For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వసంత కాలం/వేసవి కాలంలో ఈ ఆహారాలను మిస్ చేయకండి...!

|

స్ప్రింగ్ సీజన్ అంటే ఆకురాలే సమయం అంటే శీతాకాలనికి వీడ్కోలు పలుకుతూ..వేసవి కాలాన్ని ఆహ్వానించే సీజన్ స్ప్రింగ్ సీజన్ (ఆకురాలే కాలం/వంతకాలం). ఈ కాలంలో పగలు ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఒక్క రాత్రి పగలు మాత్రమే కాదు వాతారణంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణంలో మార్పులు కారణంగా వివిధ రకాలైన వెజిటేబుల్స్ మరియు పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు ఆరెంజ్ ఇవి శీతాకాలంలోనూ మరియు వేసవి వేళ్ళే వరకూ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఆరెంజ్ ఎక్కువగా నవంబర్-డిసెంబర్ లో ఎక్కువగా లభ్యం అవుతాయి. హైబ్రీడ్ పండ్లు మరియు వెజిటేబుల్స్ సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి.

సీజన్ మారే కొద్ది వాతావరణం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో తీసుకునే ఆహారంపట్ల శ్రద్దవహించడం చాలా అవసరం. ఎందుకంటే చెమటరూపంలో ఎక్కువగా శరీరంలోని నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. వీటివల్ల విటమిన్‌లు సమృద్దిగా అంది ఆరోగ్యానికి మేలుచేస్తుంది. ఎండదెబ్బకు వచ్చే నీరసాన్ని చిటికలో నివారించే వీలు చిక్కుతుంది. దీనికితోడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటి తిండిలకు దూరంగా ఉంటే వేసవిలో అనారోగ్య సమస్యలు రాకుండా గట్టెక్కవచ్చు. ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తిన్నా తాగినా ఆరోగ్యంపై ఖచ్చితంగా దుష్ప్రభావం చూపుతుంది. ద్రవాహారమే మేలు.

ప్రతీసీజన్‌లో ఏవో పండ్లు దొరుకుతూనే ఉంటాయి. వేసవికాలంలో మాత్రం చాలారకాల పండ్లు పలకరిస్తాయి. వీటిలో విటమిన్‌లతో కూడినవాటిని తీసుకోవాలి. నిమ్మ, జామ, ద్రాక్ష, పుచ్చకాయలను తీసుకోవడంవల్ల విటమిన్‌ సితోపాటు శరీరానికి కావలసిన ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. జీడిపప్పు, బాదం, పిస్తాలలో విటమిన్‌ ఇ ఉంటుంది. బొప్పాయి, క్యారెట్‌, మామిడిలో విటమిన్‌ ఏ లభిస్తుంది. ఆకుకూరల్లో కాలుష్యంతోపాటు ఐరన్‌ సమృద్దిగా ఉంటుంది. ఈ సీజన్ లో దొరికే పండ్లు, వివిధ రకాల కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఆపిల్స్, ఆస్పరాగస్, బ్లూ బెర్రీస్, ఆప్రికాట్, ఆస్ట్రిచెస్ మరియు వెల్లుల్లి వంటివి వేసవి కాలపు ఆహారాలు. ఈ సీజన్ లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. మరి మీరు సీజనల్ ఫుడ్స్ తినాలనుకుంటున్నారా..?మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ లో దొరికి పండ్లు మరియు కూరగాయలు ఏంటో ఒక సారి చూడండి...

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

ఆప్రికాట్: ఆకు రాలే కాలం ముగుస్తుండగా అంటే వేసవి మొదలవుతుందనంగా ఈ పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఈగోల్డెన్ ఆరెంజ్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇంకా లోక్యాలరీస్ ను కలిగి ఉండి బరువు తగ్గించుకోవడానికి బాగా సహాయపడుతాయి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

ఆర్టిచోకెస్: ఆర్టిచోకెస్ లో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాంశాలుండే ఈ హెల్తీ వెజిటేబుల్ స్ప్రింగ్ సీజన్ లో అందుబాటులో ఉంటాయి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

బ్లూ బెర్రీస్: బెర్రీపండ్లు బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి బరువు తగ్గడానికి బాగా సహకరిస్తాయి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

క్యారెట్స్: క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

ఫవ బీన్స్: ఈ స్ప్రింగ్ వెజిటేబుల్ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తుంది. ఇంకా బరువును తగ్గిస్తుంది. మీరు కనుక డైయట్ పాటిస్తున్నట్లైతే ఈ అత్యధిక పోషకాలున్న ఆహారన్ని మీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోండి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

రెడ్ రాడిష్(ఎర్ర ముల్లంగి): ఎర్ర ముల్లంగి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సిన నీటి నింపుతుంది. ఇంకా ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని కలగనివ్వదు. ఈ ఎర్రని మరియు తెల్లని ముల్లంగి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

బంగాళ దుంపలు: ఈ సీజన్ లో కాచే కొత్త బంగాళదుంపలు, బేబీ పొటాటో ఈ సీజన్ లో విరివిగా లభ్యం అవుతాయి. ఈ బేబీ పొటాటోను ఉడికించి లేదా గ్రిల్ చేసి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

విడాలియన్ ఆనియన్స్: సంవత్సరం మొత్తంలో వివిధ రకాల ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయి. అయితే విదాలియా ఉల్లిపాయలు ఈ సీజన్ లో మాత్రమే లభ్యం అవుతాయి. ఇవి తినడానికి కొంచెం తియ్యంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా సలాడ్స్ లో వినియోగిస్తారు. ఈ సల్ఫర్ రిచ్ ఆనియన్స్ ఆరోగ్యపరంగా కొన్ని అద్భుతాను క్రియేట్ చేస్తుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

అవొకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం అవొకాడోలో పుష్కలంగా ఉంటాయి.వీటిలో కెరోటినాయిడ్స్, ఫొల్లెట్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మధుమేహగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. ఈ పండు కూడా ట్రిగ్లేసెరైడ్ మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

ఫెన్నల్/సోంపు: ఈ వెజిటేబుల్ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటుంది. సోంపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సోంపులో ఫైటో న్యూట్రియంట్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ క్వార్సిటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

గ్రీన్ గార్లిక్: ఇందులో అనేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి వంటల్లో మంచి రుచిని ఇవ్వడమే కాకుండా గుండె, జీర్ణసంబంధిత ఇన్ఫెక్షన్ల నుండి భయటపడేలా చేస్తుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

నిమ్మకాయ: ఇవి వింటర్ లో విరివిగా దొరుకుతాయి. బరువు తగ్గించడానికి, శరీరంలోని విషాలను బయటకు పంపడానికి, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

కీరదోసకాయ: ఈ వాటర్ రిచ్ గ్రీన్ వెజిటేబుల్ లో అత్యధిక పోషకాంశాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటిని సలాడ్ గా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత తేమ అంది, జీర్ణ వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

చిల్లీస్: రెడ్ చిల్లీ వంటకాల్లో రుచి, కారం పొందడానికి మాత్రమే కాదు, శరీరంలోని అన్ని జీవక్రియలు క్రమంగా జరిపించేందుకు, మరియు బరువు తగ్గడానికి రెడ్ చిల్లీస్ బాగా సహాయపడుతాయి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

ఫిగ్: రక్తహీనత (అనీమియా)ను నివారించాలంటే సాధారణంగా మాంసాహారమైన కాలేయం, గుడ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ఈ సమ్మర్ సీజన్ లో దొరికే ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా గడుపగలుగుతారు.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

గూస్ బెర్రీ(పెద్ద నల్లికాయలు): వీటిని పెద్ద నల్లికాయలని, ఆమ్లా అని, గూస్ బెర్రీస్ అని పిలిచే వీటిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

దబ్బపండు(గ్రేప్ ప్రూట్): మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇది సాధారణంగా రక్తంలోని అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని నిలుపుచేయడానికి దీన్ని జ్యూస్ లా తయారు చేసి తీసుకోవడం మంచిది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

నెక్టారినే(ఒక విధమైన పండు): దీన్ని చూడటానికి పీచెస్ లాగే ఉంటుంది. ఇవి సమ్మర్ లో పుష్కలంగా లభ్యం అవుతాయి సిట్రస్ పండ్లలో ఇది ఒకటి. ఇందులో బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కంగా ఉండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

పైనాపిల్: ఇందులో నీటితో కూడిన యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పైనాపిల్ తరచూ తీసుకోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి ఎముకల బలానికి, దగ్గు, జలుబు తగ్గించడానికి, దంతా ఆరోగ్యానికి, జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

కొత్తిమీర: ఈ తాజా గ్రీన్ కొత్తిమీరను వివిధ వంటకాల్లో మరియు సలాడ్స్ లో విరివిగా ఉపయోగిస్తారు. కొత్తిమీర సంవత్సరం అంతయూ దొరికినా ఈ సీజన్ లో ఎక్కువగా లభ్యం అవుతుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

పుచ్చకాయ: ఇది అత్యధిక నీటిశాతాన్ని కలిగినది. ఇవి వేసవిలో విరివిగా లభ్యం అవుతాయి. కాబట్టి ప్రతి రోజూ మీ డైయట్ లో దీన్ని తీర్చుకోవడం వల్ల శరీరానికి అందవల్సిన వాటర్ తో పాటు, విటమిన్ ఎ, బి, పొటాషియం, మరియు థైమిన్ అందిస్తుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

పుచ్చకాయ(Muskmelon): సాధారణంగా దోసకాయలు తియ్యంగా ఉండు కడుపు నిండుగా చేస్తుందంటారు. అయితే వీటిలో ఉండే ఫైబర్ ఆ తియ్యదనాన్ని తగ్గించేస్తుంది. అయితే ఎక్కువగా పండుగా మారిన పండ్లను తీసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అవి రక్తంలోని చక్కెరస్థాయిలను పెంచుతుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

ద్రాక్ష: మధుమేహగ్రస్తులు తినగలిగే మరో సిట్రస్ ఫ్రూట్ ఇది, ఇందులో శరీరానికి హాని కలిగించే పిండి పదార్థాలు కలిగి ఉంటాయి కాబట్టి తగు మోతాదులో తీసుకోవాలి.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

పపాయ: బొప్పాయి పండులో విటమిన్ సి, ఫోలెట్, కెరోటినాయిడ్స్ మరియు సాధారణంగా జీర్ణశక్తిని పెంచి ఎంజైములు కలిగి ఉంటుంది. ఒక కప్పు పపాయ ముక్కల్లో 55 కెలోరీలు ఉంటాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

బ్రొకోలి: కాలీఫ్లవర్ లా ఉండే ఈ గ్రీన్ వెజిటేబుల్ చర్మా ఛాయను నేచురల్ గా మార్చేస్తుంది. ఇందులో విటమిన్ సితో పాటు విటమిన్ ఇ మరియు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల చర్మం శుభ్రపడి, కొత్త మెరుపులను తీసుకొస్తుంది.

English summary

Healthy Spring/Summer Fruits and Vegetables | వేసవి ఆరోగ్యానికి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్-వెజిటేబుల్స్..!

Spring is a season that marks the end of winter and welcomes summer. The days are getting longer and nights are getting shorter! Apart from the day and night timing changes, even the weather is changing.
Story first published: Tuesday, March 12, 2013, 17:23 [IST]
Desktop Bottom Promotion