For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ పద్దతులతోనే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

|

ఈ నవీన యు గంలో చాలా మందిని వేధి స్తున్న సమ స్య గ్యాస్ట్రిక్‌ అల్సర్‌. దీ నికి కారణం మారిన జీ వన శైలి విధానమే అని చెప్పవచ్చు. వేళకు తీసుకోని ఆహారం, తీసుకున్నా హడా వుడిగా క్షణాల్లో ముగించటం, చీటికి మా టికి చిరాకు, కారణం లేకుండానే కోపం.... వీటితో పాటు నిత్యం ఎదుర్కునే మానసిక ఒత్తిడి తోడుకావ టంతో 'గ్యాస్ట్రిక్‌ అల్సర్‌' సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. కడుపు పై బాగంలో వచ్చేటటువంటి అలర్స్ గా భావిస్తారు. అల్సర్ అనేది కడుపులో యాసిడ్ పుడ్స్ జీర్ణం అవ్వడం కానీ లేదా చిన్న పేగు యొక్క గోడలు పాడవుతాయి. ఒక్కోసారి ఒత్తిడి, డయట్ మరియు జీవనశైలిలో మార్పులు ఇవన్ని కూడా అల్సర్ కు కారణం అవుతాయి. పస్తుత సైంటిస్ట్ ల పరిశోధనల ప్రకారం అల్సర్ కు హిలికోబ్యాక్టర్ పైలోరి, లేదా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా కారణం కావచ్చు అని కనుగొన్నారు. వీటికి ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమే, చాలా వరకూ ఈ అల్సర్ అలాగే కొనసాగుతుంది.

లక్షణాలు: జీర్ణాశయంలో అల్సర్‌ ఏర్పడటం వల్ల కడుపులో నొప్పి, మంట రావటం తేనుపులు ఎక్కువగా ఉండటం, గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగ ఉండటం, కడుపులో గడబిడలతో పుల్లటి తేనుపులు రావడం, తిన్నది సరిగా జీర్ణం కాక పోవటం, వాంతులు కావటం వంటివి వుంటాయి. అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి, మంటతో నిద్రాభంగం కావడం ఏమీ తినకపోతే కడుపునొప్పి రావడం ఏదైనా తినగానే వాంతులు కావడం. భోజనం మొత్తం తినలేకపోవడం, అంటే... కాస్తంత తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపించడం. కొందరిలో రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి

జాగ్రత్తలు: ఫాస్ట్‌పుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, మసాలాలు, వేపుళ్ళు మానివేయాలి. ఆల్క హాల్‌ మానేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్లు తినటం చేయకూడదు. వేళకు ఆహారం తీసుకోవాలి. నీరు సరిపడేంతగా త్రాగాలి. మానసిక ఒత్తిడిని నివారించటానికి యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి. టీ, కాఫీలు మానేయాలి. ఇవే కాకుండా కొన్ని సహజ పద్దతులను పాటించి అల్సర్స్ మళ్లీ మళ్లీ రాకుండా కాపాడుకుందాం...

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

రెడ్ క్యాబేజ్: క్యాబేజ్ ను అలాగే తినడం కానీ లేదా జ్యూస్ చేసుకొని తాగడం కానీ చేయడం వల్ల అల్సర్ కు ఉపశమనం కలిగించవచ్చు.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

నిరంతర కడుపునొప్పి: కడుపులో నొప్పి, ఆబ్డోమినల్ పెయిన్, వంటివి ఉన్నాయోమని వైద్యపరిక్షలు చేయించుకోవడం వల్ల అల్సర్ ఉన్నది లేనిది తెలుస్తుంది. ఇది. అల్సర్ కు మొదటి లక్షణం, ఇతర లక్షణాలు జలుబు, వాంతులు, గ్యాస్, కడుపు ఉబ్బరంగా, బరువు తగ్గడం ఇవన్నీ కూడా అల్సర్ కు కారణం అవ్వచ్చు.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

డాక్టర్ సలహా: అల్సర్ కు ట్రీట్మెంట్ తీసుకొన్న తర్వాత కూడా అల్సర్ తగ్గనట్టైతే బౌల్ మూమెంట్లో బ్లడ్ ఉన్నా, లేదా వాంతి, లేదా మీ లక్షణాలు ఎక్కువగా ఉండి మాత్రలకు తగ్గనప్పుడు తిరిగి డాక్టర్ ను సంప్రదించాలి. దాంతో డాక్టర్ ఈ క్రింది టెస్ట్ నుల చేయించుకోమని సలహా ఇస్తారు.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

చికిత్సపద్దతులు అవలంబన: ఈ టెస్ట్ అన్ని జరిపించిన తర్వాత డాక్టర్ సూచనలు తప్పక పాటించాలి. చాలా వరకూ అల్సర్ కు గల కారణాలు తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలా కానీ పక్షంలో ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. యాస్పిరిన్ మరియు యాంటీఇన్ఫ్లమేటర్ డ్రగ్స్ కూడా అల్సర్ కు కారణం అవుతాయి. కాబట్టి అల్సర్ ఉన్నట్లు తెలిసిస్తే యాస్పిరిన్ తీసుకోకపోవడమే మంచిది. యాసిడ్ తగ్గించుకోవడానికి మీరు యాస్పిరిన్ తీసుకోవాలనుకుంటే డాక్టర్ ను సంప్రదించిన అడిగిన తర్వాత తీసుకోవడం మంచిది. అల్సర్ అధికంగా ఉండే భరించలేని సమయంలో సర్జరీ తప్పనిసరి అవుతుంది.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

ఫైబర్ ఫుడ్: ఫైబర్ అధికంగా ఉన్నటువంటి తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తరచూ మీ డైయట్ లో చేర్చుకోవడం వల్ల అల్సర్ బారీన పడకుండా మిమ్మల్మి కాపాడుకోవచ్చు.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

ఫ్లెవనాయిడ్స్: ఫెవనాయిడ్స్ అధికంగా ఉండేటటువంటి ఆహారంను, పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్స్, సెలరీ, క్రాన్ బెర్రీస్, వెల్లుల్లి, మరియు ఉల్లిపాయలు, వంటి వీటిలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. కాబట్టీ ఇటువంటి పండ్లను, లేదా కూరగాయాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

స్పైసీ ఫుడ్స్ కు దూరం: మీరు ప్రతి రోజూ తీసుకొనేటటువంటి ఆహారంలో కారం ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా వుండాలి. లేదంటే అల్సర్ నొప్పి విపరీతంగా మిమ్మల్ని బాధింవచ్చు.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

కాఫీ: కాఫీ, డీకాఫినేటెడ్ డ్రింక్స్ మరియు కార్బొనేటెడ్ బెవరేజస్ వంటి వాటిని పూర్తిగా నిషేధించాలి. ఇవన్నీ కూడా స్టొమక్ ఎసిడిటికి కారణం అవుతాయి దాంతో అల్సర్ కు దారితీస్తుంది.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

మద్యం: ఆల్కహాల్ తీసుకొనే వారైతే అల్సర్ ఉన్నప్పుడు ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడం మంచిది.

ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

యాంటీఆక్సిడెంట్స్: ఇన్ డైజషన్ లేదా ఛాతీలో మంట వంటి అల్సర్ లక్షణాలను నివారించడానకి యాంటాసిడ్స్ ఉన్న ఆహారాలను తిని కంట్రోల్ చేయవచ్చు.

English summary

How to Treat and Prevent Ulcers Naturally | ఇలా చేస్తే గ్యాస్టిక్ అల్సర్ మాయం...!

Gastric Ulcers are open sores or lesions in the lining of the stomach and are typically caused by inflammation from the bacteria Helicobacter pylori, according to the University of Maryland Medical Center, or UMMC.
Story first published: Thursday, February 28, 2013, 17:55 [IST]
Desktop Bottom Promotion