For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిరపకాయలోని వైద్యపరమైన గొప్ప గుణగణాలు..

By Super
|

మిరపకాయ (చిల్లీ పెప్పర్) అనేది సొలనేసి కుటుంబం, సొలనేసి లోని మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే ఒక పండు. మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. కొలంబియన్ ఎక్ఛేంజ్ తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది.

మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి , ఘాటు గుర్తుకు వస్తుంది .. కాని మిరప లేకుండా వంట సాగదు , పచ్చి , పండు , ఎండు మిరప లను మనము వాడుతాం . మిరప భారతీయ మొక్క కాదు . మన వారు కారం కోసం మిరియం వాడేవారు. మిరపకాయలు ఘాటుగా వుంటాయి. తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను ఊరగాయ వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.

మిరపకాయలో ఇంత ఘాటు ఎందుకుంటుందంటే వీటిలో క్యాప్‌సైసిన్ (8-మిథైల్-ఎన్ -వనిల్లైల్-6-నోనెనామిడ్) మరియు అనేక సంబంధిత రసాయనాలు భాగం వహిస్తాయి, వీటన్నింటినీ కలిపి క్యాప్‌సైసినాయిడ్స్ అంటారు. విపరీతమైన మంటను కలిగించే ఆయుధంగా ఉపయోగించే పెప్పర్ స్ప్రేలో క్యాప్‌సైసిన్ అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కారంతో కళ్ళలోనూ, ముక్కుల్లోనూ నీళ్లు తెప్పించే మిరపకాయలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మిరపకాయలన్నింటిలో కారం ఇచ్చే రసాయనం 'కాప్సైసిస్‌్‌' అనే అల్కలాయిడ్‌ వుంటుంది. ఈ రసాయనానికి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు. మిరపలో కారంతోపాటు విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. పచ్చిమిరపకాయలు బాగా తినేవారిలో కొన్ని రకాల వ్యాధులు ముఖ్యంగా గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు, మిరపలో మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం...

గుండె జబ్బుల ప్రమాధం తగ్గిస్తుంది:

గుండె జబ్బుల ప్రమాధం తగ్గిస్తుంది:

ఆహారంలో కనుక మంటపెట్టే మిరపకాయలు తింటే అది శరీరంలో రక్తపోటును తగ్గించి చెడు కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గిస్తుంది. రక్తనాళాలలో ప్రమాదకరమైన రక్తపు గడ్డలు పేరుకోకుండా చూస్తుందని తెలిపారు. రీసెర్చర్లు, మిరియాలు, మిరపకాయలు వంటి పదార్ధాల ప్రభావం జన్యువుల మీద, రక్తనాళాలను, కొల్లెస్టరాల్ స్ధాయిని ప్రభావితం చేసే ఇతర శారీరక వ్యవస్ధలమీద పరిశీలించారు. అవి రక్తనాళాలు సంకోచించకుండా కూడా తోడ్పడి గుండెకు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

మిరపకాయలోని క్యాప్‌సైసినాయిడ్స్ వివిధ రకాల మెడిసినల్ క్రీములలో ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతంగా , ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్ మరియు ఇతర సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణక్రి:

మెరుగైన జీర్ణక్రి:

మిరపకాయలోని పెప్పరిన్ అనే మూలకం జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కారణంగా మరింత టేస్ట్ బడ్స్ ను ప్రేరేపిస్తుంది. ఈ ఆమ్లం ప్రోటీనులు మరియు ఇతర ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా అవసరం. మరియు అపానవాయువు, అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం మరియు ఆమ్లత వీటివల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇందులోని అదనపు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈసమస్యలన్నింటిని నిరోధించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకోసం, మీరు తయారు చేసే వంటల్లో ఒక టేబుల్స్ స్పూన్ పెప్పర్ పౌడర్ ను జోడించండి . ఇది వంటలకు ఫ్లేవర్ ను జోడించడంతో పాటు కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎముక ఆరోగ్యంకు:

ఎముక ఆరోగ్యంకు:

చిల్లీపెప్పర్స్ ఎక్కువ శాతం క్యాల్షియం ఉంటుందని నిపుణులు కనుగొన్నారు. ఇది ఎముకలు మరియు దంతాల ఆరోగ్యనిర్వాహణకు చాలా ముఖ్యం అని చెబుతున్నారు.

రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది:

రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది:

అధిక బరువుతో బాధపడే అలాగే డయాబెటిస్ ఉన్నవారు చిల్లీస్ తినడం వల్ల పాజిటివ్ ఫలితాలను చూసినట్టు తాస్మానియా విశ్వవిద్యాలయం తెలిపింది.

స్ట్రోక్స్ ఆపడానికి సహాయపడుతుంది:

స్ట్రోక్స్ ఆపడానికి సహాయపడుతుంది:

ఇది ఒక బూస్టర్ వంటిది. రక్తం పల్చగా మారి రక్తనాళాల్లో రక్తం ప్రసరించడానికి బాగా సహాయపడుతుంది. స్ట్రోక్ నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కాబట్టి, మిరపకాయలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలనుండి రక్షణ పొందవచ్చు.

నొప్పి మరియు వాపులను తగ్గిస్తుంది:

నొప్పి మరియు వాపులను తగ్గిస్తుంది:

దీనిలో ఉండే "కాప్సాసిన్(Capsaicin)" కీళ్ళ నొప్పులు , తలనొప్పి , మున్నగు నొప్పులను తగ్గిస్తుంది .

ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాప్తిని నివారిస్తుంది:

ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాప్తిని నివారిస్తుంది:

మిరపకాయలోని క్యాప్సైసిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తిని ఆపడానికి సహాయపడుతుంది. క్యాప్సైసిన్, ప్రోస్టేట్ క్యాన్సర్ కణ తంతువులు విడగొట్టడానికి, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడానికి సహాయపడుతుంది.

ఫ్యాట్ కరిగించడానికి:

ఫ్యాట్ కరిగించడానికి:

మిరపకాయ తింటే సాధారణంగా నోరు మంటపుడుతుంది. కాని కడుపులో మంట పుట్టడంతోపాటు అందులో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించేస్తుందని తాజాగా తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. ఊబకాయాన్ని కరిగించేందుకు దివ్యమైన ఔషధం మిరపకాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. మిరపకాయ తినడంతో శరీరంలో పుట్టే వేడి వలన శరీరంలోని కెలొరీలను పెంచి కొవ్వును కరిగిస్తుందని పరిశోధకులు తెలిపారు.

స్టొమక్ అల్సర్ తగ్గించడానికి:

స్టొమక్ అల్సర్ తగ్గించడానికి:

పొట్ట ఉబ్బరం తగ్గించే గొప్ప ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు గ్యాస్ ఏర్పడటాన్ని నిరోధించడంతో పాటు, కడుపు నొప్పి , అల్సర్, అసౌకర్యం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ భోజనంలో కారం పొడికి బదులు బ్లాక్ పెప్పర్ ను జోడించడం వల్ల అపానవాయువు ఉపశమనానికి సహాయం చేస్తుంది.

English summary

Health benefits of eating chillies


 Chilli originated in the Americas, and has been part of the human diet since at least 7500 BC. Explorer Christopher Columbus brought it back to Spain in the 15th century and its cultivation spread rapidly through Europe, Asia, India and Africa.
Desktop Bottom Promotion