For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఇంగువ’లోని ఔషధ గుణగణాలు చూడండి...!

By Super
|

ఇంగువగా ప్రసిద్ధి చెందిన అసఫోటిడాకు భారతీయ వంటకాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి వండినప్పుడు ఘాటైన ఇంగువ వాసన వంటకాలకు ఒక రహస్యమైన రుచిని కల్గిస్తుంది. దీనిని పప్పులు (కాయధాన్యాలు), సాంబార్లు, ఇంకా రుచికరమైన ఇతర శాకాహార వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తాలింపునకు (తర్కా), పచ్చళ్లలో కూడా ఇది ఒక సాధారణ దినుసు. కాని ఈ మూలికకు ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించుట, బాధనివారిణి, యాంటీమైక్రోబియాల్, విరేచనకారిగా, నరాల ఉత్తేజకమందు, కఫ౦ తగ్గించేది, ఉపశమన౦ కల్గించేదిగా కూడా పేరొందింది.


ఇక్కడ ఇంగువతో గల ఆరోగ్యప్రయోజనాలు కొన్ని ఉన్నాయి.


ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

అజీర్తి: ఇంగువను పురాతన కాలం నుండి అజీర్తికి ఇంటివైద్యంగా ఉపయోగిస్తున్నారు, అందువల్లనే దీనిని అలవాటుగా భారతీయ వంటకాలలో ప్రతి రోజు ఉపయోగిస్తుంటారు. దీనిలోని కడుపు మంటను తగ్గించే గుణం, యాంటిఆక్సిడెంట్ లక్షణాలు, చికాకు పెట్టే కడుపు, పేగులో వాయువు, పేగు పురుగులు, అపానవాయువు, చికాకుపెట్టే పేగు వ్యాధి (ఐ బి ఎస్) మొదలైన అజీర్తి లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఒక అరకప్పు నీటిలో చిన్న చిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కల్గుతుంది.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

రుతుక్రమ/పీరియడ్స్ సమస్య నివారిణి: స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు నొప్పి, తిమ్మిరి, సక్రమంగా లేని, బాధతోకూడిన రుతుక్రమాలు వంటి వాటికి ఇంగువ ఒక శక్తివంతమైన మందు. ఈ ఔషధ మూలికను కాండిడ అంటువ్యాధి, ల్యుకోరియ (యోని నుండి చిక్కటి తెల్లనైన/పసుపు రంగు స్రావం) వంటి వ్యాధులను తగ్గించడానికి కూడా వాడతారు.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

నపుంసకత్వం: వంటలలో ఉపయోగించే ఈ ఔషధ మూలికను మగవారిలో నపుంసకత్వం తగ్గించేందుకు కూడా వాడతారు. దీనిని కామాతురత పెంచడం, నిరోధకంగా కూడా వాడవచ్చు.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

శ్వాస సంబంధిత వ్యాధులు: అతి పురాతన ఒక వైద్యం ఇంగువ, శ్వాస సంబంధ అంటువ్యాధులను తగ్గించడానికి, శ్వాస ఉత్తేజపరిచే ఒక మందుగా, కఫము తగ్గించటానికి, ఛాతీ పైన ఒత్తిడి తగ్గించటానికి పనిచేస్తుంది. తేనే, అల్లంలతో కూడిన ఇంగువను దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం కోసం వాడతారు.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

డయాబెటిస్: ఇంగువను డయాబెటిస్ వైద్యంలో వాడతారు, ఇది క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కాకర కాయను ఇంగువతో కలిపి వండండి.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

అధిక రక్తపోటు: ఈ ఔషధ మూలికలో ఉన్న కొమరిన్ లు రక్తాన్ని పలుచన చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. ఇంగువ వైద్యప్రభావంతో పాటుగా అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా రక్షిస్తుంది. తక్కువ రక్తపోటుకు సహాయపడుతుంది.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

నరాల లోపాలు: ఆహారంలో వాడే ఈ రుచికరమైన పదార్ధం నరాలను ఉత్తేజితం చేస్తుంది. అందువలన ఇది మూర్ఛ, వంకరలు పోవటం, సొమ్మసిల్లుట, ఇతర నాడీ సంబంధిత క్రమరాహిత్యాలలో సిఫార్సు చేయబడింది.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

నొప్పి: నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రియిన్లు, తలనొప్పులను తగ్గిస్తుంది. నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి ఒక అద్భుతంగా పని చేయవచ్చు.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

నల్లమందుకి విరుగుడు: నల్లమందు ప్రభావాన్ని ఇంగువ తగ్గిస్తుంది. అందువలన దీనిని నల్లమందుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

క్యాన్సర్: శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్ ఇంగువ, శరీర కణాలను స్వేచ్చా రాశుల నుండి కాపాడుతుంది. అధ్యయనాల ప్రకారం, ఇంగువ వ్యతిరేక కాన్సర్ లక్షణం ప్రాణాంతక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

చర్మ వ్యాధులు: అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో సమర్థవంతమైన చికిత్స కోసం ఔషధ లక్షణాలున్న ఇంగువను వాడతారు. దీనిని పుండ్లు, ఆనెలు ఉన్న చర్మంపై కూడా నేరుగా పూయవచ్చు.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

రోగనిరోధక శక్తి: ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, చర్మ వ్యాధులకు ఇంగువ మంచి మందు. కాసిని నీటిలో ఇంగువను వేసి ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

పళ్ళు ఆరోగ్యానికి : పళ్ళు పుచ్చిపోయి ఉంటే రాత్రి పడుకునేముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే క్రిములు మటుమాయం.

ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

మలబద్దకానికి : మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకో బోయేముందు ఇంగువ చూర్ణం తీసు కుంటే ఫలితం ఉంటుంది.


English summary

Health benefits of Hing/Asafoetida | ఇంగువ చేసే మేలు అంతింత కాదయా...!

Asafoetida, popularly known as hing, has its unique place in Indian cuisine. When cooked with other spices, the strong pungent smell of hing adds a mysterious flavour to dishes. It is used most commonly in dals (lentils), sambars and various other spicy vegetarian dishes.
Desktop Bottom Promotion