For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నేషనల్ డ్రింక్ లో మెండైన ఆరోగ్య ప్రయోజనాలు...

|

టర్నిప్(ఎర్రముల్లంగి) దీన్ని రూట్ వెజిటేబుల్ గా(దుంపగా)చెప్పుకోవచ్చు. టర్నిప్ ఆరోగ్యం విషయంలో ప్రధాన పాత్రను వహిస్తాయి. ఈ క్రూసిఫెర్రస్ వెజిటేబుల్ సంవత్సరం పొడువునా అందుబాటుటో ఉంటుంది. దీన్ని వెజిటేరియన్ ఫుడ్ లో దీన్ని ఒకటిగా చెబుతారు. అంతే కాదు ఇందులో అద్భుతమైన ఔషధగుణాలు మనకు తెలియని లక్షణాలు చాలానే ఉన్నాయి. మరి ఈ వ్యాసం వల్ల ఈ టర్నిప్ లో ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి: టర్నిలో ఉన్న అనేక ఔషధ గుణాలు గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. టర్నిప్ గ్రీన్స్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. టర్నిప్ తినడం వల్ల ఇందులో ఉన్న ఔషధగుణాలు మన శరీరంలోని కొలెస్ట్రాలో కలిసిపోవడమే కాకుండా జీర్ణక్రియ క్రమంగా జరగడానికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇంకా అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు టర్నిప్ లో ఉండే విటమిన్ కె యాంటీ ఇప్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్లే హార్ట్ స్ట్రోక్, హార్ట అటాక్, మరియు ఇతర గుండె సంబంధిత సమస్యలను నిరోధిస్తుంది. ఇంకా ఇందులో అద్భుతమైన ఫొల్లెట్ పుష్కలంగా ఉంది. ఇది కార్డియో వాస్కులర్ సిస్టమ్ కు తగినంత శక్తినిస్తుంది.

క్యాన్సర్ నివారిణి: టర్నిప్ లో ఉండే గ్లూకోసినలేట్స్ క్యాన్సర్ ను నయం చేస్తుంది మరియు క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి సహాయపుడుతంది. ఈ టర్నిప్స్ తిన్నప్పుడు అందులో ఉండే నేచురల్ ప్లాంట్ కెమికల్స్ రెండు రకాలుగా విడగొట్టబడుతుంది. అది ఒకటి ఇండోలెన్ మరియు ఐసోథియేసైనేట్స్. ఈ రెండు క్యాన్సర్ కు కారణం అయ్యే టూమర్ సెల్స ను బ్రేక్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కాన్సర్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఈ టర్నిప్స్ ను డైలీ డైట్ లో కనుక చేర్చుకొన్నట్టైతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలాతక్కువ. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ను నిరోధిస్తుంది. అంతే కాదు ఇది కోలన్ క్యాన్సర్ మరియు రెక్టల్ టూమర్స్ అద్భుతమైన ప్రభావాన్ని చూపెడుతుంది.

Health Benefits Of Turnips

ఎముకల బలానికి: మనిషికి బోన్ హెల్త్ చాలా ముఖ్యం. ముఖ్యంగా వయస్సు పైబడినప్పుడు బోన్ హెల్త్ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందుకు ఎక్కువ శాతం పొటాషియం, మరియు క్యాల్షియం అవసరం అవుతుంది. ఈ రెండు పోషకాలు టర్నిప్స్ లో పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు స్త్రీ పురుషలిద్దరికీ అవసరమే. ఇవి ఆస్టియోపొరొసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ డ్యామేజ్ మరియు ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. టర్నిప్స్ లో ఉండే కాపర్ ఎముకల ఆరోగ్యంగా ఉండటం కోసం, అందుకు శక్తిని, బలాన్ని చేర్చి కనెక్టివ్ టిష్యూష్ తో సహకరిస్తుంది.

యాంటీఆక్సిడెంట్స్ ను వ్రుద్ది చేస్తుంది: టర్నిప్ లో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ (విటమిన్ ఎ, సి, మరియు విటమిన్ ఇ, మ్యాంగనీస్)ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఇంకా డిఎన్ఎ డ్యామేజ్ ను నివారిస్తుంది. విటమిన్ సి పొందడానికి సిట్రస్ పండ్లు, ద్రాక్ష మొదలగునవి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించి ఆస్తామా మరియు కోల్డ్ తో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ ఎ ఎఫిసెమ, లంగ్ ఇన్ఫ్ల మేషన్, ఊపిరితిత్తులన సమస్యలు నివారించి. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల నిర్వహిస్తుంది.

శరీరం నుండి చెమట, దుర్వాసను తొలగిస్తుంది: మనలో చాలా మందికి ఈ సాధారణ సమస్య ఉంది. టర్నిప్ జ్యూస్ ను త్రాగడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. టర్నిప్ జ్యూస్ నిజంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని టర్కీలో నేషనల్ డ్రింక్ గా అభివర్ణిస్తారు. కాబట్టి టర్నిప్ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగి, శరీరం దుర్వాసనను నివారిస్తుంది. కాబట్టి టర్నిప్ ను మీ డైలీ డైట్ చేర్చుకొని అనేక విధలైన ఆరోగ్య ప్రయోజనాలను కలిస్తుంది.

English summary

Health Benefits Of Turnips | ఎర్ర ముల్లంగిలోని మేలైన ఆరోగ్య ప్రయోజనాలు..

Widely known as a root vegetable, turnips plays an important role in maintaining health. Being a calciferous vegetable, they are widely available all year around. Turnips are considered as one among of the veggies and have excellent medicinal properties that are still unknown to many. This article will help you to know the various health benefits of turnips.
Story first published: Thursday, March 21, 2013, 19:08 [IST]
Desktop Bottom Promotion