For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునగకాయ మహిమకు మునక్కాయే సాటి...!

|

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. -విటమిన్‌ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి.

ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నిటిలోనూ, ఔషధగుణాలు అధికంగా ఉండడం చేత అధికంగా ఉపయోగిస్తున్నారు.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

జలుబు మరియు ఫ్లూ నివారణకు: మునగలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీరు తరచూ జలుబు, జ్వరం వంటి వాటితో బాధపతుంటే, డ్రమ్ స్టిక్ సూప్(మునగకాయలతో) తయారు చేసిన సూప్ త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం అంధిస్తుంది. మునగాకులో కూడా ఔషధగుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆస్త్మా, ముక్కు కారడం, శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

శ్వాస సంబంధిత సమస్యలు: ఆస్త్మా, శ్వాస సంబంధిత సమస్యలకు మునగాకు రసం లేదా మునగకాయ గింజలు ఉపశమనం కలిగిస్తాయి.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

ఎముకల బలానికి: ఈ పచ్చిని ముగకాయ, మునగాకులో అధికశాతంలో ఐరన్, విటమిన్స్, మరియు క్యాల్షియం పుష్కలంగా ఉండి, ఎముకలు ఆరోగ్యానికి, బలానికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు రక్తాన్ని శుద్ది చేయడానికి బాగా సహాయపడుతుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

రక్తాన్ని శుభ్రపరుస్తుంది: రక్తం శుభ్రతకు మునగాకు బాగా పనిచేస్తుంది. దీని రసాన్ని ప్రతి రోజూ లేదా వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా ఉంటుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

గర్భిణీ స్త్రీకి: గర్భిణీ మహిళలకు కూడా మునగ నుండి మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వారి డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల, గర్భాధారణ సమయంలో నిస్సత్తువ, వామిటింగ్, తలతిరగడం వంటివాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు ప్రసవ నొప్పులు చాలా సులభంగా వచ్చేలా చేస్తుంది. పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ను తగ్గిస్తుంది. అంతే కాదు ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడాలంటే మునగాకును తరచూ తింటుండాలి. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నిటిలోనూ, ఔషధగుణాలు అధికంగా ఉండడం చేత అధికంగా ఉపయోగిస్తున్నారు.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

ఇన్ఫెక్షన్: మునగ అత్యధికంగా యాంటీబ్యాక్టీరియ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గొంతు ఇన్ఫెక్షన్, ఛాతీ, చర్మ ఇన్ఫెక్షన్లకు పోగొడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల మనగ పువ్వులను చాలా రకాల సూపులలో విరివిగా ఉపయోగిస్తారు. ఇవి ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ సోకకుండా బాగా సహాయపడుతుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

కడుపు సంబంధించిన అనారోగ్యాలు: మునగాకులో మెండైన ఔషధగుణాలుండుట వల్ల తేనె, కొబ్బరినీళ్ళతో తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనాగోగ్యసమస్యలను దూరం చేస్తుంది. డయోరియా, డైసెంట్రీ, జాండీస్, కలర్ వంటి వాటికి మంచి విరుగుడు.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

లైంగిక సామర్థ్యానికి: అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంగస్తంభన సమర్థవంతంగా లేనివారు... మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

యూరినరీ ఇన్ఫెక్షన్: మునగకాయ మూత్రాన్ని పరిశుద్ధం చేసి, అతి వేడివలన మూత్రనాళపు మంట, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

కీళ్ళ నొప్పులకు: మునగకాయ రసం, కీళ్లనొప్పుల నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు క్యాల్షియం అందుకు బాగా దోహదం చేస్తుంది. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

బ్లడ్ ప్రెజర్: మునగాకులు ఎండబెట్టి పొడిచేసుకుని సేవిస్తూవుంటే, రక్తపోటు (బ్లెడ్‌ప్రెషర్‌) అరికడుతుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

మధుమేహం: మధుమేహ వ్యాధితో బాధపడేవారు కూడా దీని వలన ఎంతో ప్రయోజనం పొందుతారు. మధుమేహంతో బాధపడేవారికి ఎండబెట్టిన మునగ ఆకు పొడిని తేనెతో కలిపి సేవించండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుందంటున్నారు వైద్యులు.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

చర్మ సౌందర్యానికి: మునగాకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకొంటే వయస్సులో వచ్చే మొటిమలు నివారించబడతాయి. అందం పెరుగుతుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

అధిక బరువు: అధిక బరువు ఉన్నవారు ఎండబెట్టిన మునగాకుపొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

నెలసరి సమస్యలకు: నెలసరి సక్రమంగా రానివారు, కాల్సియం తగ్గినవారు చిన్న కప్పు పాలకు పెద్ద చెంచా మునగాకు రసం కలిపి రోజు తీసుకోవాలి.

English summary

Health Benefits Of Drumsticks | లైంగిక సామర్థ్యాన్ని పెంచే మునగకాయ..!

Many of us consult a diet nutrition in order to stay fit and healthy. Likewise, we spend a fortune on supplements assuming that they have the potential to provide all kind of benefits on our health. In the meanwhile, we forget the fact that there are many fruits and vegetables that we get in our kitchen garden or in the market which are low cost and equally beneficial for our health.
Story first published: Thursday, February 21, 2013, 17:52 [IST]
Desktop Bottom Promotion