For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఆరోగ్యంగా..చురుకుగా ఉండాలంటే..మీ మేథాసంపత్తికి పదును పెట్టండి...!

By Super
|

మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా మరియు చురుగ్గా ఉంచుకోవాలంటే వ్యాయామం చేస్తారు. కాని మీ మెదడు సంగతి ఏమిటి?

పరస్పర సంబంధంలేని క్రాస్వర్డ్ పరిష్కరించటం లేదా మీ కొత్త గాడ్జెట్ పని చేయటానికి క్రొత్త మార్గాలను ఆలోచించటం వంటివి మీ మెదడు బాగా పనిచేయటానికి సహాయపడతాయి, కాని ఇవి ఒక్కటే సరిపోదు.

మీ వయస్సు పరంగా లేదా ప్రేరణలు లేకపోవటం వంటి కారణాల వలన మీ మెదడు యొక్క వివిధ సామర్ధ్యాల వేగం తగ్గిపోవటానికి ముందే మీరు మీ మెదడును వివిధ సమర్థతా వ్యాయామాలను చేయటంవలన, మీ మానసిక సామర్థ్యం తిరిగి పునరుద్ధరించుకోవొచ్చు.

ఈ వ్యాయామాలు చేయటానికి చాలా తమాషాగా ఉంటుంది మరియు వీటిని మీ దైనందిన కార్యక్రమాలతోపాటు చేయండి మరియు కొన్ని వారాలపాటు వీటిని పునారావృతం చేస్తుండండి,అప్పుడు మీరే తేడాను గమనించవొచ్చు.

మీ జ్ఞానేంద్రియాలను ఉపయోగించండి

మీ జ్ఞానేంద్రియాలను ఉపయోగించండి

మీ శక్తిసామర్ధ్యాల మీద అవగాహనా దృష్టి ఉంచండి. ప్రతిరోజూ, ఒక వస్తువు లేదా ఒక మనిషిని గాని పాయింట్ లాగా గమనిస్తూ ఉండండి. ఇలా మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీసులో టీ-బ్రేక్ లో గాని చేయవొచ్చు. వెంటనే మీ చేతిలో ఉన్న నోట్ పాడ్ మీద ఆ వస్తువు లేదా మనిషి బొమ్మ గీయండి. ఇది మీకు స్వల్ప కాల జ్ఞాపకశక్తి వ్యాయామంలాగా పని చేస్తుంది. వారం చివరిలో, ఆదివారం సాయంత్రం, మీ నోట్ ప్యాడ్ ను చూడకుండ, మళ్ళీ ఏడు వస్తువులు లేదా వ్యక్తుల బొమ్మలు గీయండి. ఇలా చేయటం మీకు దీర్ఘకాలిక మెమొరీ వ్యాయామంలాగా పని చేస్తుంది.

వినికిడి

వినికిడి

మీరు ఫోన్ కాల్ ను అందుకున్నప్పుడు, మీ మొబైల్ తెరపై అతను/ఆమె పేరును చూడకుండా, ఎవరు కాల్ చేశారో గుర్తించడానికి ప్రయత్నించండి. లేదా, మీ ఇష్టమైన పాట వింటూ నేపథ్యంలో వినపడుతున్న ఒక ప్రత్యేక సంగీత వాయిద్యం గుర్తించండి; ఉదాహరణకి, వయోలిన్ యొక్క సంగీతం వినపడుతున్నదనుకోండి. దానిని విని మరియు అనుసరించండి. ప్రతిరోజూ, ఒక పాటను ఒక వారం వరకు ఇదే పద్ధతిని అనుసరించండి.

వాసన/రుచి

వాసన/రుచి

మీరు ఒక రెస్టారెంట్ కి వెళ్లినపుడు, అద్భుత రుచులు ఒక కొత్త వంటకం కోసం ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించండి. తరువాత, ఆ రుచులను గుర్తించటానికి ప్రయత్నించండి. మీరు ఆ వంటకానికి ఏమి హెర్బ్ లేదా మసాలా కలిపితే ఆ ప్రత్యేక రుచి వొచ్చిందో తెలుసుకుని, ఆ విషయాన్ని వెయిటర్ తో కాని లేదా వేరే ఎవరితోనైనా పంచుకోండి.

వాసన / ముట్టుకోవడం

వాసన / ముట్టుకోవడం

మీ రిఫ్రిజిరేటర్ తెరవండి మరియు మీ కళ్ళు మూసుకొని దానిలో ఉన్నవాటిని అనుభూతి చెందంది. దానిలో ఉన్న అనేక రకాల వస్తువులను తాకి మరియు వాసన ద్వారా గుర్తించడానికి ప్రయత్నించండి.

మెమొరీ

మెమొరీ

ప్రతిరోజూ, మీరు తరచుగా కాల్ చేసే రెండు సంఖ్యలను మీ మొబైల్ నుండి తీసుకోండి. ఆ రెండు సంఖ్యలను గుర్తు పెట్టుకోండి మరియు తరువాత మీరు వారికి కాల్ చేసినపుడు స్పీడ్ డయల్ కీ ని నొక్కకుండా, మెమొరీ నుండి మొత్తం సంఖ్య డయల్ చేయండి. వారాంతానికి మీ నోట్ పాడ్ లో, మీరు గుర్తుంచుకున్న పద్నాలుగు సంఖ్యలను వ్రాయండి.

మీ మేథాసంపత్తికి పదును పెట్టండి...!

విస్యుస్పాటియల్ శక్తిసామర్ధ్యాలు మీకు దూరాలు, వాల్యూమ్లను మరియు ప్రాంతం యొక్క దూరాలను త్వరగా, ఖచ్చితమైన అంచనాలు తయారుచేయటంలో సహాయపడతాయి. సాధారణ అవగాహన కంటే మరింత క్లిష్టమైన ఈ శక్తిసామర్ధ్యాలు వయసు పెరుగుతున్నా కొద్దీ తరిగిపోతూ ఉంటాయి. మీరు వీటిని ఎలా కాపాడుకోవాలో చూద్దాము; మీరు ఒక క్రొత్త స్థలాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వెళ్ళుతూ, మీరు గుర్తుంచుకున్న మార్గం యొక్క పటాన్నిగీయండి. ఏదైనా వస్తువును, ఉదాహరణకు పేపర్ వెయిట్ ను తీసుకుని దానియొక్క మందాన్ని అంచనా వేయండి.

దేనినైన సాధించగలిగే సమర్థతను పెంచుకోవటం

దేనినైన సాధించగలిగే సమర్థతను పెంచుకోవటం

ఈ సామర్థ్యం ఏదైనా సాధించగలిగే మీయొక్క మానసిక శక్తిని పెంచటానికి ఉపయోగపడుతుంది. దీనిని ఈ రెండు వ్యాయామాల ద్వారా బలపరచుకోండి; ఒక జిగ్సా పజిల్ ను తీసుకోండి. మరీ ఎక్కువ ముక్కలుగా తీసుకోవొద్దు మరియు అన్ని ముక్కలను కలిపి మీరు యెంత సమయంలో పూర్తిచేశారో వ్రాసుకోండి. వారం తరువాత, మళ్లీ సమయం వ్రాసిపెట్టుకోండి. మీకు ఇది విసుగు అనిపించినప్పుడు ఇంకొక జిగ్సా పజిల్ ను తీసుకోండి.

అర్థవంతంగా ఆలోచించే సమర్థతను పెంచుకోండి

అర్థవంతంగా ఆలోచించే సమర్థతను పెంచుకోండి

మనలో చాలా మంది తార్కికంగా ఆలోచించే సమర్థత ఉన్నవారే. మనచుట్టూ జరుగుతున్నవాటిని అర్థవంతంగా ఆలోచించటానికి ప్రయత్నించేవారే. కొన్ని సమయాల్లో మనం తార్కికంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతుంటాం. దీనిని ఎలా చురుగ్గా చేసుకోవాలో చూద్దాము; మీరు షాపింగ్ చేసిన లిస్టు గుర్తు చేసుకోండి, ఇది చెప్పటానికి చాలా తేలిక, కాని చేయటానికి చాలా కష్టం. మనం స్కూల్ రోజుల్లో మన సౌర వ్యవస్థలో గ్రహాల గురించి ఎలా నేర్చుకున్నామో గుర్తు తెచ్చుకోండి. అదే విధంగా మీరు షాపింగ్ లిస్టు ను గుర్తు తెచ్చుకోండి.

పదాల తో ఆడండి; శబ్ద సామర్ధ్యం

పదాల తో ఆడండి; శబ్ద సామర్ధ్యం

ప్రతి సారి మనం ప్రసంగంలో లేదా రచనలలో ఒక సరైన పదాన్నివాడుతుంటాం; మనం దీర్ఘకాల మరియు స్వల్పకాలిక జ్ఞాపకశక్తికి వ్యాయామం చేస్తుంటాం. ఈ వ్యాయామాలని మీయొక్క శబ్ద సామర్ఠ్యాన్ని పెంచుకోవటానికి చేయండి. మనలో చాలామంది ఉదయాన్నే వార్తలు చూస్తుంటాము. ప్రతి ఉదయం, ముఖ్యమైన వార్తల హెడ్లైన్స్ ను గుర్తుంచుకోండి, మరియు సాయంకాలం వాటిని మాటలలో వ్రాయండి. క్రొత్త భాషను నేర్చుకోండి. ఒక వ్యక్తిగత బ్లాగును ఉంచండి.

న్యురోబిక్స్

న్యురోబిక్స్

పైన చెప్పిన సామర్థ్యం-నిర్దిష్ట వ్యాయామాలతో పాటు, ఒక పని కోసం రెండు భావాలను లేదా ఎక్కువ ఉపయోగించే దృష్టిని పెంపొందించే న్యురోబిక్ వ్యాయామాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రారంభించడానికి కొన్ని ప్రాథమిక న్యురోబిక్ వ్యాయామాలు ఇస్తున్నాము

మీ మేథాసంపత్తికి పదును పెట్టండి...!

మీ దంతాలను ఎడమ (తప్పు) చేతితో బ్రష్ చేసుకోండి.

మీ మేథాసంపత్తికి పదును పెట్టండి...!

మీ కళ్ళు మూసుకొని దుస్తులను ధరించండి.

మీ మేథాసంపత్తికి పదును పెట్టండి...!

ఇంకొకరితో మీ భోజనాన్ని పంచుకోండి, కాని మాట్లాడవొద్దు! సైగలను మాత్రమే ఉపయోగించండి.

మీ మేథాసంపత్తికి పదును పెట్టండి...!

వానని వినండి మరియు అదే సమయంలో మీ వేళ్లు టాప్ చెయ్యండి.

మీ మేథాసంపత్తికి పదును పెట్టండి...!

పని చేయటానికి వైవిధ్యం ఉన్న మార్గాన్ని ఎంచుకోండి.

చురుగ్గా ఉండండి

చురుగ్గా ఉండండి

శారీరక శ్రమ, బరువు కోల్పోవడం కంటే ఎక్కువ చురుకుదనాన్ని పెంచుతుంది. క్రొత్త మెదడు కణాలను పెంచుతుంది, మీ మెదడుకు ఆక్సిజెన్ సరఫరాను పెంచుతుంది, న్యూరోట్రాఫిక్ కారకాల సౌలభ్యాన్ని పెంచుతుంది, మెదడులోని క్రొత్త కణాల వ్యాకోచ,సంకోచాలలో సహాయపడుతుంది.

Desktop Bottom Promotion