For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా గ్రీన్ టీ తాడమేలా?

|

గ్రీన్ టీ గురించి ఎంత మాట్లాడుకొన్న తక్కువ ఎందుకంటే గ్రీన్ టీలో అమేజ్ బ్యూటీ, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవిషయం మనందరికీ తెలిసిందే. ఈ మద్యకాలంలో గ్రీన్ టీ చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా పనిచేసే ఉద్యోగస్తులకు గ్రీన్ టీ చాలా ఆరోగ్యరంగా అధిక ప్రయోజనాలందిచే ఔషదంగా, బరువు తగ్గించే మాయాజాలంగా పాపులర్ అయ్యింది. అయితే ఈ హెల్తీ పానీయం గ్రీన్ టీ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయని తెలుసుకోవల్సి ఉంది. ఉదాహరణకు ఒక రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల స్టొమక్ అప్ సెట్, ఆతురత మరియు విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

కాఫీ వంటి ఇతర కెఫినేటెడ్ పానియాల్లో కంటే గ్రీన్ టీలో చాలా తక్కువగా కెఫిన్ కలిగి ఉండవచ్చు. అయితే, గ్రీన్ టీను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కెఫిన్ పెరుగుతుంది. దాంతో నిద్రలేమి, డీహైడ్రేషన్ మరికొన్ని ఇతర సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా స్టొమక్ అల్సర్ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలున్న వారు గ్రీన్ టీను ఎక్కువగా తీసుకోవడాన్ని తగ్గించాలి. లేదంటే కడుపులో ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి(ఎసిడిటి)కి కారణం అవుతుంది. మరో చెడ్డ దుష్ప్రభావమేటంటే ఇది ఐరన్ లోపానికి దారితీస్తుంది. గ్రీన్ టీను ఎక్కువగా తీసుకోవడం వల్ల అబార్షన్ కు కారణం అయ్యే ఐరన్ ను రక్తంలో తగ్గించేస్తుంది. కాబట్టి గ్రీన్ టీను ఆరోగ్యకరంగా మితంగా తాగడం చాలా ముఖ్యం.

మీరు గ్రీన్ టీ తాగాలనుకుంటున్నారా, ఐతే ముందుగా మీరు చేయాల్సింది...మితంగా తీసుకోవడమే. గ్రీన్ టీని మితంగా తీసుకోవడానికి ఇక్కడ కొన్నిఆరోగ్యకరమైన మార్గాలున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా గ్రీన్ టీ తాగడానికి ఈ చిట్కాలు బాగా సహాయపడుతాయి. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం..

తాజాగా తాగాలి:

తాజాగా తాగాలి:

తాజాగా ఉండే గ్రీన్ టీ తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండేందుకు ఇది ఒక మంచి పద్దతి. గ్రీన్ టీని తాజాగా తయారుచేయాలి . మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. కానీ పూర్తిగా చల్లారనివ్వకూడదు. మిగిలిన టీ, చల్లారిన టీ తాగడం వల్ల దానిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు తగ్గుతాయి.

బాగా మరిగించాలి:

బాగా మరిగించాలి:

గ్రీన్ టీ ఆకులను సరిగా ఉడికించకపోతే, అది చేదుగా లేదా రుచిలేకుండా ఉండవచ్చు. గ్రీన్ టీ ఆకులను బాగా మరిగించడం వల్ల రుచి, రంగు మరియు ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయి.

గ్రీన్ టీకి షుగర్ వాడకూడదు:

గ్రీన్ టీకి షుగర్ వాడకూడదు:

ఆరోగ్యకరమైన గ్రీన్ టీ తాగాలన్నా మరియు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించాలన్నా గ్రీన్ టీలో పంచదారను మిక్స్ చేయకూడదు. ఇది రుచిని చెడగొట్టడంతో పాటు అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి పంచదారకు బదులు తేనెకు ప్రాధాన్యత ఇవ్వండి. మరియు గ్రీన్ టీ మరే ఇతర పౌడర్స్, పాలు, పానీయాలు మిక్స్ చేయకూడదు.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీ చాలా స్ట్రాంగ్ గా తాగకూడదు. మీ ప్రాధాన్యతను మార్చుకోవాలి. గ్రీన్ టీ ఆరోగ్యకరంగా తాగాలన్నా మరియు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవాలన్నా, స్ట్రాంగ్ గ్రీన్ టీ తాగకూడదు.

ఇతర్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు:

ఇతర్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు:

గ్రీన్ టీ తాగేటప్పుడు, ఏ ఇతర టాబ్లెట్స్ లేదా సప్లిమెంట్స్ తీసుకోకూడదు. కెమికల్స్ మరియు టీ కాంపౌండ్స్ జీవక్రియను స్తంబిప చేస్తాయి.

చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి:

చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి:

ఆరోగ్యకరమైన పద్దతిలో గ్రీన్ టీ తాగాలనుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించాలన్నా గ్రీన్ టీని మితంగా తీసుకోవాలి. ఎటువంటి పానీయం అయినా సరే అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యలకు దారితీస్తుంది.

డ్రింక్ టైమింగ్స్:

డ్రింక్ టైమింగ్స్:

గ్రీన్ టీని ఉదయం కాలీకడుపుతో తీసుకోవడం వల్ల మంచి ప్రభావం చూపెడుతుంది. మరియు మంచి ఫలితం ఉంటుంది. మీరు డైట్ పాటిస్తుంటే మరియు మీ ఆకలిని కంట్రోల్ చేసుకోవాలన్నా, గ్రీన్ టీ భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేసి ఒక గంట తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్తను మెరుగుపరుస్తుంది. శరీరంలో కావల్సిన న్యూట్రిషియన్స్ మరియు విటమిన్స్ గ్రహించబడుతుంది.

English summary

Healthy Ways To Drink Green Tea

When we talk about green tea, we only focus on the health and beauty benefits of this healthy beverage. However, it would be crucial to know that even green tea has its own set of side effects.
Story first published: Friday, September 20, 2013, 17:51 [IST]
Desktop Bottom Promotion