For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరీ సన్నగా ఉన్నారా? ఐతే మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

|

ఫ్యాట్ ఫుడ్స్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ లో ఎంత మేరకు క్రొవ్వులు నిల్వ ఉంటాయో మనకు తెలుసు. అందుకే మీ డైట్ లో ఆరోగ్యకరమైన మరియు న్యూట్రీషియన్ ఫుడ్స్ ను తినమని ఎప్పుడూ చెబుతుంటారు. అటువంటి ఆహారాలు ఆరోగ్యం మరియు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఒక వేళ మీరు డైట్ ఫాలో అవుతున్నాకూడా మంచి పౌష్టకాహారంతో కూడిన డైట్ ను ఫాలో అవ్వమని చెబుతుంటారు. దాంతో ప్రతి రోజూ మీ శరీరానికి అందాల్సిన న్యూట్రీషియన్స్ మీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. దాంతో శరీరం ఒక మంచి ఆకృతిని కలిగి ఉండటానికి, వ్యర్థ మరియు కొవ్వుపదార్థాలకు దూరంగా ఉండటం వల్ల మంచి శరీరాకృతిని మొయింటైన్ చేయగలుగుతన్నారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాల్లో కూడా క్రొవ్వులు కలిగి ఉంటాయి.

వెల్, ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువు(క్రొవ్వు) పెరిగేలా చేస్తాయి!కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనా కానీ, క్రొవ్వులు అధికంగా ఉంటాయి. ఉదా: సుశిరోల్స్, వైట్ రైస్, వైట్ బ్రెడ్, చీజ్, పాలు, పెరుగు, వంటి ఫుడ్స్ శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని అంధిస్తాయి. ఇవన్నీ కూడా అధిక న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ హెల్తీ ఫుడ్స్ లో ఫ్యాట్(క్రొవ్వులు)అధికం. మిమ్మల్ని ఫ్యాట్ గా మార్చే కొన్ని ఆహారాలను తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే ఈ క్రింది ఫుడ్ లిస్ట్ చూడండి...

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

సుశిరోల్స్: సుశిరోల్స్ తగిన పరిమాణంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారనే విషయం మీకు తెలుసా!అయితే పరిమాణం మించితే సుశిరోల్స్ మీద ఉన్న చీజ్ మరియు మయోనైజ్ వంటివి ఖచ్చితంగా కొవ్వుపెరిగేలా చేసి ఫ్యాట్ అయ్యేలా చేస్తాయి. జీర్ణం అవ్వడం కూడా కష్టం అవుతుంది.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

వైట్ రైస్: వైట్ రైస్ లో అనేక హెల్త్ మరియు న్యూట్రిషినల్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ఇది హెల్తీ ఫుడ్ అయినా కూడా బరువు పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్లే బ్రౌన్ రైస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో క్యాలరీస్ మరియు గంజి(పిండిపదార్థాలు)తక్కువ.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

ఇడ్లీ: ఇండియన్ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ. దీన్ని బియ్యం పిండితో తాయరు చేస్తారు. ఆవిరి మీద ఉడికించడం వల్ల క్యాలరీస్ అన్నీ తగ్గిపోతాయి. ఇడ్లీ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బియ్యంతో చేయడం వల్ల కొద్దిగా హెవీగా అనిపిస్తూ బియ్యంను అరగడానికి కష్టం అవుతుంది. దీనికంటే రవ్వ లేదా రాగి తో తయారు చేసి ఇడ్లీలను తినడం వల్ల ఆరోగ్యంతో పాటు బరువు పెరగనియ్యవు.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

వ్రాప్స్: చికెన్ లేదా పెప్పర్ వ్రాప్స్ మీద మయోనైజ్ లేదా చీజ్ పూతతో కవర్ చేయబడి ఉంటాయి. మరీ ముఖ్యంగా చాలా వరకూ వ్రాప్స్ మైదా పిండితో తయారు చేయబడి ఉండటం వల్ల ఇవి క్రొవ్వులు కలిగి ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

చీజ్: మీరు కనుక లోఫ్యాట్ మరియు హెల్తీ చీజ్ ఎంపిక చేసుకోకపోతే, మీరు బరువు పెరగానికి ముగింపు పలకాల్సిందే. చీజ్ లో క్యాల్షియం, అధికంగా ఉంటుంది. ఈ హెల్తీ ఫుడ్ మిమ్మల్ని ఫ్యాట్ గా మార్చుతుంది. కాబట్టి బరువు పెరగాలనుకొనేవారు లోఫ్యాట్ కాటేజ్ చీజ్ ను ఎంపిక చేసుకోవాలి.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

ఫ్రూట్ ఫ్లేవర్ పెరుగు: పెరుగు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇది ఆరోగ్యకరమైనదే కానీ, బరువు పెరగనివ్వుదు. కాబట్టి లోఫ్యాట్ అన్ స్వీటెన్డ్ అన్ ఫ్లేవర్ యోగ్రర్ట్ ను ఎంపిక చేసుకోవాలి.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

గ్రానులా: బార్లీ టేస్ట్ తో స్వీట్ అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఒక బౌల్ గ్రాన్యులా 500క్యాలరీస్ కలిగి ఉంటుంది. అంతే కాదు ఇందులో ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఫ్యాట్ గా మార్చుతాయి.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

క్యాసర్ సలాడ్: సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు వీటిలో క్యాలరీస్ కూడా తక్కువే. అయితే కొన్ని సలడ్స్ ఉదా: క్యాసర్ సలాడ్స్ వంటివి మిమ్మల్ని ఫ్యాట్ గా మార్చుతాయి. ఈ సలాడ్ మీద క్రీమ్స్ తో గార్నిష్ చేయడం వల్ల ఫ్యాట్ అధికంగా ఉంటుంది.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

అరటిపండు: అరటి పండును తగు మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరగరు. ఒక రోజుకు మూడు అరటి పండ్లకంటే ఎక్కువగా తిన్నప్పుడు ఖచ్చితంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ హెల్తీ ఫుడ్ మిమ్మల్ని ఖచ్చితంగా ఫ్యాట్ గామార్చేస్తుంది.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

మామిడి పండ్లు: మామిడిపండ్లలో అధికశాతం విటమిన్స్ మరియు ప్రోటీనులు ఉండటం వల్ల తప్పనిసరిగా ఫ్యాట్ అవుతారు. మ్యాంగోస్ లో క్యాలరీస్ తక్కువ, ఎక్కువ పండ్లను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బరువు పెరుగుతారు.

మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!

డ్రై ఫ్రూట్స్: ఈ హెల్తీ ఫుడ్స్ లో అధిక న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇదులో హైకాలరీస్ మరియు షుగర్ కంటెంట్ పుష్కలంగా ఉండా ఫ్యాట్ (బరువు )పెరగడానికి దోహదం చేస్తాయి.

English summary

Healthy Foods That Can Make You Fat | మీ శరీర బరువును పెంచే హెల్తీ ఫుడ్స్...!


 We know that fatty and fried foods are fattening. That is why, it is always advised to have healthy and nutritious foods in your diet. They are healthy and good for the body. Even if you are on a diet, you must have healthy foods to meet the daily nutritional requirements of the body. To maintain our figure, we thrive for healthy foods over junk and fatty foods. However, even healthy foods can be fattening.
Story first published: Monday, March 25, 2013, 17:53 [IST]
Desktop Bottom Promotion