For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే ఏం జరుగుతుంది..?

|

శరీరంలో ని ముఖ్యమైన వ్యవస్థ ల లో ఒకటి రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణకి కలిగే అంతరాయం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్స్ వంటివి రక్త ప్రసరణ కి కలిగే అంతర్యం వల్ల కలిగే కొన్ని ప్రమాదకరమైన జబ్బులు. తలనొప్పి, చేతులు మరియు కళ్ళు సడన్ గా చల్లబడడం, నీరసం, చెవులలో రొద, త్వరితంగా మాయమవని గాయాలు, జ్ఞాపక శక్తి సన్నగిల్లుట, గట్టి కండరాలు, తిమ్మిరి పట్టుట వంటి చిన్న చిన్న రోగ లక్షణాలు బయటపడినప్పుడే నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యున్ని సంప్రదించాలి. ఈ లక్షణాలను కనుక అశ్రద్ద చేస్తే హైపర్టెన్షన్ , స్ట్రోక్, మూత్రపిండాల లోపం, మధుమేహం, నపుంసకత్వం, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించే అవకాశం కలదు.

ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆపాదించుకోవడం ద్వారా రక్త ప్రసరణను సవ్యంగా ఉంచుకోవచ్చు. తక్కువ కొవ్వు పదార్ధాలు, తక్కువ కొలెస్ట్రాల్ తీసుకోవడం, పీచు పదార్హాలు అధికంగా కలిగిన ఆహార పదార్ధాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, ఒత్తిడి తగ్గించుకోవడం మరియు రక్త ప్రసరణ ని మెరుగుపరిచే సహజసిద్దమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యని నిర్మూలించవచ్చు.

రక్త ప్రసరణ మెరుగుపర్చుకునేందుకు చిట్కాలు:

 శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

వేడి మరియు చలువ చికిత్సలు : వేడి మరియు చల్లటి స్నానాలు లేదా హైడ్రో థెరపీ అనే జల చికిత్స రక్త ప్రసరణ ని మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుంది. ప్రభావిత ప్రాంతాన్ని వేడి నీటి షవర్ కింద ఉంచితే రక్త ప్రసరణ ఆ ప్రాంతానికి జరుగుతుంది. ఒక తక్షణ చల్లని షవర్ అంతర్గత అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతోంది అనడానికి సంకేతం శరీరం లో ని వణుకు. మెరుగైన ఫలితాల కోసం ఈ వేడి మరియు చల్ల నీటి చికిత్స ని తరచూ తీసుకోవాలి. నీళ్ళు అతి వేడిగా ఉంటే చర్మం కాలే ప్రమాదం ఉంది.

 శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

కయెన్ : గుండెని ఉత్తేజపరచడానికి, రక్త ప్రసరణ ని నియంత్రించడానికి అలాగే రక్త కేశనాళికలను ఇంకా ధమనులను బలపరిచేందుకు కయెన్ అనే ములిక ఎంతగానో ఉపయోగపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణ కోసమే కాకుండా దృఢమైన గుండెకి ఇంకా స్పష్టమైన ధమనులతో పాటు బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. కయెన్ టింక్చర్ని తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి లో ని జీవక్రియ దాదాపు 25 శాతం పెరుగుతుంది.

 శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

శ్వాస క్రియ: శ్వాస ని పీల్చడం లో చాలా మంది ఉపిరితిత్తుల సామర్ధ్యాన్ని ని పూర్తిగా ఉపయోగించుకోరు. మెరుగైన రక్త ప్రసరణ కోసం లోతైన శ్వాస ప్రక్రియను పద్దతులను పాటించాలి. తద్వారా ఉపిరితిత్తుల సామర్ధ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ రక్త ప్రసరణ మెరుగుపరచుకొవచ్చు. ఈ పద్దతి ద్వారా రక్తం లో కి ఎక్కువ మొత్తం లో ఆక్సిజన్ చేరుతుంది. వ్యర్ధ పదార్ధాలు బయటికి వెళ్ళిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

 శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

ఒత్తిడి ని తగ్గించుకోవాలి : రక్త ప్రసరణ లో సమస్యలకి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి కి గురైన వ్యక్తి లో రక్త ప్రసరణ కొన్ని ప్రధాన అవయవాల వద్దే నిలిచిపోతుంది. మిగతా భాగాలకు చేరదు. చేతులు మరియు కాళ్ళకి రక్త ప్రసరణ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల రక్త ప్రసరణ సజావుగా జరగాలంటే ఒత్తిడిని అధిగమించాలి. లోతైన శ్వాస ప్రక్రియల ను పాటించడం మరియు ప్రతి రోజు ధ్యానం చెయ్యడం వంటి ద్వారా రక్త ప్రసరణ లో ఉన్న సమస్యలని అధిగమించవచ్చు.

 శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

కాళ్ళు : రక్త ప్రసరణ ని మెరుగుపరచుకునే మరొక విధానం కాళ్ళని కొద్ది సేపు పైకి ఎత్తి ఉంచడం. పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఒక దిండు పెట్టుకోవడం లాంటివి చెయ్యాలి. ఈ విధం గా చెయ్యడం వాళ్ళ కాళ్ళకి రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. నేలపై పడుకుని మీ కాళ్ళని కుర్చీ లేదా సోఫా వంటి వాటిపై ఉంచటం కూడా ఉపయోగపడుతుంది. ఈ పద్దతి ద్వారా కళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.

 శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

వ్యాయామం : వ్యాయామం చెయ్యడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో ఎంతో మంది ఉద్యోగాలలో రోజులో ఎక్కువ శాతం కదలకుండా ఒక చోటే ఉండే విధంగా ఉన్నాయి. తద్వారా శారీరక శ్రమని వారు కోల్పోతున్నారు. నిరంతర వ్యాయామం, నడక, ఈత మరియు పరుగు వంటివి శరీరం మొత్తానికి రక్త ప్రసరణ ని అందించే వ్యాయామాలు. నడకలో భాగం గా స్థిరమైన నడకతో ప్రారంభించి ఆ తరువాత నడక యొక్క సమయం మరియు వేగం పెంచుతూ ఉండాలి.

 శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

సరైన ఆహారం : రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం లో తక్కువ మోతాదులో కొవ్వు శరీరం లో కి వెళుతుంది. తక్కువ కొవ్వు రక్తానికి ప్రమాదం తక్కువ. తద్వారా రక్తం చిన్న నాళముల లో కి కూడా సులభం గా ప్రవేశిస్తుంది. శరీరం లో ఉన్న కొవ్వుని బయటికి పంపడానికి ఆహారం లో పీచు పదార్ధాలని తగినంత తీసుకోవాలి.

ఇవన్నీ పాటించడం ద్వారా రక్త ప్రసరణ ని మెరుగుపరచుకోవచ్చు.

English summary

How To Improve Blood Circulation | శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచుకోవడం ఎలా?

The circulatory system is one of the most important organ systems. Disruption of blood circulation can cause various diseases. Various emerging disease caused by circulatory disorders, such as heart disease, stroke, etc.
Story first published: Wednesday, May 1, 2013, 11:31 [IST]
Desktop Bottom Promotion