For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజ పద్దతులతో స్తన సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడం ఎలా...?

|

సాధారణంగా చాలా మంది మహిళలు తమకు స్తన సౌందర్యం అంతంత మాత్రంగా, లేదా చిన్నవిగా ఉన్నాయని చాలా బాధపడిపోతుంటారు. తోటి స్నేహితులు చేసే కామెంట్స్ కారణంగా వారు లోలోపల కుమిలిపోతుంటారు. మరి కొందరు పురుషలక్షణాల వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. నిజానికి స్తనాలు సన్నగా, చిన్నగా ఉండటానికి పలు కారణాలున్నాయంటారు వైద్యనిపుణులు. వంశపారంపర్యంగా తల్లి లేదా తండ్రి వైపు వారు సన్నగా ఉండటం ఒక కారణంగా పేర్కొంటారు. పౌష్టికాహార లోపం వల్ల, పోషణ సరిగా లేకపోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు తగు మోతాదులో అందకపోవడం వల్ల, హార్మోన్ల సమతుల్యం లోపించడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా స్తనాలు చిన్నగా సన్నగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.

చిన్న సైజు వక్షోజాలు కలిగిన మహిళలు వాటిని పెద్దవి చేసుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం కన్నా, సహజసిద్ధమైన విధానం ద్వారా ఎద సంపదను రెట్టింపు చేసుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాయామ నిపుణులైతే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల స్తన సౌందర్యం పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే సహజసిద్ధమైన విధానాలను పాటించడం ద్వారా మార్పు రాత్రికి రాత్రి కనిపించదు. కొన్ని నెలల సమయం తీసుకుంటుంది.

సహజపద్దతులతో పాటు కొన్ని ఆహారాలను(కిడ్నీ బీన్స్, డైరీప్రొడక్ట్స్, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయ, కీర, బెర్రీస్, ఆస్పరాగస్, లెట్యూస్, లెగ్యూమ్) ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల స్తన సంపద వృద్ధి చెందుతుంది. ఇంకా కొన్ని బ్రొమైన్ మరియు మ్యాంగనీస్ అధికంగా ఉన్న ఆహారాలు (అల్లం, వెల్లుల్లి, ప్రాన్స్, బియ్యం, బేరి మరియు బాదం వంటి స్తన వృద్ధికి ఆరోగ్యకరమైన ఆహారాలు. స్తన వృద్ధి కోసం ఆహారాలు అటుంచితే కొన్ని హెర్బస్ (మూలికలు)కూడా బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ ఆహారాలతో పాటు హెర్బస్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల సహజంగా స్తన సౌందర్యాన్ని రెంటింపు చేసుకోవచ్చు.

స్తనాల వృద్థికి దోహదపడే మూలికలు: ప్రకృతితత్వాలతో తయారు చేయుబడ్డ ఈ మూలికలను మహిళలు అధిక సంఖ్యలు వినియోగిస్తున్నారు. మెంతులు, డాంగ్ క్వై, దమియానా, మీతీ వంటి ఔషుధ గుణాలతో ఈ మూలికలను తయారు చేశారు. ఈ మూలికలను వాడటంలో వలన మార్పు రెండు, మూడు నెలల్లో కనిపిస్తుంది.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

మెంతులు: ఆయుర్వేద ప్రకారం మెంతులు బ్రెస్ట్ సైజును పెంచడంలో చాలా సహాయపడుతుంది. అందుకు మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఆ నీటితో స్తనాల వద్ద మసాజ్ చేయాలి. ఇంకా ఆ నానిన మెంతులను మెత్తని పేస్ట్ చేసి ఆ పేస్ట్ ను కూడా మసాజ్ గా ఉపయోగించాలి.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

ఫెన్నల్/(సోంపు): స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్, డైఅనేథల్, ఫోటో అనేథల్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు ఈస్ట్రోజన్ వంటిదే మరో ఫోటోఅనేథోలో ఇందులో ఉండి బ్రెస్ట్ సైజ్ పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు పాలించే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

బ్లెస్డ్ తిస్టిల్: ఈ మూలిక స్తన కణజాలాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇంకా ఇది ఆడ పునరుత్పత్తి వ్యవస్థను పెంచుతుంది. మరియు జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

స్టార్ ఆనీస్(నక్షత్రపు సోంపు): ఇది చైనీస్ మూలిక. దీన్ని వంటకాలకు, మసాల దినుసులతో పాటు విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే స్తన పరిమాణాన్ని సహజంగా పెంచుకోవడానికి వినియోగించవచ్చు. సోంపు మరియు స్టార్ సోంపు ఈ రెండింటిలో ఈస్ట్రోజెన్ ప్రభావితం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

లికోరైస్: లికోరైస్ లో కూడా స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్, డైఅనేథల్, ఫోటో అనేథల్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ కాంపౌండ్స్ ఈస్ట్రోజెన్ మరియు ప్రోలాక్టిన్ హార్మోన్లు పెంచుతాయి.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

వైల్డ్ యామ్: సహజ స్తన వృద్థికోసం దీన్ని ఒక టానిక్ గా ఉపయోగిస్తారు. ఈ ప్రముఖ మూలికను మీరు త్రాగే టీలో కలుపుకొని తాగడం వల్ల బ్రెస్ట్ సైజును పెంపొందించుకోవచ్చు.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

ప్యూరారియా మిరిఫికా: ఈ మూలికను అనేక స్తన వృద్థి చేసేటటువంటి క్రీముల్లో, లోషన్లలో మరియు మాత్రల్లో ఉపయోగించేటటువంటి అత్యంత ప్రభావింతమైన వస్తువు. ఈ మూలిక ద్వారా నిండైన వక్షసంపదను పొందవచ్చు.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

డాంగ్ క్వై: శరీరంలో ఫైటో ఈస్ట్రోజెన్ మరియు కొత్త కణజాల అభివృద్ధి యొక్క ఉత్పత్తిని ఉత్తేజితం చేయడానికి బాగా సహాయపడే ఈ మూలిక ఒక టానిక్ వంటింది. డాంగ్ క్వై ఈ మూలిక మనస్సు మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

సా పాల్మెట్టో: దీన్ని ఒక మేల్ ప్రోస్టేట్ మూలిక అని కూడా పిలుస్తారు. రొమ్మ సంబంధిత వ్యాధుల నివారణకు ఈ సా పాల్మెట్టోను ఆయుర్వేద వైధ్యంలో విరివిగా ఉపయోగిస్తారు.

English summary

Herbs To Increase Breast Size | ఎద సంపదను పెంచే అద్భుతమైన మూలికలు..!

Having fuller and larger breasts is a dream of every woman. While few opt for surgeries, there are many who switch on foods to increase their breast size. Kidney beans, dairy products, split peas, parsley, carrots, onions, cucumber, berries, asparagus, lettuce and legumes are few foods that can increase breasts size naturally.
Desktop Bottom Promotion