For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిటికెలో మీకు శక్తి రావాలంటే ఈ పండ్లను తినాల్సిందే...

|

ఎనర్జీ రిచ్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు..కడుపు నిండుగా..ప్లేట్ ఫుల్ గా భోజనం తింటే లేదా బంగాళదుంపలను తినడం వల్ల కడుపు నిండుతుంది. ఎనర్జీ పెరుగుతుందనుకుంటారు. కొన్ని ఫలాలు సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని పండ్లు అన్ని కాలాలలోనూ దొరుకుతాయి. అరటి, జామ, బత్తాయి, బొప్పాయి, అనాస, యాపిల్‌, సపోటా లాంటి ఎన్నెన్నో ఫలాలు అన్ని కాలాలలోనూ ఉంటాయి. మామిడి, ద్రాక్ష, కమలాఫలం, రేగుపండ్లు, నేరేడు, సీతాఫలం, పుచ్చలాంటివి సీజన్‌లో మాత్రమే వస్తాయి. చిరుతిళ్లు తినడం కంటే పండ్లు తినటమే ఆరోగ్యానికి మంచిదని తెలుసుకోవాలి. కాఫీ, టీ లాంటి పానీయాలకంటే తాజా పండ్ల రసాలు త్రాగడమే మేలు. ప్రకృతి ప్రసాదించే పండ్లను ప్రతిరోజూ తీసుకుంటే వాటిలోని పోషకపదార్థాలు శరీరానికి చక్కగా అందుతాయి.

చిరుతిళ్లు తినడం వల్ల బరువు పెరుగుతారని, స్థూలకాయం ఏర్పడుతుందని తెలుసుకోవాలి ప్రతివారూ. పండ్లు తినడం వల్ల శరీరానికి అటువంటి పరిస్థితి ఏర్పడదు. పండ్లు మంచి శక్తిని కలిగిస్తాయి. రుచిగానూ , తీపిదననంతోనూ ఉంటాయి. సీజన్‌లో వచ్చే వ్యాధులు నిరోధించటానికి పండ్లు తోడ్పడుతాయి. పండ్లు తినడం వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది. చర్మం ఎంతో తేమగా ఉంటుంది. చర్మానికి మృదుత్వం నిగారింపు ఏర్పడుతాయి. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. తక్షణ శక్తిని సమకూరుస్తాయి. రోగనిరోధకశక్తి పెంపొందుతుంది. సోమరితనాన్ని పారద్రోలి చురుకుగా ఉండేలా చేస్తాయి. పండ్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి పదిలంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. క్రమక్రమంగా అదనపు బరువును తగ్గిస్తాయి. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకునేవారు, తీసుకునే ఆహారంలో ఎక్కువ కేలరీలు ఇచ్చే పదార్థాలను తినడం తగ్గించి, పండ్లు తినడం మంచిది. జీర్ణాశయం, కాలేయం ఆరోగ్యాన్ని పెంచుతాయి.

పండ్లు, తాజాపండ్ల రసాలతో బద్ధకం తొలగిపోతుంది. పండ్లల్లో ఉండే పీచుపదార్థం అరుగుదలకు తోడ్పడుతుంది. పండ్లు తినడం వల్ల నిద్రలేమి తొలగిపోయి సుఖనిద్ర పడుతుంది. శరీరంలోని అధికవేడిని తొలగించి, చలువచేస్తాయి పండ్లు. కొన్ని పుండ్లు పుల్లగా ఉంటాయి. వాటిని అలాగే తినాలంటే ఎక్కువగా తినడం కష్టం కనుక అటువంటి పండ్ల నుంచి రసాన్ని తీసుకుని అందులో తేనెను కలిపి తాగడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. పుల్లటి పండ్లలో విటమిన్‌ 'సి అధికంగా లభిస్తుంది. అది నిరోధకశక్తిని పెంచుతుంది. నిమ్మ, నారింజ, దానిమ్మ, బత్తాయి, అనాసలాంటి పండ్ల నుంచి రసాన్నితీసి తాగడమే మేలు. పండ్లు కొన్ని తియ్యగా ఉంటాయి. మరికొన్ని పుల్లగా ఉంటాయి. పండ్లలో ఉండే నేచురల్ షుగర్స్ మన శరీరానికి కావల్సిన క్యాలోరీలను అంధిస్తాయి. ఇంకా సిట్రస్ పండ్లలో ఉండే యాంటి యాక్సిడెంట్స్ మరియు విటమిన్ సి ఎనర్జీ లెవల్స్ ను పెంచడం అద్భుతంగా సహాయడుతాయి. మరి పండ్లతో మీ ఎనర్జీని పెంచుకోవడానికి మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని పండ్లు ఉన్నాయి..మరి వాటిని పరిశీలించి తిని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండండి...

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

అరటి: శక్తిని వెంటనే అందించే సామర్థ్యం దీని సొంతం. పొటాషియమ్‌, విటమిన్‌ సి, బి కాంప్లెక్స్‌ కూడా ఉన్నాయి. మలబద్ధకం ఉన్న వాళ్ళు రోజూ రాత్రి రెండు అరటిపళ్ళు తింటే విరేచనం సాఫీగా అవుతుంది. పిల్లలకు బాగా మెత్తగా పండిన పండు మేలు చేస్తుంది. త్వరగా అనారోగ్యం నుండి కోలుకుంటారు.

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

ఆరెంజ్: వీటిలో విటమిన్‌ సి మెండుగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి ఇది శరీర సౌందర్యానికి కూడా చాలా మంచిది. నీటి దప్పికను తగ్గిస్తుంది. పొటాషియమ్‌ ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయిన కండరాలకు, గుండెకు మేలు చేస్తుంది. దీన్ని మధుమేV వ్యాధిగ్రస్థులు పుష్కలంగా వాడవచ్చు. ఫైబర్‌ ఎక్కువ ఉంటుంది. జీర్ణప్రక్రియకు, మలబద్ధకం నివారించేందుకు చాలా ఉపయోగపడుతుంది.

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

పుచ్చకాయ: వీటిలో పీచు పదార్థం జీర్ణప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. విటమిన్‌ సి, ఎ, ఐరన్‌, పొటాషియం, ఒక రకమైన తీపి పదార్థం ఉండడం వల్ల శక్తినిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచి కాపాడుతోంది. దీన్ని మధుమేహం ఉన్నవాళ్ళు కూడా మితంగా తినవచ్చు. నీటి శాతం 90-95 శాతం వరకూ ఉంటుంది. ఎండాకాలంలో నీటి దప్పికకు ఇది గొప్ప ఉపశమనం. మూత్ర సంబంధ వ్యాధులకు మేలు కలుగజేస్తుంది.

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

మామిడి: దీనిలో పుష్కలమైన పోషకాలున్నాయి. విటమిన్‌ ఎ, బిటాకెరోటిన్‌, బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌, రోగనిరోధక శక్తి ఎక్కువ చేసే యాంటి ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. నిస్సత్తువ, బలహీనాన్ని వెంటనే తగ్గించే గ్లూకోజ్‌ ఉంది. శక్తిని వెంటనే అందజేస్తుంది. దీనిలో పీచు (ఫైబర్‌) ఉండడం వల్ల, రక్త ప్రసరణకు, సాఫీగా విరేచనం కావడానికి తోడ్పడుతుంది.ఈ పండు గుజ్జును ముఖ సౌందర్యానికి వేరే వాటితో కలిపి వాడతారు.

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

ఆపిల్: రోజూ ఒక ఆపిల్‌ పండు తింటే డాక్టరుకు దూరం అనే నానుడి సరైనది. దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. పీచుపదార్థాలు కూడా ఎక్కువే. చక్కెర శాతం (గ్లూకోజ్‌ లాంటివి) తక్కువ. దీన్ని మధుమేహులు కూడా తినవచ్చు. దీనిలో శక్తినిచ్చే పదార్థమే కాకుండా పోషక విలువలు మెండుగా ఉన్నాయి.

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

బొప్పాయి: బొప్పాయిలో ఐరన్‌, పొటాషియమ్‌, కాల్షియమ్‌, విటమిన్‌ ఎ, సి, బి కాంప్లెక్స్‌ దీనిలో మెండుగా ఉన్నాయి. మధుమేహులు కూడా వాడవచ్చు. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

పైనాపిల్: ఎనర్జీని అంధించడంలో మరో అద్భుతమైన పండు. అంతే కాదు శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇంకా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

చిటికెలో శక్తిని అంధించే పవర్ ఫుల్ ఫ్రూట్స్.!

బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాంతో అవసరమైన క్యాలొరీలను పొందవచ్చు. ఒక కప్పు స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల వెంటనే తాజా అనుభూతిని పొందవచ్చు.

English summary

Fruits For Boosting Energy Levels

When we talk about energy rich foods, you usually picture a plate full of rice or potatoes. We generally do not associate fruits with energy. But this is a misconception. Fruits can boost energy levels and the best part is that they are not as fattening as other energy rich foods.
Story first published: Wednesday, June 12, 2013, 17:21 [IST]
Desktop Bottom Promotion