For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పునరావృత గాయాన్ని నివారించడం ఎలా?

|

పునరావృత చలన గాయం (రిపీటేటీవ్ మోషన్ ఇంజురీ - ఆర్.ఎం.ఐ) లేదా పునరావృత ప్రయాస గాయం, పునరావృత కదలికలు మరియు పనులు వలన ఎముకలు, కండరాలు, నరాలకు కలిగే గాయం. దాన్ని ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించండి:

1. ఆర్.ఎం.ఐ ని కలిగించే అవకాశాలు పెంచే కారకాలను గమనించండి. కారణాలు:

పునరావృత కదలిక: కండరాలు పదే పదే అదే కదలిక చేయడం వల్ల అలిసి పోతాయి. బిగుతు మరియు అతిగా వాడబడే కండరాలకు పునరావృత కదలికలు తోడయితే గాయపడ్డానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

How to Prevent Repetitive Motion Injury

తప్పు భంగిమ: కూర్చొని లేదా నిల్చుని ఉన్నప్పుడు తప్పు భంగిమ, కండరాలు మరియు నరాల మీద అనవసరమైన ఒత్తిడి మరియు శ్రమ కలగజేస్తుంది..

అధిక బల ప్రయోగం: లాగేటప్పుడు, తోసేటప్పుడు, ఎత్తేటప్పుడు చేసే అతిశ్రమ కండరాలు, ఎముకలు, నాడులు మరియు నరాల మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ అదనపు ఒత్తిడి అసౌకర్యం, నొప్పి మరియు గాయానికి కారణమవుతుంది.

పౌనఃపున్యం: పునరావృత కదలికలు చాలా కాలం పాటు కొనసాగిస్తే అది కండరాలను బిగుతుగా, అలసటతో, అరుగుతరుగుల కారణంగా గాయానికి లోనయ్యేలా చేస్తుంది.

2. ఆర్.ఎం.ఐ క్రింది కారణాల వల్ల కావచ్చు:

అవయవాల లేదా కీళ్ళ పునరావృత చలనం.

దీర్ఘకాల చేతి ఉపయోగం.

ఒక పని చేసేటప్పుడు తప్పు మణికట్టు స్థానం (ఉదాహరణకు, ఒక కంప్యూటర్ మౌస్ పట్టుకునేటప్పుడు).

కీళ్ల నొప్పులు మరియు మధుమేహం వంటి కొన్ని వైద్య పరిస్థితులు.

3. ఆర్.ఎం.ఐ యొక్క లక్షణాలు గుర్తించడం తెలుసుకోండి. ఈ క్రింది విధాలలో అది వ్యక్తం అవుతుంది:

కీళ్ళ చుట్టూ ప్రాంతాల్లో (అంటే మణికట్టు, చేతులు, వేళ్లు) నొప్పి లేదా బిరుసుతనం. ఈ నొప్పి, సాధారణంగా పని చేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది.

ప్రభావిత ప్రాంతంలో వాపు.

జలదరింపు లేదా తిమ్మిరి.

శక్తి మరియు సమన్వయం కోల్పోవడం. (సాధారణంగా చేతికి జరుగుతుంది)

4. ఆర్.ఎం.ఐ నివారించడం ఎలా? క్రింది సూచనలు ఆచరించండి:

దీర్ఘ సమయం పునరావృత చలనం చేస్తుంటే మధ్య మధ్యలో వ్యాయామం చేయాలి లేదా కీళ్లను చాచాలి.

విరామం తీసుకోండి! ఆర్.ఎం.ఐ నివారించడానికి ఇదే అతి ముఖ్యమైన మార్గం కావచ్చు. మీ ప్రబలమైన చేతికి వీలైనప్పుడల్లా విశ్రాంతిని ఇవ్వండి. జాక్-హేమర్ వంటి కంపించే పనిముట్లు ఉపయోగిస్తున్నప్పుడు అదనపు జాగ్రత్త వహించండి.

పనిచేసేటప్పుడు సరైన భంగిమలో ఉండండి. మీ పని ప్రాంతానికి సర్దుబాట్లు చేయండి మరియు కార్య సిధ్ధాంత శాస్త్ర ఆధారంగా రూపొందించిన పనిముట్లు మరియు ఉపకరణాలు ఉపయోగించండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. పునరావృత కదలికల వల్ల జరిగే గాయం అవకాశాలు తగ్గించడానికి మీ అస్థి పంజర కండర వ్యవస్థ బలోపేతం చేయండి.

English summary

How to Prevent Repetitive Motion Injury | పునరావృత గాయాన్ని నివారించడం ఎలా?

Repetitive Motion Injury or Repetitive Strain Injury is an injury to the bones, muscles, or nerves caused by repetitive motions and tasks. Prevent it by doing the following.
Story first published: Tuesday, February 26, 2013, 15:09 [IST]
Desktop Bottom Promotion