For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల-ఒంటి నొప్పుల నివారణకు వాడే ఆస్ప్రిన్ మాత్ర మంచి-చెడు లక్షణాలు

|

ఔషధాలు వాడే వారికి ఆస్ప్రిన్‌ మాత్ర తెలియకుండా ఉండదు. వందేళ్లకు పైగా ఈ ఔషధాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాడుతున్నారు. తల నొప్పి, జ్వరాన్ని వెంటనే నివారించే ఔషధంగా ఇది గుర్తింపు పొందింది. సాధారణంగా నొప్పుల నివారణతో పాటు ఆస్ప్రిన్ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా ఉపయోగపడుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉండదు. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే ఒకసారి గుండెపోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్ మాత్ర తప్పకుండా వేసుకోవాలి.

ఆస్ప్రిన్‌, వార్‌ఫరిన్‌ మాత్రలు గుండెపోటును నివారించడంలో సమర్థవంతగా పనిచేస్తాయని కొత్త అధ్యయనం తెలిపింది. ఆస్ప్రిన్‌ సురక్షితమైంది ఎందుకంటే కొద్ది మంది రోగులు మాత్రమే రక్తస్రావంతో బాధపడతారు. వీరిలో అధిక రక్తం పలుచన అయ్యే దుష్ఫ్రభావం ఉంటుంది. ఈ అధ్యయనాన్ని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ సమన్వయం చేసింది. చాలా మంది హార్ట్‌ ఫెయిల్యూర్‌ (గుండె సోలిపోవడం) రోగుల్లో క్రమరహితంగా గుండె కొట్టుకోవడం లేదా ధమనులు సన్నబడటం వంటి సమస్యలు లేనివారిలో ఆస్ప్రిన్‌ మాత్ర తీసుకోవడం ఉత్తమ ఎంపిక అని పేర్కొన్నది.

ఆస్ప్రిన్‌ పెయిన్ కిల్లర్ గాను, ఎమర్జెన్సీ డ్రగ్ గా కాకుండా క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడుతుందిని కనుగున్నారు. ఆస్ప్రిన్‌ మాత్ర పెద్దపేగు కేన్సర్‌ చికిత్సలో ఉపయోగపడుతుందని ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు. పెద్దపేగు కేన్సర్‌ కణాల మీద నేరుగా ప్రభావం చూపగల లక్షణాలు ఆస్ప్రిన్‌లో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. కేన్సర్‌ సోకిన వారిలో ప్రతిరోజూ ఒక ఆస్ప్రిన్‌ మాత్ర తీసుకున్న వారు దీర్ఘకాలం జీవించినట్లు గుర్తించారు. ఆస్ప్రిన్‌ వాడే రోగుల్లో 97 శాతం మంది ఎక్కువ కాలం జీవించగలిగారని తేలింది.

ఈ విషయాలన్నింటిని పరిశీలిస్తుంటే ఆస్ప్రిన్ మాత్రను దేవుడే వరంగా అందించాడమో అనిపిస్తుంది. అయితే ఆస్ప్రిన్ వల్ల చెడు ప్రభావం కూడా ఉన్నది. దీన్ని 16ఏళ్ళ లోపు పిల్లలు తీసుకోకూడదని బ్యాన్ చేశారు. అంతే శ్వాస సంబంధిత సమస్యలున్నవారు కూడా ఆస్ప్రిన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మరి ఆస్ప్రిన్ మాత్రను తీసుకోవడం వల్ల ఆరోగ్యం పై కలిగించే కొన్ని మంచి మరియు చెడు ప్రభావాలను చూపెడుతుంది. ఈ క్రింది లిస్ట్ ప్రకారం ఆస్ప్రిన్ తీసుకోవడం వల్ల కొన్ని చెడు మరియు కొన్ని మంచి కలిగించే లక్షణాలు పరిశీలించండి. తర్వాతా ఇది వండర్ డ్రగ్గా లేదా కిల్లర్ డ్రగ్గా డిసైడ్ చేసుకోండి.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

తలనొప్పి నివారణకు-మంచి ప్రభావం కలిగిస్తుంది: విపరీతమైన తలనొప్పి, తరచూ బాధపెడుతుంటే కనుక ఆ నొప్పి నివారణను ఇన్సాంట్ గా నివారించగల దివ్వ ఔషదం ఆస్ప్రిన్. తలనొప్పి నివారణకు దీనికి కంటే బెటర్ మరియు అతి త్వరగా నొప్పి నివారించే డ్రగ్ మరొకటి లేదు.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

గుండెకు-మంచి ప్రభావం కలిగిస్తుంది: ఆస్ప్రిన్ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా ఉపయోగపడుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉండదు. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే ఒకసారి గుండెపోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్ మాత్ర తప్పకుండా వేసుకోవాలి.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

జ్వరం ఉన్నట్లైతే-మంచి ప్రభావం కలిగిస్తుంది: ఎప్పుడైతే మీకు చలి జ్వరం ఉన్నట్లు, శరీరం అంతా నొప్పులతో బాధపడుతున్నట్లు భావిస్తారో, అటువంటప్పుడు ఒక ఆస్ప్రిన్ టాబ్లెట్ బేసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొంది బెటర్ గా ఫీల్ అవుతారు. మైనర్ ఫీవర్ ను, కోల్డ్ ను ఈ మాత్ర డీల్ చేస్తుంది.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

మొటిమల నివారణకు-మంచి ప్రభావం కలిగిస్తుంది: మొటిమలు ఉన్న చోట ఆస్ప్రిన్ టాబ్లెట్ ను పొడి చేసి పెట్టడం వల్ల, అతి త్వరగా నయం అవుతాయి. ఆస్ప్రిన్ లో సాలిసిలిక్ యాసిడ్ ఉండటం వల్ల మొటిమల నివారణకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

బగ్ బైట్స్ (నల్లులు కుడితే నివారణ)-మంచి ప్రభావం కలిగిస్తుంది: ఏదైనా కీటకాలు లేదా నల్లులు కుట్టినప్పుడు చాలా సమస్యగా ఉంటాయి. మంట, దురద తో కూడి బాధను కలిగిస్తాయి. ఆస్ప్రిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, లక్షణాలు కలిగి ఉండటం వల్ల నల్లులు మరియు కీటకాలు కుట్టినప్పుడు ఈ మాత్ర తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

చుండ్రు నివారణకు-మంచి ప్రభావం కలిగిస్తుంది: తరచూ తలస్నానం చేస్తున్నా చుండ్రు వదలకున్నట్లైతే మీరు వాడే షాంపూలో ఆస్ప్రిన్ మాత్ర పౌడర్ ను మిక్స్ చేసి తలకు పట్టించు తలస్నానం చేయడం వల్ల తర్వాత చుండ్రు మీ జోలికి రాదు.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

లివర్ ను కాపాడుతుంది-మంచి ప్రభావం కలిగిస్తుంది: ఎలుకల మీద ప్రయోగం చేసినప్పుడు తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ వాడటం వల్ల లివర్ డ్యామేజ్ ను అడ్డుకుంటుందని తేలింది. ఇది ముఖ్యంగా మద్యపానం మీద ఉపయోగపడుతుంది.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

క్యాన్సర్ బారీన పడకుండా కాపాడుతుంది--మంచి ప్రభావం కలిగిస్తుంది: ఆస్ప్రిన్‌ మాత్ర పెద్దపేగు కేన్సర్‌ చికిత్సలో ఉపయోగపడుతుందని ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు. పెద్దపేగు కేన్సర్‌ కణాల మీద నేరుగా ప్రభావం చూపగల లక్షణాలు ఆస్ప్రిన్‌లో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. కేన్సర్‌ సోకిన వారిలో ప్రతిరోజూ ఒక ఆస్ప్రిన్‌ మాత్ర తీసుకున్న వారు దీర్ఘకాలం జీవించినట్లు గుర్తించారు.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

ఆస్తమాకు - చెడు ప్రభావం కలిగిస్తుంది: ఉబ్బసం మరియు శ్వాస సంబంధిత రుగ్మతలును ఉన్నవారు ఆస్ప్రిన్ వాడకూడదు. ఆస్ప్రిన్ ఉబ్బసం ఉన్న రోగులు వాడటం వల్ల వారి ఊపిరితిత్తులుకు చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

అలెర్జీతో వచ్చే జలుబుకు-చెడు ప్రభావం కలిగిస్తుంది: అలెర్జీవల్ల వచ్చే జలుబును, కొంతమంది కొన్ని పదార్థాలు మరియు మందులు పడని వారికి ఆస్ప్రిన్ చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

అంతర్గత రక్త స్రావంజరగవచ్చు-చెడు ప్రభావం: ఆస్ప్రిన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చెడు అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. బ్లడ్ క్లాటింగ్ సమస్య ఉన్నవారికి ఆస్పిరిన్ చెడు ప్రభవాన్ని కలిగిస్తుంది.

ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

పిల్లలకు-చెడు ప్రభావం: 16ఏళ్ళలోపు వయస్సు గల పిల్లలకు చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. పిల్లల్లో రేయేన్ సిండ్రోమ్ తో సంబంధం కలిగి ఉంటడం వల్ల ఆస్ప్రిన్ పిల్లలకు ఇవ్వడం వల్ల కాలేయం మరియు మెదడు మీద తీవ్రమైన ప్రమాదానికి కారణమవుతుంది. తీవ్రమైన మంటకు దారితీస్తుంది. కాబట్టి వైద్యుని సలహా మేరకే పిల్లలకు ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వాల్సి ఉంటుంది.

English summary

Good And Bad Effects Of Aspirin | ఆస్ప్రిన్ మాత్ర గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది...!

It would be fair to call aspirin a wonder drug. For almost a century now, we have been using aspirin as a painkiller. It is one of the commonest drugs available in the market. In fact, it will be hard to find an educated person who has never heard of aspirin. The main effect of aspirin is on headaches and fever. Aspirin is the best painkiller when it comes to headache and body pain that happens due to fever.
Story first published: Friday, March 15, 2013, 15:35 [IST]
Desktop Bottom Promotion