For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచు మూత్ర విసర్జన అనారోగ్యానికి సూచన...!

|

తరచూ(అతి) మూత్ర విసర్జన అనేది చాలా మందిలో ఉండే సమస్య. ఈ సమస్య వారికి తెలియకుండానే ఏర్పడుతుంటుంది. మూత్రం విసర్జ అతి త్వరగా చేయడం అనే తపన సాధారణ. కొంత మందిలో బ్లాడర్ చిన్న సైజులో ఉంటుంది. మూత్ర విసర్జన తరచుగా నివకుండా ఈ సమస్య ఎదురవుతుంటే అది ఆరోగ్య రుగ్మతకు లక్షణం అని గుర్తించాలి. అయితే తరచుగా మూత్రవిసర్జన కావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

సాధారణ వ్యక్తుల్లో, ఒక గంటలో రెండు సార్లు మూత్ర విసర్జన చేయడం అనేది ఫ్రీక్వేంట్ యూరినేషన్ సమస్యగా పిలుస్తారు .అయితే, పరిస్థితిని బట్టి సర్ధుబాటు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు: మీరు ఎక్కువ నీరు తాగినట్లైతే అప్పుడు తరచుగా మూత్రవిసర్జనకు కారణం స్పష్టంగా ఉంటుంది. కానీ, మీరు తీసుకొనే నీరు సాధారణంగా ఉంటే, అప్పుడు ఈ లక్షణానికి గల కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.

ఫ్రీక్వెంట్ యూరినేషన్ (తరచూ మూత్ర విసర్జన ) అనేది సాధారణంగా మధుమేహ లక్షణంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడూ మధుమేహం వల్లనే ఇలా తరచూ మూత్ర విసర్జన సమస్య ఉంటుంది అనుకోకూడదు. అందుకు ఇతర కారణాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, యూరిన్ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ డిజార్డర్ కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ కు దారితీస్తుంది. అందుకు మీరు పరిశీలించాల్సి కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి...

మధుమేహం:

తరచూ మూత్ర విసర్జనకు కారణం మధుమేహం యొక్క సాధారణ లక్షణాల్లో ఒకటిగా భావించవచ్చు. రక్తంలో ఎక్కువగా గ్లూకోజ్ ఉండటం వల్ల , అది వదించుకోవడానికి కిడ్నీ చాలా వేగవంతంగా పనిచేయడం జరుగుతుంది. అందువల్లే ఒక రోజులో 20సార్లు మూత్రవిసర్జన చేస్తుంటారు.

ప్రెగ్నెన్సీ:

గర్భధారణ సమయంలో మహిళల్లో క్రమంగా యూట్రస్ పెరుగడం వల్ల, ఇది బ్లాడర్ మీద ఒత్తిడి పెంచుతుంది. ఒత్తిడి వల్ల మూత్రపిండాలు కుచించబడి వెంటనే మూత్రవిసర్జనకు వెళ్ళాల్సిన కోరిక కలుగుతుంది.

ఒత్తిడి:

శరీరం ఒత్తిడికి గురియైనప్పుడు మరియు భయానికి గురియైనప్పుడు కూడా వెంటనే మూత్రవిసర్జన చేయాలినిపితస్తుంది. పరీక్షా కేంద్రంలో ఉన్నప్పుడు మీ కేంద్ర నాడీ వ్యవస్థ మరియు పిత్తాశయమును ఉపశమనం కలిగించడానికి అవసరం ఏర్పడుతుంది.

ఆల్కాహాల్ అధికమైనప్పుడు:

అతిగా మద్యం సేవించినపనప్పుడు, ముఖ్యంగా బీర్ తీసుకొన్నప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ కు దారితీస్తుంది.

హైపరాక్టివ్ థైరాయిడ్:

హార్మునుల అసమతుల్యత వల్ల, థైరాయిడ్ గ్లాడ్స్ హైపర్ ఆక్టివ్ గా ఉండటం వల్ల త్వరగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్:

ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురిఅవుతుంది.అటువంటి పరిస్థితుల్లో త్వరగా మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది. మీలో బ్లాడర్ (మూత్రాశయం)నిండుగా లేకపోయిన తరచూ మూత్రం చేయాలనిపిస్తుంది. కానీ మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపిస్తూ పూర్తిగా మూత్రవిసర్జన చేయలేక చుక్కలుచుక్కలుగా పాస్ చేయాల్సి వస్తుంది.

కిడ్నీ డిజార్డర్:

కిడ్నీలు మీ శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ మరియు మూత్రం వేరు చేయడానికి సహాయపడుతుంది. కొన్ని సార్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా ఇతర లోపాల వల్ల తరుచూ మూత్రవిసర్జన చేయాలనుకుంటారు.

క్యాల్షియం అధికంగా ఉన్నప్పుడు:

శరీరంలో అధికంగా క్యాల్షియం ఉన్నప్పుడు తరచూ మూత్రవిసర్జన చేయాలినిపిస్తుంది. శరీరంలో అధనంగా ఉన్న క్యాల్షియం బ్లాడర్ చుట్టూ స్థిరపడటం వల్ల, నిల్వచేసుకొనే సామర్థ్యం తగ్గుతుంది. ఇది వెంటనే మూత్రవిసర్జన చేయాలనే

కోరికకు దారితీస్తుంది.

నర్వ్ (నాడీ)స్ట్రోక్:

కొన్ని సార్లు, నరాల స్ట్రోక్స్ పిత్తాశయమును నియంత్రణ మీద నిర్లక్ష్యం చేయవచ్చు. కొన్ని సార్లు, సెరిబ్రల్ స్ట్రోక్ తర్వాత, మీ పిత్తాశయంను నియంత్రణ చేయలేదు. దాంతో పిత్తాశయం వరకూ దారితీసే నరములు దెబ్బతింటాయి.

మోనోపాజ్ లక్షణాలు:

మోనోపాజ్ అనేది శరీరంలో చాలా సాధరణంగా కనిపించే మార్పు. ఇది చాలా మానసికంగా మార్పులను కలుగజేస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో ఫ్రీక్వెంట్ యూరినేషన్ కు కారణం అవుతుంది.

English summary

Medical Causes Of Frequent Urination | తరచు మూత్ర విసర్జన ఆరోగ్యానికి హానికరం..!

Frequent urination is a problem that many people face without realising. The urge to relieve your bladder too soon is not normal. Some people are born with small bladders. But otherwise, frequent urination is often a symptom of some sort of health disorder. There are many causes of frequent urination.
Desktop Bottom Promotion