For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏరోబిక్ వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

|

మీకు ఏరోబిక్స్ అంటే తెలుసా? ఏరోబిక్స్ యొక్క పవర్ ఫుల్ ప్రయోజనాలేంటో మీకు తెలుసా? సాధారణంగా మెదడు చురుకుదనం, శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, ఆలోచనా శక్తి, ఏకాగ్రత, ఆటలు- ఇండోర్ గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నారా లేదా వంటి అంశాలు మానసికంగా ఫిట్‌నెస్‌తో ఉన్నారా లేదో అన్నేదాన్ని తెలియజేస్తాయి. వీటిని బట్టి ఒక వ్యక్తి ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. కానీ, శారీరకపరమైన ఇతర మార్పులేమీ జరుగకుండా ఉఛ్వాస నిశ్వాసలు వేగంగా జరగటం, హృదయస్పందన రేటు పెరగటం, కండరాల కదలికలు చురుకుగా ఉంచేందుకు దోహదపడే ఎక్సర్‌సైజెస్‌ను ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ అంటారు. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ లేదా సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, ఆట్లాడటం, డ్యాన్స్ చేయటం వంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ కిందకు వస్తాయి.

ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు పర్యావరణం నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. గుండె, రక్తనాళాలు ఆ ఆక్సిజన్‌ను, ఇతర పోషకాలను ప్రతి కణానికి చేరవేస్తాయి. కండరాలు పనిచేయడానికి, కేలరీలను కరిగించడానికి ఇవి అవసరం. ఈ ఏరోబిక్ ఎక్సర్‌సైజులను చాలా రకాలుగా చేయవచ్చు. వాకింగ్, జాగింగ్, స్లో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, తేలికపాటి ఆటలు, డ్యాన్స్ వంటివి మంచి ఫలితాలనిస్తాయి. సమయం లేక వ్యాయామం చేయలేకపోతున్నామనే వానికి ఏరోబిక్‌ వ్యాయామాలు మంచి ప్రయోజనం. ఏరోబిక్‌ వ్యాయామాల వల్ల ఉన్న లాభాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే?

గుండె ఆరోగ్యానికి :

గుండె ఆరోగ్యానికి :

గుండె పనితీరులో మెరుగుదల ఉంటుంది. బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

రొమ్ముక్యాన్సర్:

రొమ్ముక్యాన్సర్:

అమ్మాయిల్లో చాలా సాధారణంగా మారుతున్న రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని ఏరోబిక్స్‌ చాలా వరకు దూరం చేస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాయామాలు మన శరీరంలోని ఈస్ట్రోజన్‌ను విచ్ఛిన్నం చేసి మంచి మెటాబొలైట్స్‌ తయారయ్యేలా చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్‌ సోకే అవకాశాలు తగ్గుతాయి. శారీరక శ్రమే రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుందనేది తాజా అధ్యయనాల ఫలితం. ఇంకా కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది

మధుమేహం:

మధుమేహం:

ఏరోబిక్ వ్యాయామం వల్ల మధుమేహం వలన వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్:

కొలెస్ట్రాల్:

ఏరోబిక్స్ వ్యాయామం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

బరువు తగ్గించడానికి :

బరువు తగ్గించడానికి :

బరువును అదుపులో ఉంచుతుంది. శరీరంలోని కొవ్వును తగ్గించి, మాములు స్ధాయికి తిరిగి తెస్తుంది.

కండరశక్తి:

కండరశక్తి:

శరీర కండరాల బలానికి తోడ్పడుతుంది. అలాగే, సాగే గుణాన్ని పంచుతుంది.

నిద్ర:

నిద్ర:

రెగ్యులర్ గా ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల తర్వాత రోజు వలన తర్వాత రోజును నూతనోత్సాహంతో ప్రారంభించడానికి వీలవుతుంది.

బిపి:

బిపి:

బిపి:క్రమం తప్పని ఏరోబిక్‌ వ్యాయామాలు అధిక రక్తపోటును తగ్గించడమేకాదు, అసలు అధిక రక్తపోటు రాకుండా నిరోధిస్తాయి. మంచి శరీరాకృతి వ్యాయా మాల వల్ల పొందిన వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.ఏరోబిక్‌ వ్యాయామాలు చేసిన వారికి రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా, వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండడం కూడా పరిశోధకులు గమనించారు.

ఒత్తిడి:

ఒత్తిడి:

ఒత్తిడిని అధిగమించగల సామర్థ్యం, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయి.

మెమరీ పెంచుతుంది:

మెమరీ పెంచుతుంది:

చాలారకాల పరిశోధనల తరువాత ఏరోబిక్ వ్యాయామం చేయడం వలన పిల్లల్లో, వృద్ధుల్లో జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాయామం వల్ల మెదడులో ఎండోమార్ఫిన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది.

శ్వాస సబంధిత:

శ్వాస సబంధిత:

శ్వాస సంబంధ సమస్యల నివారిణిగా, ఆక్సిజన్‌ను తొందరగా గ్రహించేవిధంగా శరీర స్ధాయిని పెంచుతుంది.

వృద్ధాప్య లక్షణాలను ధరిచేరనివ్వదు:

వృద్ధాప్య లక్షణాలను ధరిచేరనివ్వదు:

కాలానికి ముందే మీదపడే వృద్ధాప్య లక్షణాలను ముందుగానే నిరోధించాలంటే నడివయసు దాటుతున్న వారు ఏరోబిక్ వ్యాయామానికి ట్యూన్ చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు.

అలసటను తగ్గిస్తుంది:

అలసటను తగ్గిస్తుంది:

అలసటను తగ్గిస్తుంది మరియు స్టామినాను పెంచుతుంది.

కొవ్వు కరిగిస్తుంది:

కొవ్వు కరిగిస్తుంది:

ఏరోబిక్ వ్యాయామం వల్ల శరీరంలో పేరుకొన్న అదనపు కొవ్వులను కరిగిస్తుంది

ఏరోబిక్

ఏరోబిక్

ఏరోబిక్ వ్యాయామం మొదలు పెట్టే ముందు అప్పటి వరకు చేస్తున్న వ్యాయామాన్ని, ఆరోగ్యస్థితిని, బరువును దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ఏరోబిక్ వ్యాయామం ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలంటే కనీసం 12 వారాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

English summary

Health Benefits of Aerobic Exercise

The benefits of aerobic exercise are powerful, and aerobic exercise needs to be a part of your fitness program.
 benefits of aerobic exercise. Aerobic exercise (also known as aerobics, cardiovascular exercise or cardio) is any sustained, rythmic activity that primarily uses your larger muscles, such as your quadriceps and hamstrings, and challenges your heart and lungs.
Desktop Bottom Promotion