For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెన్నా (గోరింటా)ఆకులు యొక్కఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

హెన్నా లేదా సాధారణంగా భారతదేశంలో మెహేంది అని కూడా అంటుంటారు. ఇది ఒక సాధారణ ఆయుర్వేదక మూలిక. ఇది పండుగలు మరియు పెళ్ళిళ్ల సమయంలోఈ హెన్నాను చేతులకు పెట్టుకొని మంచి మంచి డిజైన్లను వేసుకుంటుంటారు. దీన్నిచాలా పవిత్రమైనదిగా మరియు ఆరాధనగా భావిస్తారు మరియు మహిళల " సాత్ శ్రింగార్ " యొక్క ఒక ముఖ్యమైన భాగంగా ఉంది .

హెన్నా బ్లాక్ లేదా గోధుమ రంగులో ఉంటుంది మరియు ఇది చేతులకు లేదా కేశాలకు అప్లై చేస్తే ఎర్రగా లేదా గోధుమరంగులో పండుట ఈ పదార్థం ప్రధాన లక్షణం కలిగి ఉంది. అందువల్ల , దీన్ని అనేక కాస్మోటిక్స్ లలో ఉపయగిస్తున్నారు . చర్మం రూపకల్పన మరియు తెలుపు లేదా డల్ జుట్టు కలరింగ్ కోసం ఒక కాస్మెటిక్ పదార్థాంగా దీన్ని ఉపయోగిస్తారు . హెన్నా సౌందర్య గుణాలే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని గుర్తించారు.

హెన్నా ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి . హెన్నా ఆకులు, పొడి మరియు పేస్ట్ రూపంలో మనం అనేక విధాలుగా , అనేక కారణాలకు ఉపయోగిస్తున్నాం . అందుల కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

శీతలీకరణ(కూలింగ్) ప్రభావం -

శీతలీకరణ(కూలింగ్) ప్రభావం -

హెన్నా శీతలీకరణ లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఇది వాపు ను తగ్గించడానికి ఒక యాంటీఇన్ఫ్లమేటరి( వ్యతిరేక శోథ పదార్ధం)గా ఉపయోగించవచ్చు . హెన్నా ఆకులు, మెత్తగా పేస్ట్ లా తయారుచేసి వాపు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వాపు క్రమంగా తగ్గించడాన్నిగమనించవచ్చు . హెన్నాఆకులు పేస్ట్ రూపం ఉపయోగించుకోవడం వల్ల శరీరంలో వేడి సమస్యలు తగ్గిస్తాయి . రాత్రుల్లో నిద్రించే ముందు హెన్నా పేస్ట్ ను పాదాలకు అప్లై చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గిపోతుంది . ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది .

జుట్టు రక్షణకు -

జుట్టు రక్షణకు -

హెన్నా ఆకులను పొడిగా లేదా పేస్ట్ గా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను నివారించడం కోసం ఉపయోగిస్తున్నారు. హెన్నాను వారానికి ఒకసారి తలకు, జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సమస్యలు, చుండ్రు తగ్గించి, జుట్టును చదునుగా మరియు మంచి షైనింగ్ త ఉండేలా చేస్తుంది. అదనంగా, మీ జుట్టు సమస్యల్లో తెలుపు మరియుగ్రే హెయిర్ ను కప్పి పుచ్చడానికి హెన్నాపొడి లేదా పేస్ట్ ఎప్పుడూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందువలన హెన్నా ఆకులు జుట్టు డ్యామేజ్ ను అరికట్టి మరియుబ్యూటిఫుల్ గా ఉంచుతుంది. మీరు చేయాల్సిందల్లా హెన్నా ప్యాక్ ను రెగ్యులర్ గా జుట్టుకు ప్యాక్ వేసుకుంటుండాలి.

కాలిగి గాయాలకు -

కాలిగి గాయాలకు -

హెన్నా ఆకులు కాలినగాయల చికిత్స కోసం మంచి నివారినిగా పరిగణిస్తారు. ముందే చెప్పినట్లుగా , హెన్నాల శీతలీకరణ లక్షణాలు కలిగి ఉన్నాయి. అందువలన , కాలిన గాయాల మీద హెన్నాఆకులను రుద్దడం వల్ల సమర్థవంతంగా నొప్పి తగ్గిస్తుంది . అందువలన హెన్నా ఆకులుచర్మం కాలిన గాయాలకు ఒక మంచి ఔషధంగా ఉపయోగిస్తారు .

నొప్పి నివారిణి -

నొప్పి నివారిణి -

హెన్నా యొక్క " శీతలీకరణ " లక్షణాల వల్ల కూడా తల నొప్పి నయం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది . హెన్నా ఆకులు లేదా హెన్నా పదార్దాలు ఏదైనా ఎడతెగని నొప్పులు తగ్గించేందుకు నుదుటిపైన రుద్దుతారు . హెన్నా మైగ్రైన్ నొప్పులు చికిత్సలో బాగంగా ఉపయోగపడుతుంది మరియు క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. హెన్నా ఆస్పిరిన్ మాత్రకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది

లివర్ ఫ్రెండ్లీ -

లివర్ ఫ్రెండ్లీ -

హెన్నా కామెర్లు వంటి కాలేయం రోగాలను నయం చేసే లక్షణాలను కలిగి ఉంది. కాలేయానికి సంబంధించి పసుపు జ్వరం చాలా ప్రమాదకరమైనది మరియు కొన్నిసార్లు చికిత్స చేయడానికి కూడా కష్టం అవుతుంది . అందువల్ల , హెన్నా ఏ తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా కామెర్లుకుచికిత్స అందించడంలో ఒక మంచి ఆయుర్వేద ఎంపికగా ఉంటుంది .

యాంటీ -

యాంటీ -

TB - హెన్నాను యాంటీ TB అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది క్షయవ్యాధి నయం చేయండంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తారు . హెన్నా పదార్దాలు ఆకులు క్షయవ్యాధికి సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పబడింది . హెన్నా ఆకులను మీరు డాక్టర్ ను సంప్రధించిన తర్వాతతే ఉపయగించాల్సి ఉంటుంది.

హెన్నాలో అనేక ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని యాంటీబ్యాక్టీరియల్ పేస్ట్ గా మరియు యాంటీఫంగల్ పేస్ట్ గా ఉపయోగిస్తారు. మరియు జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తారు. మరియు హెన్నాలో ఒక ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంది.

హెన్నా

హెన్నా

హెన్నా ఆకులు మాత్రమే కాదు, హెన్నా బెరడు కూడా చాలా మన ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంది . హెన్నా ఒక ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన ఆయుర్వేద మొక్క.

English summary

Health benefits of Henna leaves

Henna or commonly known as Mehendi in India is a common Ayurvedic herb. It is used for drawing designs on hands by women during festivals and marriages. It is considered very holy and pious and is an important part of the “Saath Shringaar” of Women.
Story first published: Saturday, November 16, 2013, 16:51 [IST]
Desktop Bottom Promotion