మనలోని శక్తిని పెంచి పని చేసేలా చేసినప్పటికి, వాటి ప్రభావంగా మరల సాయంత్రం అయ్యే సరికి అలసిపోక తప్పదు. అందుకు ప్రత్యామ్నాయంగా పండ్ల రసాలను తీసుకోవడం చాలా మంచిది.

పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం. సాధారణంగా సెలిబ్రిటీలు, మోడల్స్, సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు, కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు. కొంతమందికి 4 మరికొంతమంది 5 లేదా 6 కిలోల బరువు కూడా తగ్గిపోతూంటుంది. రసాల ఆహారం మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలినాలు వెలికి తీస్తుంది. చర్మం మెరిసేలా, తల వెంట్రుకలు బలపడేలా చేస్తుంది. పండ్లలో చాలా వాటికి మంచి పోషకాలుంటాయి. అంతేకాదు, తాజా పండ్ల రసాలను శరీరం అతి త్వరగా పీల్చేసుకుని జీర్ణ చేసుకుంటుంది. రోజువారీ జీవితంలోఎవరెంత బిజీ షెడ్యూలు కలిగి వున్నా తప్పకుండా ఒక్క గ్లాసెడు పండ్ల రసం శరీరానికి మేలు చేస్తుందనేది గ్రహించి తాగుతూండాలి. ఏ కాలంలో దొరికే ఆ పళ్ళు(సీజనల్ పండ్లు), ఆ కాలంలో తినాలి. అందువల్ల అప్పుడప్పుడు వచ్చే శారీరక వ్యాధులు నయం అవుతాయి. అంతేకాకుండా పళ్ళు, పళ్ళరసాలు వల్ల అనేక ఉపయోగాలున్నాయి. అవి ఏమిటంటే.

ఫలాలు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యవరాలు, ఇవి సహజమైన మందులు. వీటలో ఎన్నో ఔషథగుణాలు న్నాయి. మందుల కన్నావీటి ఖర్చుతక్కువ. బిట్టర్‌ పిల్స్‌ కన్నా, స్వీట్‌ ఫ్రూట్‌ జ్యూసులతో అనేక రోగాల్ని సరిచేస్తాయి. వండిన ఆహారంలో ఎన్నో పోషకవిలువలు నశిస్తాయి. పళ్ళు అన్ని రకాల పోషకవిలువలు కల్గి ఉంటాయి. పళ్ళల్లో ఉన్న పోషకాలు సులువుగా శరీరంలోకి గ్రహించబడతాయి. శరీర ఆరోగ్యం కోసం అన్ని పళ్ళు తినవచ్చు. ప్రత్యేక వ్యాధుల నిర్మూలనకు కొన్ని నియమిత ఫలాలు అవసరమవు తాయి. ఉదయం పూటమాత్రమే తీసుకోవాలని వైద్య సలహా. లివర్‌, కిడ్నీల వ్యాధులు, క్యాన్సర్‌, గేట్‌, ఆర్థ్రరైటీస్‌ వంటి వ్యాధులు కూడా జ్యూసెస్‌తో నయమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి ఎన్నో జ్యూసెస్‌ అత్యుత్తమ ఫలితాలని స్తున్నాయి. ఒకటి, రెండు ఫలాలు అప్పుడప్పుడు తినడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. సమృద్ధిగా నిరంతరం తింటేనే ఆయా ఫలితాలు పొందవచ్చు.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

ఆపిల్ జ్యూస్: యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

ఆప్రికాట్ జ్యూస్: ఇందులో అధిక శాతంలో విటమిన్స్ ఎ, బి, సి మరియు కె ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ ను షుష్కలంగా కనుగొనబడింది. ఇది వయస్సును పైబడనీయకుండా చేస్తుంది. మరియు వయస్సు సంబంధింత సమస్యలు ఏర్పడనియ్యదు. అంతే కాదు ఎముకల బలానికి, చర్మ, కురుల సంరక్షణకు బాగా సహాయపడుతుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

బ్లాక్ బెర్రీ జ్యూస్: విటమిన్ సి మరియు ఇ వల్ల పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్ వల్ల ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు మధుమేహాన్ని తగ్గింస్తుంది. అంతే కాదు, రక్తాన్ని శుద్ది చేసి, గొంతు నొప్పిని నివారిస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

ద్రాక్ష రసం: ఇందులో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, కాపర్, ఐయోడిన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటివి ఫుష్కలంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో గుండె ఆరోగ్యానికి, గౌట్, కీళ్ళనొప్పులకు, లివర్ సమస్యలకు, హెమరాయిడ్స్ మరియు ఇతర అలెర్జీలను పోగొట్టేందుకు సహాయపడే మరికొన్ని అధనపు ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

కివి ఫ్రూట్ జ్యూస్: ఇందులో విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలం. ఇది అధిక శాతంలో ఫైబర్ మరియు జీర్ణ శక్తిని పెంచే గుణాలు అధికం. అంతే కాదు రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

నిమ్మరసం: నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్వౌషదం అంతే కాదు. చర్మాన్ని శుభ్రపరచుటలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు కలిగి ఉన్నది. చర్మాన్ని శుభ్ర పరిచి ఫ్రెష్ గా ఉంచుతుంది. నిమ్మకాయను సౌందర్యాన్ని పెంచే ఖచ్చితమైన నేచురల్ బ్లీచ్ అని చెప్పవచ్చు. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు కమిలిన చర్మాన్ని బాగు చేసి, ముఖంలో ఉన్న మొటిమలు మచ్చలను తొలగిస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

ఆరెంజ్/బత్తాయి: నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

పీచెస్: ఇవి చూడటానికి ఆపిల్స్ లానే ఉంటాయి. కానీ ఆపిల్ కాదు. పీచెస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, బిగుతు చేయడానికి మాత్రమే కాదు, ముఖ కండరాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది. అందుకు పీచెస్ పండ్ల మీద ఉన్న తొక్కను తొలగించి లోపల ఉన్న పదార్థంతో ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దాంతో వెంటనే మీరు ఫ్రెష్ గా ఫీల్ అవ్వడమే కాకుండా చర్మం టైట్ గా అనిపిస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

పీర్(భేరికాయా) జ్యూస్: ఇందులో కావల్సినన్ని విటమిన్స్ మరియు మినిరల్స్ ఉన్నాయి. ఇవి ఆరోగ్య పరంగా ఆర్థెరైటీస్, గౌట్ నివారణకు సహాయపడుతుంది. నెర్వస్ సిస్టమ్ ను క్రమబద్దం చేస్తుంది, లోయర్ హై బ్లడ్ ప్రెజర్, వంటి అనారోగ్య సమస్యలకు నివారిణిగా సహాయపడుతుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

పైనాపిల్: సువాననందించే పైనాపిల్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపచడమే కాకుండా నిర్జీవంగా మారిన, పొడి బారిన చర్మాన్ని తేజోవంతం చేసి, చర్మాన్ని నునుపు చేస్తుంది. పైనాపిల్ ముక్కలను ముఖం, శరీరం మీద కొద్దిసేపు రుద్ది స్నానం చేసినట్లైతే మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

క్రాన్ బెర్రీ: ఇందులో విటమిన్ సి, కె మరియు ఇ పుష్కలం. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారి సమస్యలకు ఇవన్నీ కూడా ఒక మంచి హోమ్ రెమడీ.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

బొప్పాయి: చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. తిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. పాపాయ అద్భుతమైన చర్మ క్లెన్సర్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే పాపాయలో పపిన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆయిల్ స్కిన్ కలవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

బనానా(అరటి పండు): అరటి పండు ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచడమే కాదు. చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పొడి చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

పుచ్చకాయ: పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

అవొకాడో: అవొకాడో చాలా మందికి తెలియదు. మన నిత్యం తినేటటువంటి పండ్లలో ఇది కూడా ఒక రకమైన పండే. పండు మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ఒక దివ్వౌషదం. ముఖ్యంగా పొడిబారిన చర్మం కలవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇక అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.... అవొకాడో పండును సగ భాగానికి కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లైచేసి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

మ్యాంగో జ్యూస్: వేసవి కాలంలో మ్యాంగో తినకుండా, మ్యాంగో జ్యూస్ త్రాగకుండా సమ్మర్ పూర్తికాదు. ఈ సీజన్ లో దొరికే పచ్చిమామిడియాలతో జ్యూస్ చేసి త్రాగితే కొద్దికొద్దిగా పులుపు, తీయ్యంగా ఉండే ఈ జ్యూస్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. సన్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

కుకుంబర్(కీర దోసకాయ)తో జ్యూస్: సహజంగా బరువు తగ్గాలనుకొనే వారు, కాంతివంతమైన చర్మ పొందాలనుకొనే వారు ప్రతి రోజూ ఈ కీర దోస జ్యూస్ ను త్రాగడం చాలా అవసరం. ఇది జీర్ణం కావడానికి చాలా సులభం. మరియు శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

టమాటా: టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది .అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభిస్తాయి.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

దానిమ్మ: దానిమ్మ రుచికి మాత్రమే కాదు. దానిమ్మ గింజల్లో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఎరుపు రంగులో ఉండే దానిమ్మ మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో చక్కెర గణాంకాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

జామకాయ(గోవా): జామకాయలో అధికశాతంలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి, ఫైబర్ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మరియు మలబద్దకానికి మంచిది.

అన్ని పండ్లు పూర్తిగా అన్ని కాలాలలో లభ్యం కావు. సీజనల్‌గా దొరికే పళ్ళు సాధ్యమైనంత వరకు తాజాగా తీసుకోవాలి. లేనప్పుడు డ్రైఫ్రూట్స్‌ తీసుకోవచ్చు.సాధారణంగా తీసుకొనే ఆహారం జీర్ణమవడం, శక్తినివ్వడం జరగడానికి కొంత సమయం పడుతుంది. ప్రక్రియను పూర్తిగా శరీరం నిర్వహించలేని స్థితిలో పళ్ళరసాలు తేలికగా అదేశక్తినిస్తాయి. పళ్ళరసాలలో ఉండే 95 శాతం పోషకాలను శరీరం సులువుగా గ్రహించగలుగుతుంది. రక్తాన్ని, శుద్ధిచేయడంతో పండ్ల రసాలు సహకరిస్తాయి. పళ్ళ రసాల వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా అవుతుంది. అందువల్ల హానికరమైన పదార్థాలు, సూక్ష్మజీవులు శరీరం నుండి ఎక్కువగా బయటకు పోతాయి. డైటింగ్ చేసేవారు చాలామంది కొద్ది వారాలపాటు జ్యూస్ తీసుకుంటూ తమ అధిక బరువు తగ్గించుకుంటారు. పోషకాహార నిపుణుల మేరకు ప్రధాన పోషకాలు కల పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే. మరి ఇన్ని సౌందర్య ఆరోగ్యప్రయోజనాలు కలిగించే పండ్ల రసాల్లో ఏఏ వాటిలో ఏఏ గుణాలు కలిగి ఉన్నాయో చూద్దాం...

English summary

Fruit Juices And Their Health Benefits | కాఫీ...టీ..వద్దు గురూ..ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దు గురూ..

Going by the fact that fruits are beneficial for our overall health. It is also true that fruit juices are equally healthier. Although it is recommended that fruits when eaten whole is more nutritious, it does not mean that the fruit juices are less nutritious. However it is a matter of fact that when high amount of sugar and water is added for the preparation of the juice it might lose some of its nutrients.
Story first published: Monday, February 11, 2013, 19:00 [IST]
Desktop Bottom Promotion