For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసిక ఒత్తిడి(డిప్రెషన్)నుండి బయటపడటానికి అద్భుతమైన చిట్కాలు

|

ప్రపంచ దేశాలలో మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతున్నది. ఒకప్పుడు అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇందులో డిప్రెషన్ అంత్యంత ప్రమాదకారిగా మారుతున్నది. డిప్రెషన్ అనేది ఒక విధమైన మానసిక వ్యాధి. ఏదో తెలియని బాధ, నిరాశ, ఏ పనీ చేయాలనిపించకపోవటం, నిస్సత్తువ, నిద్రలేమి, ఆకలి మందగించటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. బరువు విపరీతంగా తగ్గిపోవటం లేదా విపరీతంగా బరువు పెరగటం. తలనొప్పి, జీర్ణసంబంధ వ్యాధులు, చనిపోవాలనే ఆలోచనలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, భవిష్యత్తులో ఏదో విపరీతమైన మార్పులు సంభవిస్తాయన్న భావన మొదలైనవి దీని లక్షణాలు. సకాలంలో దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది ఆత్మహత్యకి కూడా దారితీయవ చ్చు. దీని లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు ఉండవచ్చు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

స్వీయ అవగాహన: జీవితంలోని సంఘటనలను అర్ధంచేసుకోక పోవడం వల్లా, తమపై తాము ఒత్తిడి పెంచుకోవడం వల్లా ప్రజలు సాధారణంగా ఒత్తిడికి గురవుతారు, స్వీయ అవగాహన లోపం వల్ల విపత్కర పరిస్థితులు మనిషిని ఒత్తిడికి గురి చేస్తాయి.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

సహాయం అడగ౦డి: జీవితంలో పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయం అడగడానికి సిగ్గుపడక్కరలేదు. ఎవరూ జీవితంలో బాధ్యతలను ఒంటరిగా తలకెత్తుకోవాలని అనుకోరు. మీ భాగస్వామి నుండో, సహోద్యోగుల నుండి లేదా స్నేహితుల నుండి సహాయం తీసుకొని మీ భావోద్వేగ ఒత్తిళ్లను కొన్నిటినుండి విముక్తిపొందవచ్చు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

రోజూ వ్యాయామం చేయ౦డి: ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం సరైన మార్గం. దీనివల్ల చక్కని శరీర సౌష్టవమే కాకుండా, శరీరంలో అనుకూలతని కూడా తీసుకువస్తు౦ది. వ్యాయామం వల్ల సేరోటోనిన్, టెస్టోస్టెరాన్ విడుదల అవడంవల్ల మనసు నిలకడగా ఉండడం, నిరుత్సాహపరిచే ఆలోచనలను పోగొట్టడం జరుగుతాయి.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

క్రమ పద్ధతిలో సెలవలు : స్థల మార్పు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండడానికి ఎపుడూ సహాయపడుతుంది. జీవితంలో అనుకూలతను తిరిగి తీసుకురావడానికి ఒకరోజు పర్యటనను మించింది ఏదీ లేదు. కనుక మీరు ఎపుడైనా ఒత్తిడికి గురౌతే, బట్టలు సర్దుకుని వెకేషన్ కి వెళ్ళండి. అప్పుడప్పుడూ సెలవు తీసుకునే వారు వారాల తరబడి పని చేస్తూ వుండే వారితో పోలిస్తే విసకటను, యాన్త్రికతను మెరుగ్గా ఎదుర్కొంటారు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

సమతుల ఆహరం : పండ్లు, కూరగాయలు, మాంసం, చిక్కుళ్ళు, కార్బోహైడ్రేడ్లు వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోవడం మనసు చపలత్వాన్ని దూరం చేస్తుంది. సమతుల ఆహరం శారీరక శ్రేయస్సుని పెంపొంది౦చడమే కాకుండా, నిరాశగా ఉన్న మనసుని సాధారణంగా ఉంచుతుంది కూడా.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

బరువు కోల్పోవడం : మీ ఒత్తిడి బరువు సమస్యళ వల్ల అయితే, బరువు కోల్పోవడం అనేది మీ మనసుని సాధారణ స్థాయిలోకి తెస్తుంది. అంతేకాకుండా, శారీరక ధృడత్వం మీ ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, మీ సెల్ఫ్-ఇమేజ్ కి అనుకూలతను జతచేస్తుంది.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

మంచి స్నేహితులు : మంచి స్నేహితులు మీరు మీ జీవితంలో అధిక ఒత్తిడిని ఎదుర్కు౦టున్నపుడు అవసరమైన దయను చూపించడం, వ్యక్తిగత అవహగాహనను ఇవ్వడం వంటి సహాయాలు చేస్తారు. అతేకాకుండా, అవసరమైనపుడు మంచి శ్రోతగా ఉండి, సందేహం, ప్రతికూల సమయాలలో ఎంతో సహాయకారిగా ఉంటాడు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

బ్లాగ్ లేదా జర్నల్ : మీ రోజువారీ భావోద్వేగాలను ఒక పుస్తకంలో రాసుకోవడం మీ ఆత్మపరిశీలనకు, విశ్లేషణకు ఒక అద్భుతమైన మార్గం. ఒక పుస్తకం పెట్టుకోండి, దానిలో ప్రతిరోజూ మీరు మీ జీవితం గురించి ఏమి ఆలోచిస్తున్నారో రాయండి. ఇది మిమ్మల్ని ఒత్తిడినుండి దూరంగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

దురాలోచన దురాలోచన కలవారికి దూరంగా ఉండండి: నిరంతరం ఇతరులను అణచివేయాలని అనుకునేవారి చుట్టూ ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. స్పష్టమైన ఆలోచనలు కలిగినవారు ప్రశా౦తమైన మనసుని, వివేకాన్ని సంరక్షించడానికి సహాయ పడతారు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

ఉద్యోగాన్ని వదలివేయడం: మీ ఒత్తిడికి కారణం వృత్తిపరమైన సమస్యలైతే, ఉద్యోగాన్ని వదలివేయడం వల్ల మనసు ప్రశా౦తంగా ఉంటుంది. రోజు చివరలో, మీరు మీ వ్యక్తిగత ఆనందాన్ని, సంతృప్తికి రాజీ పడకుండా మీ లక్ష్యాలను అంచనా వేయడం అవసరం. మీ ఉద్యోగం మీకు ప్రతిబంధకంగా ఉంటె, వదలివేయండి.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

ఒంటరితనాన్ని దరి చేరనివ్వకండి: వ్యాకులతతో ఉన్నపుడు, మిమ్మల్ని మీరు ప్రపంచం నుండి దూరంగా ఉంచుకోవడం సులభం. అలా చేయడం వల్ల, మీరు మెరుగయ్యే అవకాశాలను పోగొట్టుకుంటున్నట్టే. మీ సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోయినా స్నేహితులతో వుంటే కొంతైనా నిరాశా జనకమైన ఆలోచనలకు దూరంగా వుంటారు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

ఇతరులను ని౦ది౦చకండి: దుఖం కలిగించే పరిస్థితులకు ఇతరులను బాధ్యులను చేసి నిందించడం తేలిక. కానీ మీ అధీనంలో లేని పరిస్థితులను కాకుండా వ్యక్తులను నిందించడం వల్ల జరిగిన పొరపాటు దిద్దుకోలేరని తెలుసుకోవాలి.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

దారుణమైన పరిస్థితులను ఊహించకండి: దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్దంగా వుండడం సరైనదే కానీ, ప్రతీ పరిస్థితిలోనూ దారుణమైన స్థితి ని ఊహించవద్దు. దీని వల్ల మీరు చేసే పనిలో పురోగతి సాధించలేరు, పైగా విజయావకాశాలు పూర్తిగా కనుమరుగౌతాయి.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

మానసిక వైద్య నిపుణుడితో మాట్లాడండి: ఒత్తిడిలోంచి బయటకు రావడానికి అన్నిటికన్నా తేలికైన, ప్రభావవంతమైన మార్గం సైక్రియాటిస్ట్ తో మాట్లాడడం. ఒక మానసిక వైద్యుడి తో మాట్లాడడం వల్ల మీ ఒత్తిడికి గల మూల కారణం తెలిసి బాధను తగ్గించుకునే మార్గం దొరుకుతుంది.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

ప్రిస్క్రిప్షన్ అనుసరించండి: ఒత్తిడి మొదలవడాన్ని రసాయనికంగా తగ్గించుకునే విధానం వైద్యుడి సలహా ప్రకారం మందులు వేసుకోవడం. సూచించిన డోసేజ్ ప్రకారం మందులు వాడితే సాధారణ మానసిక స్థితికి చేరుకుంటారు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

జంతువులను పెంచడం: పెంపుడు జంతువులు యజమానులతో బాగా సన్నిహితంగా వుంటాయి. ఒంటరిగా వుండే వాళ్ళతో పోలిస్తే పెంపుడు జంతువులు వున్నవాళ్ళు ఒత్తిడిని బాగా అధిగమిస్తారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మీ పెంపుడు జంతువుతో భావోద్వేగ అనుబంధం కలిగితే మీకు ప్రతికూల ఆలోచనలు రావు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

వర్తమానంలో జీవించండి: గతంలో జరిగిన పొరపాట్ల గురించో లేక ఇతమిద్ధంగా తెలియని భవిష్యత్తు గురించో విచారించడం వృధా. మన అధీనంలో లేని పరిస్థితి మీద మన భావోద్వేగాలు ఉంచినా ఉపయోగం లేదు. ‘ఎప్పుడు', ‘ఎక్కడ' లేక ‘రేపు' అనే వాటికి బదులుగా ‘ఇప్పుడు', ‘ఇక్కడ' లేక ‘ఈరోజు' అని ఆలోచించండి.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

అందరూ మిమ్మల్ని అర్ధంచేసుకు౦టారని ఆశించకండి: చాలా మంది ఇతరులను సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ జీవిస్తారు, విఫలమైతే ఒత్తిడిలోకి వెళ్లి పోతారు. అందరినీ సంతోష పెట్టడం సాధ్యం కాదు. అందువల్ల మీరు ఇతరుల మీద కాక మీ తృప్తి మీద ధ్యాస వుంచండి.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

బాగా నిద్రపోండి : అనుకూల ఆలోచనలు తిరిగి మొదలు అవడానికి ప్రతివారికీ మంచినిద్ర అవసరం. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోయే వారిలో ఒత్తిడి సూచనలు తక్కువగా ఉంటాయని అధ్యయనాల వల్ల తెలుస్తుంది.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

లైంగిక సాన్నిహిత్యానికి దూరం కాకండి.: ఒత్తిడిలో వున్నప్పుడు శృంగారాన్ని ఆస్వాదించ లేక పోవచ్చు, కానీ శృంగారం ఒత్తిడిని దూరం చేసే గొప్ప సాధనం అని చాలా మంది తెలుసుకోరు. శృంగారం వల్ల జరిగే హార్మోన్ల విడుదల ఒత్తిడిని స్థిరీకరించి మానసిక ఆందోళనల నుంచి విముక్తిని కలిగిస్తుంది.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

మిమ్మల్ని మీరే నిందించుకోవద్దు : ఆత్మ విమర్శ మంచిదే కానీ, ఎక్కువ ఐతే చాలా ప్రమాదం. ప్రతి పరిస్థితికి మిమ్మల్ని మీరే ని౦ది౦చుకుంటే మీకు మరింత బాధ కలుగుతుంది. వాస్తవిక దృక్పధంతో ఉండండి : ఒత్తిడిలో వున్నవారు చాలామంది వాస్తవాలకు దూరంగా జీవిస్తారు, దాంతో చివరికి అసాధ్యమైన లక్ష్యాలు నిర్దేశించు కుంటారు. ఈ అంచనాలను సాధించలేనపుడు మాత్రం చివరికి వారినివారే దోషిగా భావించుకుంటారు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

సంగీతం విన౦డి : ఒత్తిడిలో ఉన్నపుడు, సంగీతం వినడం వల్ల ఒత్తిడి స్థితినుండి త్వరగా కోలుకోవచ్చు. మానసిక స్థితి మేరుగవడానికి, ఆత్మోద్ధారణకు, ఉద్వేగాలను రేకెత్తించే సామర్ధ్యం సంగీతానికే ఉంది. అయితే, మరీ భావోద్వేగ౦తో కూడిన పాటలను వినడం నివారించాలి, వాటివల్ల మనసుపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

స్వయం-సహాయక పుస్తకాలు చదవండి : ప్రఖ్యాత రచయితలు సానుకూలంగా ఆలోచించడం ఎలా అని తెలుసుకోవడానికి పుస్తకాలు రాసారు. వారి పుస్తకాలు ఒత్తిడిని ఎలా దూరంచేసుకోవాలో తెలియ చేసే సరళమైన చిట్కాలు కలిగి వుంటాయి. అటువంటి పుస్తకాలు చదవడం వలన నిరాశవల్ల వచ్చే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రేరణను ఇస్తుంది.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

అనుకూలంగా ఉండండి :జీవితంలో ఒత్తిడి ఆలోచనలను పారద్రోలడానికి అనుకూలమైన దృక్పధాన్ని కలిగిఉ౦డడమే సరైన మార్గం. మనసులో ప్రతికూల ఆలోచనలు ఉంటె, ఆ ఆలోచనలని అనుకూల విధానంలో మార్చుకోవడం వల్ల మీపై ఉన్న ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

విటమిన్ సప్లిమెంట్లు : పోషకాహార లోపాలవల్ల కూడా ఒత్తిడి మనస్తత్వ౦ కలగవచ్చు. డాక్టరుని సంప్రదించి మీ లక్షణాలను తెలియచేయండి, సరైన సమతుల విధానంలో విటమిన్ ప్రత్యామ్నాయాలను తీసుకోండి.

English summary

How to deal with depression | ఒత్తిడి(డిప్రెషన్)దూరం చేసే 25 టిప్స్..!

People generally suffer from depression because they do not understand the events in their lives and tend to push themselves a little too much. Lack of self-awareness with respect to demanding situations can put one in a depressed state of mind.
Desktop Bottom Promotion