For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట ఉబ్బరం నొప్పి నుండి తక్షణ ఉపశమనం

By Lakshmi Perumalla
|

సాధారణంగా కడుపు ఉబ్బరం అనేది కడుపు నొప్పితో కూడి ఉంటుంది. అంతేకాక కడుపు నిండిన భావన ఉంటుంది. కడుపు ఉబ్బరం చికాకుపెట్టే పేగు వ్యాధికి కారణమవుతుంది. అక్కడ అన్ని ఆహారాలను అంగీకరించకపోతే జీర్ణ వ్యవస్థ యొక్క పని అపసవ్యంగా ఉంటుంది. ఉదరంలో వాయువుల మూలంగా కూడా కడుపు ఉబ్బరం రావచ్చు.

కడుపు ఉబ్బరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉంటుంది. ఈ నొప్పి చిరాకు మరియు కడుపు ఉబ్బరం నొప్పి కొన్ని సార్లు అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు కూడా వస్తుంది. పొట్ట ఉబ్బరం నొప్పి నివారించడానికి మందులు మరియు ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి. కడుపు ఉబ్బరం నొప్పి మరియు బాధ నుండి తక్షణ ఉపశమనం అందించడానికి కింది చర్యలను ప్రయత్నించండి.

నీరు త్రాగాలి

నీరు త్రాగాలి

సాధారణంగా మీ పొట్ట లోపల పని గందరగోళంగా ఉన్నప్పుడు ఉబ్బరం నొప్పి వస్తుంది. క్రమరహిత మలం, మలబద్ధకం మరియు వాయువుల ఏర్పాటు వంటివి నొప్పి గా పరిణమిస్తుంది. అందువలన మీ కడుపు ఉబ్బరంగా ఉందని భావించినప్పుడు నీరు చాలా ఎక్కువగా త్రాగాలి. ఇది నొప్పిని తగ్గించి ప్రశాంతంగా ఉండెటట్లు మరియు మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.

వాకింగ్ చేయాలి

వాకింగ్ చేయాలి

మీకు కడుపు ఉబ్బరంగా అన్పించినప్పుడు వాకింగ్ చేయాలి. శారీరక శ్రమ కడుపు లోపల నిల్వ ఉన్న వాయువులను విడుదల చేయటానికి సహాయపడుతుంది. ఈ ఉబ్బరం తగ్గించేందుకు ఒక సహజ మార్గం మరియు ఉబ్బరం నొప్పులకు ఒక తక్షణ ఉపశమనం ఉంటుంది. మీరు నడవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే భవిష్యత్తులో ఉబ్బరం సమస్యలను నివారించేందుకు ప్రతి రోజు భోజనం తర్వాత ఒక చిన్న నడకను అలవాటు చేసుకోవాలి.

ఏదైనా బుడగలు వచ్చే పానీయం త్రాగాలి

ఏదైనా బుడగలు వచ్చే పానీయం త్రాగాలి

సోడా లేదా రసాయనికంగా పిలిచే కార్బన్ డయాక్సైడ్ ఉబ్బరం లోపాలు తగ్గించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఏదైనా బుడగలు వచ్చే పానీయంను త్రాగటానికి ప్రయత్నం చేయాలి. కార్బన్ డయాక్సైడ్ పొట్టలో వాయువులతో చర్య జరిపి వాయువులను బయటకు విడుదల చేస్తుంది. కడుపు చాలా తేలికగా అనిపిస్తుంది. అంతేకాక నొప్పిని కూడా తగ్గిస్తుంది.

పుదీనా తినాలి

పుదీనా తినాలి

పుదీనా ఉబ్బరం తగ్గించడం మరియు కడుపు నొప్పి తగ్గటానికి ఉపయోగకరంగా ఉంటుంది.

కడుపు ఉబ్బరం కారణంను పరిక్షించినపుడు ఉబ్బరం బాధ ఏ సమయంలో నైన రావచ్చు. పుదీనాను టీ లేదా ఒక క్రషర్ రూపంలో తీసుకోవచ్చు.పుదీనాను ఒక బుడగలు వచ్చే పానీయంతో కలిపి తీసుకోవటం అనేది చాలా మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. పుదీనాతో పాటు ఉబ్బరం నొప్పులు తక్షణ ఉపశమనం కలిగించటానికి అల్లం,నల్ల ఉప్పు,నిమ్మరసం మొదలైనవి ఉన్నాయి. ఈ ఆహారాలను తీసుకోవటం వలన ఉబ్బరం నొప్పి తగ్గి మళ్ళీ కడుపును తేలికగా చేస్తుంది.

మందులు

మందులు

నొప్పి సహజ నివారణలు ప్రయత్నిస్తున్న తర్వాత కడుపు ఉబ్బరంనకు అందుబాటులో ఉండే మందులను ప్రయత్నించండి. తక్షణ ఉపశమనం అందించటానికి అనేక డైజెస్టివ్ మందులు ఉన్నాయి. అలాగే ఎనో (Eno) వంటి కొన్ని పౌడర్లు తక్షణమే గ్యాస్ తగ్గించేందుకు అందుబాటులో ఉన్నాయి.

ఉబ్బరం నొప్పి నివారించడానికి ఆహారం పొట్టలో విచ్ఛిన్నం చేయని విధంగా నెమ్మదిగా తిని సరిగా నమలాలి. అప్పుడు వాయువులు ఏర్పడడమును తగ్గిస్తుంది. ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం మీ డైజెస్టివ్ వ్యవస్థ సమస్యలను నివారించేందుకు సహాయపడుతుంది. అలాగే అనారోగ్యకరమైన ఆహారం తినకుండా ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

మీకు కడుపు ఉబ్బరంతో పాటు ఏమైనా రోగాలు ఉంటే కనుక వెంటనే ఒక వైద్యుడుని సంప్రదించండి. కొన్నిసార్లు కడుపు ఉబ్బరం నొప్పి ప్రారంభ దశలోనే గుర్తించడం కఠినమైతే అది అండాశయ క్యాన్సర్ కి కారణం కావచ్చు. ఏదైనా ఏమైనప్పటికీ ఆరోగ్య విషయాన్ని తేలికగా తీసుకోకూడదు.

English summary

Instant relief from bloating pain

Bloating stomach is nothing but a feeling of heavy stomach which is generally accompanied with abdominal pain.
Story first published: Monday, December 2, 2013, 20:25 [IST]
Desktop Bottom Promotion