For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొమ్ము ఇంప్లాంట్లు వలన చెడు ప్రభావాలు

By Lakshmi Perumalla
|

రొమ్ము ఇంప్లాంట్ రొమ్ముల ఆకారం మరియు పరిమాణం మెరుగుపరచడానికి లేదా సరిచేయడానికి చేసే శస్త్రచికిత్స అని చెప్పవచ్చు. ఈ శస్త్రచికిత్సలో కృత్రిమమైన పదార్థం యొక్క పొరను రొమ్ము లోపల అమరుస్తారు. అసహజ పదార్థం యొక్క రకం ఆధారంగా రొమ్ము ఇంప్లాంట్లు రెండు వర్గాలుగా ఉన్నాయి. ఆ పొరలు సిలికాన్ లేదా సెలైన్ గా ఉండవచ్చు.

సిలికాన్ ఆధారిత రొమ్ము ఇంప్లాంట్ లో సిలికాన్ జెల్ అనే కృత్రిమ పదార్థంను ఉపయోగించి సిలికాన్ కవచాల్లో నింపుతారు. ఈ సిలికాన్ జెల్ తో నిండిన సిలికాన్ కవచాలను మహిళల్లో రొమ్ము ఇంప్లాంట్ కోసం ఉపయోగిస్తారు. సెలైన్ ఆధారిత రొమ్ము ఇంప్లాంట్ లో సెలైన్ వాటర్ అనే కృత్రిమ పదార్థంను ఉపయోగించి సిలికాన్ కవచాలను నింపుతారు. ఈ సెలైన్ వాటర్ తో నిండిన సిలికాన్ కవచాలను మహిళల్లో రొమ్ము ఇంప్లాంట్ కోసం ఉపయోగిస్తారు.

Ill effects of breast implants

మహిళలు వారి రొమ్ము లోపాలకు మరియు కాస్మెటిక్ కారణాలకు సరైన శస్త్రచికిత్సల కొరకు పైన చెప్పిన రకాలను ఎంపిక చేసుకోవచ్చు. సెలైన్ ఆధారిత రొమ్ము ఇంప్లాంటేషన్ సిలికాన్ ఆధారిత రొమ్ము ఇంప్లాంటేషన్ కంటే సురక్షితమైనదని భావిస్తారు. మహిళల్లో సెలైన్ ఆధారంగా రొమ్ము ఇంప్లాంట్ అనేది ప్రమాదాలను తగ్గిస్తాయి. కానీ ఇప్పటికీ నిలదొక్కుకోలేక ఇతర సమస్యలు వస్తున్నాయి. రొమ్ము ఇంప్లాంట్ అనేది రొమ్ము రుగ్మతలను మరియు భౌతిక లోపాల కోసం మహిళలకు సహాయపడుతుంది. అయితే రొమ్ము ఇంప్లాంట్లు వలన అనేక చెడు ప్రభావాలు ఉన్నాయి. రొమ్ము ఇంప్లాంట్లు వలన మహిళలు తరచుగా ఎదుర్కొనే దుష్ప్రభావాలు మరియు చెడు ప్రభావాలు క్రింద ఇవ్వబడ్డాయి: -

1. మహిళల్లో రొమ్ము ఇంప్లాంట్ వలన లీకేజ్ ప్రమాదం అనేది ప్రధాన చెడు ప్రభావంగా ఉన్నది. ఛాతీ మీద సిలికాన్ జెల్ లేదా సెలైన్ వాటర్ ఇంపాక్ట్ ఏది ఉంటే అది శరీరంలోకి కారుతుంది. సిలికాన్ జెల్ కారటం ప్రారంభమైతే మైకము,నరాల ద్రవ్యోల్బణం మరియు వికారంనకు కారణమవుతుంది. సెలైన్ వాటర్ కారటం ప్రారంభమైతే శరీరంలో బ్యాక్టీరియా మరియు అచ్చు ఏర్పాటుకు కారణమవుతుంది.

2. రొమ్ము ఇంప్లాంట్లకు కృత్రిమ మేటిరియల్ ఉపయోగిస్తారు. శరీరం వెలుపల దీనిని తిరస్కరించే ఒక ధోరణి ఉండవచ్చు. శరీరం ఇంప్లాంట్ ను అంగీకరించకపోవచ్చు. అంతేకాక వాపు మరియు మచ్చలు,ఛాతీ సమీపంలో నొప్పి ఉండవచ్చు.

3. మహిళల్లో రొమ్ము ఇంప్లాంట్ వలన రొమ్ము పరిమాణం అహేతుకంగా ఉండి చెడు ప్రభావం కలిగి ఉంటుంది.రొమ్ముల శస్త్రచికిత్సలో ఆకారం మరియు పరిమాణంలో తేడా ఉండవచ్చు. రొమ్ము ఇంప్లాంట్ తప్పుగా జరిగి సహజ రొమ్ము అందం దెబ్బతింటుంది.

4. ప్రతి రొమ్ము ఇంప్లాంట్ ప్రతి 7-8 సంవత్సరాల తరువాత భర్తీ లేదా మరమ్మత్తు అవసరం అవుతుంది. ఇంప్లాంట్ శాశ్వతం కాదు. దానిని కొంత కాలంనకు మార్చాలి. సమయం లేదా ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక చీలిక లేదా లీకేజ్ నష్టాలు వస్తాయి.

5. రొమ్ము ఇంప్లాంట్ చీలిక మహిళలకు రొమ్ము ఇంప్లాంట్ లో ప్రధాన చెడు ప్రభావంగా ఉంటుంది.షెల్ చీలిక శరీరంలో సిలికాన్ జెల్ లేదా సెలైన్ వాటర్ ను విడుదల చేస్తుంది. చీలిక నిశ్శబ్దంగా మరియు ఏ లక్షణాలు చూపించదు.

6. మహిళల్లో రొమ్ము ఇంప్లాంట్లు సమీపంలోని ధమనుల ద్రవ్యోల్బణంనకు కారణమవుతుంది. కృత్రిమ విధాన ప్రభావం వలన ధమనులు మరియు సిలికాన్ జెల్ వలన ద్రవ్యోల్బణం మరియు వాపుకు కారణం అవుతుంది.

7. మహిళలకు రొమ్ము ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేసిన ప్రాంత సమీపంలో మచ్చకు కారణం కావచ్చు. ఈ మచ్చలు జీవితం అంతా ఉంటాయి. వారి ఇంప్లాంట్ శస్త్రచికిత్స బహిర్గతం చేయకూడదని అనుకొనే స్త్రీలకు చెడు ప్రభావం ఉంటుంది.

8. రొమ్ము ఇంప్లాంట్లు స్వభావంలో నాడి కణ సంహారక విష పదార్థం కలిగి ఉంటాయి. సిలికాన్ జెల్ బయటికి రావటం వలన నాడీ వ్యవస్థ యొక్క కొన్ని భాగాల పనితీరుకు హాని కలిగించవచ్చు.

9. రొమ్ము ఇంప్లాంట్ లో సిలికాన్ జెల్ ఉపయోగించుట వలన కొన్ని భాగాలకు కాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రొమ్ము ఇంప్లాంట్లు అనేవి రొమ్ము క్యాన్సర్ కు కారణం కావు. కానీ కడుపు క్యాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ మరియు అనేక ఇతర చెడు క్యాన్సర్ లకు కారణం కావచ్చు. శరీరంలో సిలికాన్ లీక్ అవటం వలన శరీరానికి చాలా హాని జరుగుతుంది.

10. రొమ్ము ఇంప్లాంట్లు రొమ్ము పరిమాణం మరియు ఆకారంను పెంచుతుంది. కానీ ఇది మీరు పూర్తిగా ఇంప్లాంట్ చేయించుకున్నప్పుడు మాత్రమే స్పష్టమవుతుంది. ముఖ్యంగా సెలైన్ ఆధారిత ఇంప్లాంట్ లో నకిలీ ఛాతీ మరియు నిజం కాని ఛాతీని చూడవచ్చు.

Story first published: Saturday, December 21, 2013, 10:50 [IST]
Desktop Bottom Promotion