For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ కాలం జీవించడానికి నవ్వు ఒక దివ్వ ఔషదం

By Mallikarjuna
|

ద'నవ్వడం ఒక భోగం-నవ్వించడం యొక యోగం. నవ్వకపోవడం ఒక రోగం'' అన్నారు జంధ్యాలగారు. ఉల్లాసపూరితమైన నవ్వు ఆరోగ్యంపై అద్భుతంగా ప్రభావం చూపుతుంది. మానసికంగా ఉల్లాసాన్ని కలిగించి బాధలను విచారాలను దూరం చేస్తుందని, వ్యాధుల నుండి నివారణ కలిగిస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. హాయిగా స్వేచ్ఛగా నవ్వడం ద్వారా రక్తపోటు, గుండెజబ్బులు, నరాల బలహీనతలాంటి శారీరక రుగ్మతలెన్నో నివారించబడతాయని, క్యాన్సర్‌ని సైతం జయించవచ్చని అంటున్నారు.

నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్‌ అని, దీనికి మించిన వ్యాయామం లేదు. శారీరకంగానూ, మాన సికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసం గా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధం. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు. నవ్వు శరీరంలోని కొటికోల్‌ అయాన్‌ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరంచేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్రను పోషిస్తాయి. అంతేకాదు నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది. నవ్వడం వలన శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చట. అవేంటో ఒకసారి చూద్దాం...

Is laughter a good medicine to live longer

1. నవ్వు మీ మనస్సును విశ్రాంతి పరుస్తుంది: నవ్వు మీ మనస్సును విశ్రాంతి పరుస్తుంది. నవ్వు ఒత్తిడి, డిప్రెషన్, నొప్పులకు ఒక గొప్ప మందులాంటింది . నవ్వు కోపాన్ని మరియు ఫ్రస్టేషన్ ను త్తగిస్తుంది. మీరు నవ్వినప్పుడు విడుదలయ్యే హార్మోనుల వల్ల మీరు మంచిగా బావిస్తారు. నవ్వు మన జీవితంలో చాలా మంచిది. దీన్ని వల్ల మనం మరికొంత కాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే ప్రస్తుత రోజుల్లో చాలా మంది కామిడి షోలను ఎక్కువగా చూస్తుంటారు. నవ్వినప్పుడు మనలో స్ట్రెస్ హార్మోనులు తగ్గి, మంచి హార్మోనుల ఉత్పత్తి పెరుగుతుంది.

2. నవ్వు మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది: నవ్వు మిమ్మల్ని స్థిరంగా ఉండేట్లు సహాపడుతుంది . నవ్వు మిమ్మల్ని పాజిటివ్ గా ఉండేట్లు ప్రోత్సహిస్తుంది . మీ బాధలను తగ్గించడానికి ఎంకరేజ్ చేస్తూ, మీ మనస్సును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది . నవ్వు స్ట్రెస్ హార్మోనులను తగ్గించి, శక్తిని పెంచతుంది . నవ్వును ఒత్తిడితో ఉన్న మనస్సును తగ్గించి సమస్యను నిధానంగా అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది.

3. నవ్వు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది: మీరు ఏవిషయంలోనైనా కోపంగా లేదా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు, బాగా నవ్వాలి . నవ్వు మీ ఫ్రస్టేషన్ తగ్గించడానికి బాగా సహాపడుతుంది . మీ శరీరంమరియు మనస్సులో మంచి ఫీలింగ్స్ ను పెంచుతుంది . కొంత మంది వారి కోపాన్ని తగ్గించుకోవడానికి లాటర్ థెరఫీని ఆశ్రయిస్తుంటారు . ఈ థెరఫీలో కోపం వచ్చినప్పుడు లేదా ఏవిషయంలోనైన నిరాశ చెందినప్పుడు, గట్టిగా నవ్వేలా చేస్తారు . ఇది తమషాగా అనిపించినా, తక్షణ ఫలితం చూపిస్తుంది .

4. నవ్వు ఒక వ్యాయామం: చాలా మంది ప్రజలు నవ్వును ఒక వ్యాయామంగా భావిస్తారు. ఎందుకంటే, మనం ఎక్కువగా నవ్వినప్పుడు సాధరణంగా కంటే ఎక్కువ ఆక్సిజన్ ను పీల్చుతాము. అందువల్ల, నవ్వడం వల్ల ఆక్సిజన్ తీసుకోవడం పెంచవచ్చు. ఇది హార్ట్ పంపింగ్ రేట్ ను పెంచుతుంది, అది శరీరంలో బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుంది . కాబట్టి, ఓపెన్ ఎయిర్ లో ప్రతి రోజూ ఉదయం బిగ్గరగా నవ్వడం వల్ల మీరు ఖచ్చితంగా ఎక్కువ కాలం జీవించవచ్చు.

5. వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో నవ్వు చాలా మంచిది: పైన అన్ని చెప్పిన విషయాల్లో నవ్వు చాలా ఉపయోగకరమని నిరూపించబడినది . నవ్వు మన భౌతిక, మానసిక, భావోద్వేగ సమతుల్యపరచడానికి బాగా సహాపడుతుందిని నిరూపించబడినది. ఇంకా నవ్వు కూడా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది . నవ్వు వల్ల శరీరంలో అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది . కాలరీలన్ కరిగిస్తుంది మరియు అనేక హార్మోనులను మరియు కణాలను పెంచి ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది. మరియు కొన్ని పరిశోధనల ప్రకారం నవ్వు డయాబెటిక్ పేషంట్స్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుందని నిరూపించాయి. అందువల్ల మొత్తం ఆరోగ్యానికి నవ్వు సహాయపడుతుంది.

Story first published: Tuesday, December 31, 2013, 12:07 [IST]
Desktop Bottom Promotion