For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో వేడి తగ్గించేందుకు ఆరోగ్యకరమైన జ్యూసులు

|

సాదారణంగా ముఖంపై మొటిమను చూసినప్పుడు శరీరంలో వేడి ఉందని అనుకుంటాము. అనేక మంది శరీరంలో వేడితో బాధపడుతున్నారు. ఇది ఒక సాధారణ ఆరోగ్య పరిస్థితి. శరీరంలో వేడి పెరగటం అనేది ప్రధానంగా శరీర ఉష్ణోగ్రత మీద ఆదారపడి ఉంది. ఒక వ్యక్తి యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు ఉంటుంది. కొద్దిగా మార్పులు జరుగుతూ ఉండవచ్చు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఉష్ణోగ్రత నిర్వహించబడుతుంది.

అయితే శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగటం లేదా తగ్గటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. మీ శరీరంలో వేడి స్థాయిలను గమనించటం చాలా కీలకం. మీ శరీరంలో ప్రతి సీజన్లో వేడితో బాధపడుతూ ఉంటే అప్పుడు శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించాల్సిన అవసరం ఉంది.

శరీరంలో వేడిని వేడి ఒత్తిడి అని కూడా అంటారు. శరీరంలో వేడి తగ్గించక పొతే అంతర్గత అవయవాల నష్టం,వేడి తిమ్మిరి,వేడి దద్దుర్లు,మొటిమలు,కళ్ళు తిరగటం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. శరీరంలో వేడికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు అధిక వేడి వాతావరణం, ఎక్కువ వ్యాయామం,వేడి ఉత్పత్తి ఆహారాలు మరియు తగినంత నీరు త్రాగకపోవటం వంటివి శరీరంలో వేడికి ప్రాధమిక కారణాలు అని చెప్పవచ్చు.

మీకు సాధారణంగా శరీరంలో వేడిని తగ్గించేందుకు పుచ్చకాయ,దోసకాయ,హానీడ్యూ నిమ్మ,ముల్లంగి, పుదీనా మొదలైన ఆహారాలు ఉన్నాయి. అయితే ఆర్ద్రీకరణ స్థితిలో ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇది మీ నిరోధక వ్యవస్థ సౌలభ్యం మరియు శరీరంను శుభ్రంగా ఉంచుతుంది. కానీ నీరు ఉష్ణోగ్రత సాదారణ స్థితిలో ఉండేటట్లు చేస్తుంది. వారికి ఒక చల్లని ప్రభావాన్ని అందించడానికి మరియు శరీరంలో వేడిని తగ్గించడానికి అనేక ఆరోగ్యకరమైన ద్రవాలు ఉన్నాయి.

మీరు శరీరంలో వేడితో బాధపడుతూ ఉంటే దాని ప్రభావం తగ్గించి చల్లపరచటానికి ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన రసాలు ఉన్నాయి.

పుచ్చకాయ జ్యూస్:

పుచ్చకాయ జ్యూస్:

ఎరుపు రంగు కలిగి ఎక్కువ నీటితో ఉన్న ఈ గొప్ప పండు శరీరంపై గొప్ప చల్లని ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో వేడిని తగ్గించడానికి మరియు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి తాజాగా ఉన్న పుచ్చకాయ రసంను సిద్ధం చేసుకోండి.

హానీడ్యూ నిమ్మరసం:

హానీడ్యూ నిమ్మరసం:

ఇది శరీరంలో చల్లగా ఉంచేందుకు వేసవిలో విస్తృతంగా వినియోగించే మరొక ఆరోగ్యకరమైన పండు. మీరు దాదాపు అన్ని సీజన్లలో శరీరంలో వేడితో బాధపడుతూ ఉంటే మీరు ఈ రసం త్రాగితే వేడి తగ్గుతుంది.

మజ్జిగ:

మజ్జిగ:

మజ్జిగ శరీరంలో వేడిని తగ్గించడానికి మరియు ఆర్ద్రీకరణ స్థితిలో ఉండడానికి ఒక ఇంటి పరిష్కారంగా ఉంది. మజ్జిగ చల్లదనాన్ని మరియు జీర్ణక్రియకు సహాయంను అందిస్తుంది.

దోసకాయ జ్యూస్:

దోసకాయ జ్యూస్:

బ్లెండెడ్ దోసకాయ 95% నీరు కలిగి శరీరంలో వేడిని తగ్గించేందుకు ఒక ఆరోగ్యకరమైన రసంగా ఉంటుంది. దోసకాయ రసం శరీరంలో ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుతుంది. అంతేకాక శరీరంను చల్లబడుతుంది.

కొబ్బరి నీరు:

కొబ్బరి నీరు:

ఈ శరీరంలో వేడిని తగ్గించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటిగా ఉంది. మీరు ప్రతి రోజు లేత కొబ్బరి నీరు కనీసం ఒక గ్లాసు త్రాగడానికి ప్రయత్నించండి.

చక్కెర నీరు:

చక్కెర నీరు:

నీరు నిలుపుదల అనేది నిజంగా సమస్యాత్మకమైనదిగా ఉండవచ్చు. నీరు నిలుపుదల మీద పోరాడటానికి మీరు ఒక గ్లాస్ నీటిలో 2tsp చక్కెర వేసి కలిపి త్రాగాలి. అప్పుడు అది మీ గ్లూకోజ్ స్థాయిలు మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పుదీనా వాటర్:

పుదీనా వాటర్:

ఇది శరీరంలో వేడిని తగ్గించగల ఒక ఆరోగ్యకరమైన ద్రవంగా చెప్పవచ్చు. పుదీనా శరీరంనకు చల్లదనాన్ని అందిస్తుంది. అంతేకాక శోథను కూడా తగ్గిస్తుంది.

దానిమ్మ జ్యూస్:

దానిమ్మ జ్యూస్:

సాధారణంగా శరీరంలో వేడిని తగ్గించటానికి ప్రతి రోజు ఎరుపు వైన్ రంగు కలిగి ఉన్న పండు రసంను త్రాగండి.

చల్లని పాలు:

చల్లని పాలు:

బాయిల్డ్ చేయని చల్లని పాలు త్రాగితే సహజంగా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కానీ శరీరం కూడా చల్లబడుతుంది. చల్లని పాలు జీర్ణశక్తికి సహాయం మరియు అలాగే శరీరంను ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుతుంది.

సోంపు గింజలు:

సోంపు గింజలు:

ఒక గ్లాస్ నీటిలో రాత్రిపూట సోంపు గింజలు నానబెట్టి ఉదయం ఆ నీటిని త్రాగాలి. ఇది మోటిమలను తగ్గిస్తుంది. శరీరం వేడి కారణంగా కలిగే ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

English summary

Healthy Juices And Fluids To Reduce Body Heat


 
 When you see a pimple popping out, you generally say that it is the body heat which is throwing out. There are many people who suffer from body heat.
Story first published: Thursday, September 26, 2013, 17:46 [IST]
Desktop Bottom Promotion