For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి 10ఉత్తమ మార్గాలు

|

తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి వుండదు. మనస్సు ఎంతో ప్రశాంతంగా వుంటుంది. నిర్మలంగా వుంటుంది. నిర్మలమైన మనస్సును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట. అందుకే మానస సరోవరం అంటారు. తనకోపమే తనశత్రువు తన శాంతమే తనకు రక్షఅనేది అక్షరసత్యం కోపం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం భార్యాభర్తల మధ్య అనురాగానికి, సోదరుల మధ్య స్నేహితుల మధ్య ఆత్మీయతా అనుబంధాలు దెబ్బతినడానికి, అడ్మినిస్ట్రేషన్లలో సామర్థ్యం దెబ్బతినడానికి ఇలా..కోపం ఎన్నో అనర్థాల్ని స్పష్టిస్తుంది. కోపాన్ని అధిగమిస్తే జీవితంలో ఎన్నో ఘనవిజయాలు సాధించవచ్చు. ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరచుకోవచ్చు.

కట్టలు తెంచుకునే కోపం.. ఎందుకంత కోపం.. అసలు కోపానికి కారణాలేమిటి.. అని దానికి గల కారణాలను అన్వేషిస్తే... దిగులు అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా వున్నాయి.. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకూ రాకుండా చూసుకోవాలి. ఒక వేళ వచ్చి నప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దానిని అదుపులో వుంచుకొనుటకు కొన్ని ప్రయత్నాలు చేయండిలా...

10-1అంకెలు లెక్కపెట్టండి:

10-1అంకెలు లెక్కపెట్టండి:

మీరు కోపంగా ఉన్నప్పుడు, అంకెలను డిసెండింగ్ ఆర్డర్ 10-1లో అంకెలను లెక్కపెట్టాలి. లెక్కపెట్టేటప్పుడు నిదానంగా లెక్కపెట్టాలి. అలా చేసినప్పుడు మీ కోపానికి కారణం అయ్యే పరిస్థితి నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది.

బయట వాకింగ్ చేయండి:

బయట వాకింగ్ చేయండి:

మీకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలున్నప్పుడు, ఎప్పుడైతే కోపంతో ఉన్నప్పుడు మీకోపానికి ఒక వ్యక్తి లేదా కుటుంబ సమస్యలు లేదా స్నేహితులకు లేదా కుంటుంబానికి సంబంధించినే సమస్యలు మీకు కోపం తెప్పిస్తే, వాటిని నుండి బయటపడాలంటే, కొంత సమయం బయట వాక్ చేయండి. ఇలా చేయడం వల్ల నిజంగా సహాయపడుతుంది. మీ కోపాన్ని అణచివేస్తుంది.

శ్వాసతీసుకోండి:

శ్వాసతీసుకోండి:

కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్, దీర్ఘంగా లోతైన శ్వాసతీసుకోండి ఒక ఉత్తమ మార్గం. డీప్ బ్రీతింగ్ వల్ల, మనస్సును దానిమీద లగ్నం చేయవచ్చు . ప్రతి ఉశ్చ్వాస, నిశ్చ్వాసలోనూ మీ కోపం ఇట్టే మాయం అవుతుంది. కొంత సమయం నిశ్శబ్దాన్ని పాటించి, ఆలోచించాలి.

మీ కోపానికి కారణాన్ని కనుక్కోండి:

మీ కోపానికి కారణాన్ని కనుక్కోండి:

కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం, మీ కోపానికి గల ప్రధాన కారణం ఏంటో కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించుకోవడానికి కారణాలు కనుక్కోండి. మీరు కారణం తెలుసుకొనే సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉండాలి. అప్పుడు పూర్తి విషయాన్ని గ్రహించగలరు. అందుకు మీ కుటుంబ సబ్యుల లేదా స్నేహితలు సహాయాన్ని తీసుకోవచ్చు.

సాధ్యమైనంత వరకూ పరిష్కరించుకోవడం కోసం చూడండి:

సాధ్యమైనంత వరకూ పరిష్కరించుకోవడం కోసం చూడండి:

ఇప్పుడు, మీరు మీకోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు. కాబట్టి, దానికి సాధ్యమైనంత వరకూ పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఉదా: ఇంట్లో మీ భర్త యొక్క మురికి అల్మారాను చూసి, మీకు కోపం వచ్చినప్పుడు, అతనితో ఒక సారి సున్నితంగా మాట్లాడి శుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. లేదంటే మీరే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి లేదా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి.

మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి:

మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి:

యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికీ చాలా ఆరోగ్యకరమైనది. ఇది మానసిక మరియు భావోద్వేగాలను నుండి బయటపడటానికి ఇది ఒక ఉత్తమ మార్గం. మీకు కోపం తెప్పించే అనేక సందర్భాల్లో మీరు మరింత సహనంతో ఉండటానికి మరియు మీ బావోద్వేగాలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం మరియు క్షమించడం :

కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం మరియు క్షమించడం :

మీకు కోపం తెప్పించే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను అప్పుడే మర్చిపోవడం ఉత్తమం. అదేవిధంగా మర్చిపోవడం మరియు క్షమించడం. ఇది ప్రతి ఒక్కరిలో అంత సులభంగా జరిగే పని కాకపోయినా, కొంత సమయం వేచి చూస్తే తప్పకుండా మార్పు వతస్తుంది. దీన్ని అభ్యాసం చేయడం వల్ల కోపంను అణచివేయడానికి ఇది ఒక గొప్ప మార్గం.

ఫ్రెండ్స్ తో మాట్లాడటం:

ఫ్రెండ్స్ తో మాట్లాడటం:

అనేక సందర్భాల్లో, మనలోని నిరాశ కోపం రూపంలో బయటకు వస్తుంది. దానికి మన కుటుంబం సభ్యులు బాధితుడు అవుతాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం ఒక మంచి మార్గం. అయితే మీ స్నేహితులకు అర్థం చేసుకొనేవారై ఉండాలి. మీ సమస్యలను మీ ఫ్రెండ్స్ తో వ్యక్తపరచుకొన్నప్పుడు, మీకు కొంత మనశాంతి కలుగుతుంది. మనస్సు తేలిక పడుతుంది.

మీకు నచ్చినపని చేయడం:

మీకు నచ్చినపని చేయడం:

డ్యాన్స్, మ్యూజిక్ వినడం, బయటకు వెల్లడం, స్నేహితులకు కలవడం వంటివి మీరు కోపంగా ఉన్నప్పుడు చేయవల్సిన మరొకొన్ని మార్గాలు.

వంటి రిలాక్సేషన్ ప్రక్రియలను చేయండి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్:

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్:

పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడటం, పాజిటివ్ గా ఉండటం తెలుసుకొన్నప్పుడు ‘జీవితం అందంగా ఉంటుంది. మీకు మీరు కొన్ని పాజిటివ్ వాక్యాలను రాసుకోవడం, చదడం, చేయాలి. ఇటువంటివి మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.

English summary

Healthy Ways To Handle Anger

Do you get angry very often and vent your anger out in such a manner that you have to regret later? It happens with most of the people when they are going through a rough patch in their life. But sometimes, due to many reasons, it becomes your daily habit.
Story first published: Wednesday, August 21, 2013, 11:48 [IST]
Desktop Bottom Promotion