For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదనపు పనివేళలు పనిచేసేవారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు

By Super
|

నేటి జీవన విధానంలో చాలా మంది వారి, మంచి జీవనశైలి పొందడానికి, డబ్బు సంపాదించడానికి, అలవాటు పడి పనిగంటలను పెంచుతున్నారు. ఏదో సాధించాలనే ఆక ఆత్రుతతో వారు చేయాల్సిన దాని పనికంటే మరింత త్వరగా వేగాన్ని పెంచుతుంటారు. ముఖ్యంగా వారు మానసిక మరియు భౌతికంగా కష్టపడానికి ఇష్టపడుతారు. అయితే ఇలా రెగ్యులర్ గా లేటుగా (అదనపు పనిగగంటలు)పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదనపు పనిగంటలు పనిచేయడం కోసం పురుషులు అసహజ పద్దతుల్లో కెఫిన్ కు అలవాటు పడి పనిచేస్తూ గడుపుతుంటారు.

ఇలా క్రమంగా అదనపు గంటలు పనిచేస్తూ పోతే, నిద్రలేమి సమస్య నుండి ఇతర అనారోగ్య సమస్యలు గుండె సంబందిత వ్యాదులు మరియు ట్రిగ్గర్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలను ను ఎదుర్కోవల్సి వస్తుంది. క్రమం తప్పకుండా అదనపు పనివేళలు పనిచేయడం వల్ల పురుషుల్ల అనేక స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇది స్టొమక్ అప్ సెట్ కు దారితీస్తుంది, వికారం, డయేరియా, మలబద్దకం మరియు హార్ట్ బర్న్ మరియు నిద్రలేమి మొదలగు స్వల్పకాలిక సమస్యలకు గురిచేస్తుంది . ఇక దీర్ఘకాలికంగా అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, జీవక్రియ, స్థూలకాయం, సంతానోత్పత్తి సమస్యలు, గర్భం సమస్యలు మొదలవుతాయి.

కాబట్టి పురుషులు వారి జీవన శైలి మరియు కోరికలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. జీవింత చాలా చిన్నది, కానీ అన్ని చాలా సంపాదించడానికి ఉత్సాహంగా అనిపించవచ్చు. కానీ ఆ చిన్న జీవితానికే మీకు ఆరోగ్యకరంగా మరియు బలంగా జీవించాలని గుర్తుంచుకోవాలి. దురాశ మరియు అధిక కోరికలు మీరు ఏదో సాధించడానికి మరింత పనిచేయడానికి ప్రధాన కారణం అవుతున్నాయి. చివరికి ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

లేట్ గా వర్క్ చేయడం వల్ల పురుషులు పొందే కొన్ని ఆరోగ్య సమస్యలు..

1. వ్యసనాలు మొదలవుతాయి:

1. వ్యసనాలు మొదలవుతాయి:

మీరు మరింత అదనపు సమయం పనిచేయడానికి మీరు కొన్రి ఉత్ప్రేరకాలు మరియు ఎనర్జీ బూస్టర్స్ కెఫిన్ మరియు సిగరెట్లు వంటి వాటి మీద ఆధారపడవల్సి ఉంటుంది. ఇటువంటి వాటిమీద ఆధారపడటం వల్ల అవి వ్యసనంగా మారుతాయి. మరియు సమస్య మరింతి దారితీస్తుంది . కెఫిన్ మరియు నికోటిన్ కు వ్యసనంగా మారినప్పుడు కొంత కాలం తర్వాత మీలో ఆందోళన మరియు నిద్రరుగ్మతలు ఏర్పడుతాయి.

2. జీర్ణ వ్యవస్థలో లోపాలు:

2. జీర్ణ వ్యవస్థలో లోపాలు:

లేటుగా పనిచేయడం వల్ల, అపక్రమ ఆహారపు అలవాట్లు వల్ల స్టొమక్ అప్ సెట్, వికారం, విరేచనాలు, మలబద్దకం, మరియు గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర వ్యాధులకు దారి తీస్తుంది. తగినంత నీరు త్రాగకుండా గడపడం వల్ల జీర్ణశయాంతర లోపాలకు దారితీసేందుకు మరొక కారణం అవుతుంది.

3. గుండె సంబంధిత వ్యాధులు:

3. గుండె సంబంధిత వ్యాధులు:

రెగ్యులర్ గా లేటుగా పనిచేసే వారిలో గుండె సంబంధిత వ్యాధులు, గుండె జబ్బు ప్రమాదాన్ని సూచిస్తాయిని అనేక పరిశోధనలు చూపిస్తున్నాయి. నైట్ షిప్ట్ పనిచేసే వారిలో ఈ ప్రమాధం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాయి.

4. నిద్రలేమి:

4. నిద్రలేమి:

చాలా మంది పురుషులు లేట్ గా పనిచేయడం వల్ల , వారు తగినంత నాణ్యమైన మరియు సకాలంలో నిద్రపొందడం ప్రాముఖ్యతను కోల్పోతారు. వారంతట వారు స్వయంగా నిద్రపోగొట్టుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యకు గురిఅవ్వాల్సి వస్తుంది. ఇది నిద్రలేమికి ఒక లోపంలా ఉంటుంది.

 5. మధుమేహం:

5. మధుమేహం:

రెగ్యులర్ గా లేట్ షిప్ట్ వర్క్ చేసే వారు, అపక్రమ ఆహారాపు అలవాట్లు మరియు తరచూ స్థిరంగా అపక్రమంగా తినడం, సమయపాలన పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ప్రమాధాన్ని చూపెడుతుంది , హై బ్లడ్ షుగర్, ఊబకాయం, మరియు అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరగుతుంది.

6. ఊబకాయం:

6. ఊబకాయం:

రెగ్యులర్ గా లేట్ షిఫ్ట్ లు పనిచేయడం వల్ల ఊబకాయంకు దారితీస్తుందని పరిశోధనలు చూపాయి. పూర్ డైట్ మరియు వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. లేట్ షిప్ట్ వర్క్ వల్ల హార్మోనుల అసమతుల్యతలో కీలక పాత్రపోషించే లెప్టిన్ స్థాయిలు తక్కువగా కనిపిస్తాయి.

7. డిప్రెషన్ మరియు మూడ్ డిజార్డర్స్:

7. డిప్రెషన్ మరియు మూడ్ డిజార్డర్స్:

కొన్ని అధ్యయనాల ప్రకారం లేట్ షిఫ్ట్ ల వల్ల వారిలో బుద్ది మాంద్యం లక్షణాలు మరియు ఆతురత వంటి ఇతర మూడ్ డిజార్డర్స్ తో బాధపడే అవకాశం ఉన్నట్లు కనుగొన్నారు. నైట్ షిప్ట్ లు పనిచేసే వారిలో సెరోటోనిన్ యొక్క తక్కువస్థాయిలు, మూడ్ లో కీలక పాత్రపోషించే ఒక రసాయం మెదడు కలిగి ఉంటుంది.

8. సంతానంలో సమస్యలు:

8. సంతానంలో సమస్యలు:

లేట్ అవర్స్ పనిచేయడం, నైట్ షిప్ట్ ల వల్ల సంతాన సమస్యలు వంధ్యత్వం, అంగస్తంబన, తక్కువ వీర్యకణాల సంఖ్య మరియు తక్కువ లిబిడో వంటి సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. అటువంటి లేట్ వర్కింగ్ షిప్ట్ లుమరియు ఇతర వ్యసనాలు కెఫిన్ మరియు నికోటిన్ వంటి లేట్ వర్కింగ్ అవర్స్ కు దారితీసి లైంగిక ప్రదర్శన మరియు సంతానోత్పత్తి సమస్యలకు పెంచుతుంది.

English summary

Health problems in men who work till late

In dealing with today’s lifestyle, most men tend to work that extra hour to have a better life. For many it becomes an obsession to grow at a faster pace or achieve something relentlessly, they tend to work a lot more than they can take physically as well as mentally.
Story first published: Monday, November 18, 2013, 14:41 [IST]
Desktop Bottom Promotion