For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదంతో బరువు తగ్గడం చాలా తేలిక

By Super
|

ఆయుర్వేద చికిత్స వల్ల శరీరంలోపల నిల్వవున్న టాక్సిన్స్ (మలినాలను ,విషాలను)తొలగించేందుకు సహాయపడుతుంది. ఆయుర్వేదంలో బరువు తగ్గించడం కోసం చేసే ఈ ప్రాథమిక అంశాన్ని ‘అమా' అంటారు. మన శరీరంలో ఏర్పడే టాక్సిన్స్ కు ప్రధాన కారణం అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, మరియు తీవ్రమైన ఒత్తిడి, హెక్టిక్ లైఫ్ స్టైల్. నీటిలో కరిగే టాక్సిన్స్ మూత్రం, మలం మరియు చెమట రూపంలో సులభంగా బయటకు నెట్టివేయబడుతాయి. కానీ నీటిలో కరిగేవికాకుండా, ఇతర టాక్సిన్స్ అలా నెట్టివేయక శరీరంలోనే నిల్వఉండి, ఉబకాయానికి దారితీస్తాయి. అయితే, అటువంటి టాక్సిన్స్ ను సరైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా సమర్థవంతంగా తొలగించుకోవచ్చు. అయితే, ఫ్యాట్ సోలబుల్ టాక్సిన్ ఉత్పత్తి అయితే మాత్రం అంత సులభంగా వీటిని తొలగించలేము. ఈ మాలిన్యాలు ప్రధానంగా కడుపు, హిప్ మరియు తొడ ప్రాంతంలో లక్ష్యంగా కొవ్వును ఏర్పరుస్తుంది.

ఆయుర్వేద పద్దతులల్లో ‘అమా' శరీరం నుండి విషాలను బయటకు తీయడమే ప్రధాన లక్ష్యం. ఇది కొవ్వు కణాలను సమర్థవంతంగా కృంగిపోయే విధంగా చేస్తాయి. మీరు పాత పద్దతుల్లోకి మారితే కొవ్వును తొలగించడం మరింత ఎక్కువఅవుతుంది. ఈ పద్ధతిని రెగ్యులర్ చేయడం వల్ల శరీరం నుండి విషాన్ని మరియు మాలిన్యాలు తొలగించడం ఆదర్శవంతంగా నిర్విషీకరణ చేస్తుంది . ఇది భవిష్యత్తులో దీర్ఘకాలిక బరువు పెరుగే అవకాశాన్ని నిరోధిస్తుంది.

ఇది ఒక సాధారణమైన స్టేట్మెంట్ అని అర్థం చేసుకోవచ్చు , కానీ బరువు సమస్యలతో పోరాడటం కోసం ఆయుర్వేద పధ్ధతులు బాగా సహాయపడి ఆరోగ్యకరమైన జీవనశైలి మొదలుపెట్టువచ్చు. అంటే మీరు ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, మరియు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ఎందుకంటే మన శరీరం కూడా ఒక గడియారంలా పనిచేస్తుంది. ఈ టైమ్ లో ఇదేచేయాలి, అని నిర్ధేశించుకుంటుంది. ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మీ ఆహారపు అలవాట్ల ద్వారా తెలుస్తుంది.

ఆయుర్వేదంలో , కాలానుగుణ లభించే పండ్లు మరియు కూరగాయలు తీసుకోమని ఊబకాయగ్రస్తులకు నిపుణులు సలహా ఇస్తుంటారు . అధిక ప్రోటీనులుండే నేచురల్ ఫుడ్స్ మరియు పండ్లు ద్వారా ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఆయుర్వేదంలో బరువు తగ్గించే పద్దతులను పాటిస్తున్నట్లైతే ప్రిజర్వేటివ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు తప్పనిసరిగా నివారించాలి.

అదనపు కొవ్వును త్వరగా మరియు ఎఫెక్టివ్ గా కరిగించుకోవడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద స్పూర్తితో ఇచ్చిన చిట్కాలు ఉన్నాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

మీ దిన చర్యను తేనె మరియు నిమ్మరసం కలిపి గోరువెచ్చని ఒక గ్లాసు నీటితో ప్రారంభించండి . ఇది ఒక ఉత్తమ డిటాక్సిఫైయర్ మరియు ఇది మీ శరీరంలో నిల్వ ఉన్న టాక్సిన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా బయటకు పంపడానికి సహయపడుతుంది.

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

ప్రతిరోజూ తాజా ఆహారాలను పచ్చికూరలు మరియు ఉడికించిన వాటిని తినాలి. ఎక్కువ మోతాదులో భోజనం చేయడం కంటే ప్రతి సారి తక్కువ మోతాదులో తినడానికి ప్రయత్నించండి. మీరు రోజులో మూడు లార్జ్ మీల్స్ తినడానికి బదులుగా మూడిసార్లు తినడానికి బదులు ఆరుసార్లుగి కొద్దికొద్దిగా తినడానికి ప్రయత్నిస్తే సమర్థవంతమైన ఫలితం లభిస్తుంది. మరింత ఉత్తమ ఫలితాలకోసం మీరు తీసుకొనే ప్రతి మీల్ లోనూ తాజా వెజిటేబుల్స్, మరియు తాజా పండ్లను జోడించండి .

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

మీ జీవితం ఎంత ఒత్తిడితో ఉన్నా, ప్రతి రోజూ కనీసం 8గంటల పాటు నిద్రించడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి.

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్ మానుకోండి , మరియు వీటికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ కంటెంట్ లో ఎక్కువగా ఉన్నతృణధాన్యాలు మరియు కాయధాన్యాలు , పప్పులను ఎంపిక చేసుకోండి .

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

ఆయుర్వేదంలో తాజా పసుపు , అల్లం , వెల్లుల్లి , జీలకర్ర మరియు నల్ల మిరియాలు వంటి మూలికలు మీద ఆధారపడి ఉన్నది. ఈ సుగంధ ద్రవ్యాలు చెడు కొలెస్ట్రాల్ సమర్ధవంతంగా ట్రిగ్గర్ చేస్తుంది మరియు శరీరం యొక్క జీవక్రియ శక్తి మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

మీరు నిజంగానే, హృదయపూర్వకంగా కొవ్వు తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తుంటే , ఒక్క డైట్ మీద మాత్రమే ఆధారపడకండి . డైట్ తో సహా, తగినంత వ్యాయామంను కూడా జోడించండి. శరీరం యొక్క బరువును చాలా త్వరగా మరియు సురక్షితం తగ్గించుకోవడానికి యోగా ఒక శక్తివంతమైన పద్ధతి .

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

బరువు తగ్గించే బెస్ట్ ఆయుర్వేద చిట్కాలు

మోడరేషన్ జీవితాన్ని గడుపుతున్నట్లైతే, జీవితంలో ఏదైనాకానీ పరిమితిని మించి చేయకూడదు. ఇది ఆయుర్వేదంలో ప్రధాన మంత్రం. మీలో మద్యం అలవాటు అమితంగా ఉంటే, దాన్ని మీరు వదిలిపెట్టక్కర్లేదు, కానీ మీరు చేయవల్సిదంల్లా మీరు తాగడానికి ఒక పరిమితి ఉండాలని నిర్ధారించుకోండి. పరిమితి అన్న విషయంలో జీవితంలో అన్ని విషయాల్లోనూ వర్థిస్తుంది. ఇదిఒక్కటి గుర్తుంచుకుంటే చాలు, జీవితం ఆరోగ్యంగా సంతోషంగా గడిచిపోతుంది.

English summary

How Does Ayurveda Help In Weight Loss?

The Ayurvedic treatment for obesity begins with triggering the toxins inside the body. This concept is known as ‘ama’ that sets the basics for losing weight. The toxins in our bodies are accumulation of various impurities taking birth from chaotic dietary habits, environmental pollution, and chronic stress due to hectic lifestyles.
Desktop Bottom Promotion