For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి శాఖాహారం లేదా మాంసాహారం ఏది ఉత్తమం ?

|

ఈ ఆధునిక యుగంలో మానవుడు తన ఆరోగ్యం కోసం పడని పాట్లంటూ లేవు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. నిజమేకదా ! ఆరోగ్యంగావుంటే ఆయుషు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఆహారంలో శాఖాహారం ఉత్తమం అంటున్నారు వైద్యులు. శాఖాహారం తీసుకుంటే అధిక రక్తపోటునుండి కూడా మనిషి తనుతాను కాపాడుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. ఈ భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోబాటు పోషకపదార్థాలుండాలి. ఇవన్నీ కలిసున్న భోజనమే అమృతంతో సమానం. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదైవుండాలి.

సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయట పడగలుగుతామని పరిశోధకులు తెలిపారు. మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును గమనించామని అదే శాఖాహారం తీసుకున్నవారిలో అమినో ఆమ్లము అధికంగా వుందని లండన్‌లో జరిపిన పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అమినో ఆమ్లం రక్తపోటును నివారిస్తుంది. కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుందని ఇది రక్త పోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇంతేకాకుండా మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా వుంటుందని తేలింది.

How to successfully become a Vegetarian

చాలా మంది మాంసాహారులు వారి ఆహారపు అలవాట్లను మార్చుకుని వేగన్ లేదా శాఖాహారానికి మారుతున్నారు.మీరు కూడా అలాంటి మార్పు కోసం చూస్తూ ఎక్కడ ప్రారంభించాలో తెలియని స్థితిలో ఉంటే, ఈ వ్యాసం ఆ మార్పు అమలు చెయ్యటానికి కొన్ని చిట్కాలను అందిస్తుంది.

1. మానసిక ఆమోదం

మీరు మాంసాహారిగా పెరిగినట్లయితే కొత్త ఆహారం అలవాటు చేసుకోవటం అంత తేలిక కాదు. చాలా సర్దుబాట్లు అవసరం అవుతాయి, మీరు దాని కోసం మానసికంగా సిద్ధమవ్వాలి. ప్రస్తుతం మీ అభిరుచులు మాంసం రుచులకు సరిపోతాయి కాని, శాఖాహారానికి కాదు. కాబట్టి ఈ మార్పుకి కారణం వాస్తవికంగా ఉండాలి. ఆ కారణం మీ మనస్సులోని బలమైన స్థానం నుండి రావటం ముఖ్యం. ఇది మీ కొత్త జీవన విధానానికి కావలసిన క్రమశిక్షణ ఇస్తుంది.

2.జీవనశైలిలో మార్పుల జాబితా తయారు చేసుకోండి

శాఖాహారం వల్ల మీ జీవితం లో చాలా మార్పులు చెయ్యాల్సి వస్తుంది. ఈ నిర్ణయం మీకు ఎంత వ్యక్తిగతము అన్న దాని మీద ఆధారపడి చేయాల్సిన మార్పులు ఉంటాయి. మీరు శాఖాహారం భోజనశాలలు, సూపర్ మార్కెట్లు లేదా దుకాణాల జాబితా తయారు చేయవలసి ఉంటుంది. మీ కొనుగోళ్ళలో ఇతర ఆహార ఉత్పత్తుల మూలాలు మొదలైనవి గురించి మరింత జాగరూకతతో ఉండాలి.

3. కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకి తెలుపండి

మీ సాంఘిక పరిధిలోని వ్యక్తులకు మీ ఆహార ప్రాధాన్యతలను గురించి తెలుపడం అవసరం. దీని వల్ల, మీరు కలిసి భోజనం చేసేటప్పుడు, రాజీ పడకుండా శాఖాహారం తీసుకోవాలి అనే మీ నిర్ణయానికి కట్టుబడి ఉండగలరు. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకి చాలా ప్రశ్నలు ఉండవచ్చు, కనుక, నిజాలు మరియు దృఢవిశ్వాసం ఆధారంగా సమాధానాలతో సిద్ధపడి వెళ్ళండి.

4. మీ పోషక విలువలను సరిగ్గా భర్తీ చేయండి
ప్రస్తుత మాంసాహార భోజనం మీ శరీరానికి ఒక నిర్దిష్ట మొత్తం పోషణను సరఫరా చేసే ఉత్పత్తుల జాబితాను కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆహార అవసరాల సరఫరా సరిపడేలా లేదా మించేలా శాఖాహారం తీసుకోవటం వల్ల, ఆకస్మికంగా బరువు కోల్పోవడం గానీ, రోగనిరోధక శక్తి మీద దుష్ప్రభావం గానీ ఉండకుండా జాగ్రత్త పడవచ్చు.

5. శాఖాహార వంటల పుస్తకము కొనండి
మీరు శాఖాహారం వంటల్లో ఎంత ప్రయోగం మరియు రుచుల వ్యత్యాసం సాధ్యమో తెలుసుకుంటే ఆశ్చర్యానికి లోనవుతారు. మీరే ఒక వంటల పుస్తకం కొని ,కొన్ని వంటకాలు ప్రయత్నించండి. ఇది మీరు తినబోయే కొత్త ఆహార పదార్ధాలకు మిమ్మల్ని సులభంగా అలవాటు చేస్తుంది. మీరు కేవలం కొన్ని శాఖాహార వంటకాలే చేయగలిగితే, తొందరగా విసుగు చెంది, తిరిగి మాంసాహారం వైపు మరలే ప్రమాదం ఉంది.

6. మార్పు నిదానంగా తీసుకురండి

ఆకస్మికంగా మాంసం, కోడి, చేపలు తినడం మానేయకండి. ధూమపానం లేదా మద్యం మానేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి మీద ఉండే వ్యతిరేక ప్రభావం వంటిదే ఇక్కడ కూడా ఎదురవుతుంది. మెల్లగా, అయితే, ఖచ్చితంగా, మీ ఆహారం లో మాంసాహార పరిమాణాన్ని తగ్గించి, శాకాహారానికి మారండి. కాలక్రమంలో ఈ విధంగా మార్పు చేయడం సులభంగా ఉందని మీరు కనుగొంటారు.

7. మాంసం ప్రత్యామ్నాయాలు కోసం వెతకండి

మాంసానికి చక్కని ప్రత్యామ్నాయాలుగా అనేక ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. వాటి రుచి మాంసం మరియు కోడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల, ఆహారంలో మార్పు సులభతరం అవుతుంది. సోయా చిక్కుడు, అలాంటి ఆహార రకానికి ఒక ఉదాహరణ.

8. పరిమాణం మీద దృష్టి పెట్టండి

మీరు తినే మాంసాహార పరిమాణానికి సరితూగాలంటే శాఖాహారం కొంత ఎక్కువ పరిమాణం లో తీసుకోవాల్సి ఉంటుంది. మీ శరీరానికి ఇది వరకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరం అయ్యేవో, ఇప్పుడు కూడా అన్నే కేలరీలు అవసరం. మీరు 1200 కేలరీలు లేదా అంత కన్నా ఎక్కువ కేలరీలు పొందడం అవసరం.

శాఖాహారానికి మారటం ఆరోగ్యకరమైన నిర్ణయం కానీ కట్టుబడి ఉండటానికి క్రమశిక్షణ మరియు స్వీయ నియంత్రణ చాలా అవసరం. ఈ చిట్కాలు పాటిస్తే , మీరు కొత్త ఆహార విధానంతో ఖచ్చితంగా విజయం అందుకుంటారు.

English summary

How to successfully become a Vegetarian | ఆరోగ్యకరంగా..ఖాహారిగా మారటం ఎలా..?

Many non-vegetarians are changing their eating habits and switching to vegan or vegetarian diets.
Desktop Bottom Promotion