For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి దుర్వాసనకు కారణాలు..దుర్వాసనను నివారించడం ఎలా?

|

నోటి దుర్వాసన సర్వ సాధారణం గా అందరూ ఎదుర్కొనే సమస్య. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? మన ఆహారపు అలవాట్లు అందుకు కారణమా, మరింకేదైనా సమస్య కావచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో...

1. మన నోటి లోని పలు భాక్టీరియా విడుదల చేసే వాయువులు దంతాలు, చిగుళ్ళూ, నాలుక పై ఒక పూతగా ఏర్పడి నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.

2. సాధారణంగా పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్ధాలు వల్ల నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది.అలాగే కట్టుడు పళ్ళూ ఉంటే వాటిని సరైన రీతిలో శుభ్రపరచకపోయినా ఈ దుర్వాసన సమస్య వస్తుంది. పళ్ళూ తోముకుంటె నోటి దుర్వాసన పోతుందనుకుంటే పొరపాటు. పళ్ళూ శుభ్రంగా తోముకున్న కేవలం 60శాతం అదీ కూడా దంతాలపై భాగం మాత్రమే శుభ్రపడుతుంది.

3. ఇక పొగ తాగే వారిలో నోటి దుర్వాసన సమస్య అధికంగా ఉంటుంది.

4. తరచూ నోటి తో గాలి పీల్చే వారిలో నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి, ఉల్లి వంటి ఘాటైన పదార్ధాలు, కాఫీ సేవనం కూడా నోటినుంచి చెడు వాసనను వచ్చేలా చేస్తాయి.

5. ఏదైనా చిగుళ్ళ వ్యాధి లేదా దంత సమస్య వస్తొందన్న సూచనగా నోటినుంచి చెడు వాసన వచ్చే ప్రమాదం ఉంది.

6. సైనసైటిస్, బ్రాంకైటిస్, డయాబెటిస్ , కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో ఇంఫెక్షన్స్ వంటి ఆరోగ్య సమస్యలు కుడా నోటి నుంచి చెడు వాసనన వచ్చేలా చేయవచ్చు.

7. నోరు పొడిబారడం, వైద్య పరిభాష లో దీనినే క్సీరో స్టోమియా అంటారు. దినివల్ల నోటిలో లాలాజలం సరైనంత అందక అతిగా భాక్టీరియా చేరి నోటి దుర్వాసనకు కారణం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలోనూ, పలు మందులు వాడే వారికీ ఈ క్సీరోస్టోమియా సమస్య వచ్చే అవకాశం ఉంది.

Bad Breath

నోటి దుర్వాసనకు దూరంగా ఉండాలంటె ఏం చెయ్యాలి? అసలు ఈ సమస్య ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

నోటి దుర్వాసన సమస్య తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష చేసుకోవాలి. ముంజేతి మడమ కింది భాగాన్ని నాలుకతో తాకి ఆరాక ఒకసారి వాసన చూడండి.ఆ వాసన కంపుగా అనిపిస్తే మీరు నోటి దుర్వాసన బారినపడినట్లె!

దంతాల మధ్యలో అంటే పళ్ళ సందుల్లోకి వెళ్ళె బ్రష్ లను వాడడం లేదా డెంటల్ ఫ్లాస్ వాడడం వలన పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహారపదార్ధాలను శుభ్రం చేసుకోవడానికి వీలవుతుంది.

అలాగే నాలుక బద్దని వాడడం మరవద్దు. ఒకవేళ నోరు బాగా పొడిబారుతోంది అనిపిస్తే షుగర్ ఫ్రీ చూయింగ్ గం ను నములుతూ పొడి బారడాన్ని తగ్గిచుకునే ప్రయత్నం చేయాలి.

ఇలాంటి సాధారణ జాగ్రత్తలు తీసుకున్నాకా కూడా నొటి దుర్వాసన సమస్య వేధిస్తుంటే దంత వైద్యులని సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించండి.

English summary

How To Get Rid Of Bad Breath | నోటి దుర్వాసనకు కారణాలు..దుర్వాసనను నివారించడం ఎలా?


 Do you worry about your breath? Well, here are ten reasons to do something about it and some tips to help you out.
Story first published: Tuesday, May 7, 2013, 12:08 [IST]
Desktop Bottom Promotion