For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధనియాలు &ధనియాల పొడిలోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ధనియాలు &ధనియాల పొడిలోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

By Staff
|

ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ పిలుస్తారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితి.

వంటింట్లో ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో ఆరోగ్యాన్ని అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే వాటికి తగువిధంగా వాడటం ముఖ్యం. ఉదాహరణకు పసుపును సౌందర్యసాధనంగా ఉపయోగిస్తారు. అలా మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు.. ఇలా అన్ని ఆరోగ్యానికి ఆసరాఇచ్చేవే. వీటిలో ధనియాలు చేదు,కారం, వగరు రుచులను కలిగి ఉంటుంది. వీటిని వంటింట్లో సాంబారు, చారు వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. మంచిరుచితో పాటు, సువాసన కూడా ఉంటుంది. సాంబారు, చారుల్లో సువాసన కోసం కొందరు, ఆరోగ్యం కోసం కొందరు ఉపయోగించే కొత్తిమీర కాయలే ఈ ధనియాలు.

అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి.

మనదేశంలో పెరిగి ఇతర మసాలా దినుసులతో పాటు ధనియాలు కూడా సంవత్సరం పొడవునా పండిస్తారు. కొత్తిమీర చెట్టునుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండవెట్టి, తర్వాత గింజల రూపంలో లేదా, పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషకాంశాలున్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ధనియాలు కూడా ఒక గొప్పపోషకాంశాలున్న ఆహారంగా వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ధనియాలను రేటింగ్ సిస్టమ్ లో మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే ధనియాల్లో అనేక పోషకాంశాలతో పాటు అద్భుతమైన జబ్బులను నయం చేసి లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు. యూరప్ లో దీన్ని యాంటీ డయాబెటిక్ ప్లాంట్ గా పిలుస్తారు. మరి, ధనియాల వల్ల వీటితో పాటు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది అంశాలను చదవాల్సిందే...

1. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

1. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

మధుమేహం నివారించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మధుమేమం రాకుండా నిరోధించడానికి మరియు ఉన్న వ్యాధిన నయం చేయడానికి ఖచ్చితమైన పరిష్కారం ఇది. ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో మన తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనులు, అధ్యయనాలు చెబుతున్నాయి.

 2. టైఫాయిడ్ నుండి కోలుకొనేలా చేస్తుంది:

2. టైఫాయిడ్ నుండి కోలుకొనేలా చేస్తుంది:

టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతుందని రుజువయ్యింది. ఆహారం వల్ల కలిగే అనారోగ్యంకు సాల్మొనెల్లా కారణం అవుతుంది . కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ధనియాల పొడిని చేర్చుకోవడం వల్ల ఆహారం వల్ల వచ్చే ఘోరమైన వ్యాధులను నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

3. ఒక దట్టమైన హెర్బ్(మూలిక):

3. ఒక దట్టమైన హెర్బ్(మూలిక):

ధనియాల పొడిలో ఫైటోన్యూట్రియంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది అనేకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది . ధనియాల పొడిలోని వాలుటైల్ ఆయిల్, ఫైటో న్యూట్రియంట్స్ అంటే లినలూల్, బోర్నియోల్, కార్వోని, ఎపిజినిన్, క్యాంపోర్ మరియు మరికొన్ని ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

4. మొటిమలు మరియు మచ్చలును నివారిస్తుంది:

4. మొటిమలు మరియు మచ్చలును నివారిస్తుంది:

ధనియాల పొడి వల్ల మరో ఉత్తమ ప్రయోజనం, మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. మొటిమలు అనేవి టీనేజ్ వారిలో ఒక పీడకలగా ఉంది. ధనియాల పొడి మరియు పసుపు లేదా ధనియాల రసంతో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:

5. కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:

కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

6. అంటువ్యాధులను నివారిస్తుంది:

6. అంటువ్యాధులను నివారిస్తుంది:

అంటువ్యాధులు అంటే చికెన్ పాక్స్ వంటివి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. ఇంటువంటి అంటువ్యాధులకు కారణం అయ్యే జర్మ్ (సూక్మక్రిముల)తో పోరాడటానికి మరియు చంపడానికి ధనియాల్లోని ఔషధగుణాలు అద్భుతంగా సహాయపడుతాయని కొన్ని స్టడీస్ నిరూపించబడ్డాయి.

7. రుతు సమస్యలను నియంత్రించే ఒక ఉత్తమ ఔషదం:

7. రుతు సమస్యలను నియంత్రించే ఒక ఉత్తమ ఔషదం:

ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాల్లో ఆరోగ్యకరమైన లక్షణాలున్నాయి. అధిక బహిష్టుస్రావం ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి పటిక బెల్లం చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్యత తగ్గుతుంది. అంతే కాదు, రుతుక్రమం క్రమంగా వచ్చేలా సహాయపడుతుంది.

8. ఫీరాడికల్స్ ను తొలగిస్తుంది:

8. ఫీరాడికల్స్ ను తొలగిస్తుంది:

ధనియాలు(కొత్తిమీర, ధనియాలు, లేదా పొడి) ఇలా ఏరూపంలోనైనా సరే తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ను మన శరీరానికి అంధిస్తుంది. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ లక్షణాలన్ని కలగలిసి ఉన్నందు వల్లే దీన్ని ఔషధాగుణాలున్న మసాలా దినుసుల్లో టాప్ లో ఉంచారు.

Read more about: ధనియాలు coriander
English summary

Health Benefits Of Coriander Powder

In India, there are a plenty of magazines and newspapers in circulation, which western countries could hardly dream of. "Health and Beauty Tips" is a staple feature of these magazines and newspaper supplements too.
Desktop Bottom Promotion