For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి ఆరోగ్యానికి సహజంగా రక్తాన్ని శుద్ది చేసే ఆహారాలు

By Mallikarjuna
|

రక్త శుద్ది శరీరంలో ఆరోగ్యకరంగా చాలా కీలకమైనది. శరీరం యొక్క మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో టాక్సిన్స్ స్థాయిలు పెరిగినప్పుడు, శరీరంలో అవయావాలు క్రమంగా నాశనం అవుతాయి మరియు శరీరంలో అవయవాలు చురుకుగా పనిచేయడానికి కూడా మొరాయిస్తాయి. అలర్జీ, తక్కువ రోగనిరోధకశక్తి, స్థిరంగా తలనొప్పి, అలసట వంటి మరికొన్ని సాధారణ లక్షణాలు శరీరంలో మలినాలతో మరియు విషాన్ని కలిగి ఉన్నాయని చూపబడుతాయి. మలినం కలిగిన రక్తం శరీరంలో అనేక ఆరోగ్య మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. అనేక చర్మ సమస్యలు మొటిమలు, మచ్చలు, డార్క్ నెస్, నిస్తేజమైన చర్మం మరియు పొడి బారిన చర్మం వంటి అనేక చర్మ సమస్యలకు మలినరక్తం కారణం అవుతుంది.

అందువల్లే, చాలా రకాల బ్లడ్ ప్యూరిఫికేషన్ సిరఫ్స్(రక్తం శుద్దిచేసి సిరఫ్ లు)మరియు టానిక్స్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సిరప్ లు వందకు వందశాతం ఫలితాలను ఇవ్వవు. మొటిమలు, మరియు డార్క్ నెస్ అనేవి ముఖంలో అలాగే నిలిచి ఉంటాయి. దీనికి ప్రధానంగా టానిక్స్ మరియు మందుల అన్నింటికి పనిచేయవు. కాబట్టి, మీరు ఎక్కువగా డిటాక్స్ డైట్ (రక్తం శుద్ది చేసే ఆహారాల)మీద ఎక్కువ శ్రద్ద చూపాలి.

కాలేయం, మూత్రపిండాలు, అలాగే శోషరస నాళాలు ప్రధానంగా రక్త నిర్విషీకరణలను పనిచేస్తుంది మరియు జీవక్రియలను నుండి మలినాలను మరియు విషాన్ని తీసివేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే, మలినాలతో కూడిన రక్తం శరీరం అంత ప్రసరించి, అది చర్మ సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి శరీరంలో శుద్దమైన రక్తం ప్రవించాలంటే, రక్తం శుద్ది చేసుకోవాలంటే, కొన్ని డిటాక్సిఫైయింగ్ ఫుడ్స్ ఎక్కువగా మీ డైలీ డైట్ లో చేర్చుకోవాలి. దాంతో ఆరోగ్యపరంగా మూత్రపిండాలు మరియు కాలేయం వంటి ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేసే కొన్ని ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, మరింత మంచి ఆరోగ్యాన్ని పొందండి...

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది, ఇందులోని ఒకరకమైన ఫైబర్ కొలెస్ట్రాలను నియంత్రిస్తుంది మరియు ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి పెద్దప్రేగును శుభ్రం చేస్తుంది.

 అవొకాడో:

అవొకాడో:

అవొకాడో ఒక క్లెన్సింగ్ ఫుడ్, ఇది అనేక న్యూట్రిషియన్స్ తో ప్యాక్ చేయబడింది ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, మలినాలను తొలగిస్తుంది. అవొకాడోలో ఉన్న న్యూట్రియంట్స్ ను గ్లూటాథియన్ అని పిలుస్తారు. ఇది 30 వివిధ రకాలా కార్సినోజన్స్ ను విడుదల చేసి, కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది .

బీట్ రూట్:

బీట్ రూట్:

మీరు బీట్ రూట్ తో తయారుచేసిన, సలాడ్స్, సూప్స్ లేదా గ్రేవీలను తీసుకోవచ్చు. ఎందుకంటే బీట్ రూట్ లో రక్తం శుద్ది చేసే మరియు లివర్ క్లెన్సర్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

ఒక అత్యంత శక్తివంతమైన నయం చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బ్లూబెర్రీస్ లో నేచురల్ ఆస్పిరిన్ ఇది టిష్యూ డ్యామేజ్ను చాలా వరకూ తగ్గిస్తుంది మరియు ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా బ్లాక్ కాకుండా యాంటీబయాటిక్ పనిచేస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ ను నివారించవచ్చు.

క్యాబేజ్:

క్యాబేజ్:

ఒక గ్లాస్ క్యాబేజ్ జ్యూస్ తాగడం వల్ల, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు రక్తాన్ని శుద్ది చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. క్యాబేజ్ లో అనేక యాంటీక్యాన్స్ మరియు యాంటిఆక్సిడెంట్స్ గుణాలున్నాయి. ఇవి లివర్ బ్రేక్ డైవ్ ఎక్స్సె హార్మోన్స్ కు సహాయపడుతాయి. క్యాబేజ్ జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది .

క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్:

మీ శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్ ను తొలగిస్తుంది. ఇవి మీ యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు . అందువల్ల క్రాన్ బెర్రీస్ లో యాంటీ బయోటిక్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి యాంటీబయాటిక్ మాత్రమే కాదు, నేచురల్ బ్లడ్ ఫ్యూరియర్ హెర్బ్ కూడా. వెల్లుల్లి రక్తంను శుద్ది చేస్తుంది, శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. రక్తంలో కొవ్వును కరిగిస్తుంది.

గ్రేప్ ఫ్రూట్ :

గ్రేప్ ఫ్రూట్ :

బ్రేక్ ఫాస్ట్ లో రెడ్ కలర్ గ్రేప్స్ తినడం వల్ల పెక్టిన్ ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది, దాంతో రక్తం శుధ్దికాబడుతుంది. పెక్టిన్ అధికంగా మెటల్స్ కలిగి ఉండి శరీరం నుండి టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

పసుపు:

పసుపు:

పసుపు ఒక మసాలా దినుసు, దీన్ని ఇండియన్ ఫుడ్స్ లో సాధారణంగా ఉపయోగిస్తారు. ఇందులో అనేక ఔషధగుణగణాలున్నాయి . ఇవి రక్తంను కూడా శుధ్ది చేస్తాయి . ఇది నేచురల్ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్. ఇది బ్లడ్ స్టెమ్ ను ప్యూరిఫై చేస్తుంది.

టీ:

టీ:

అనేక హెర్బ్స్ ను బ్లడ్ క్లెన్సింగ్ టీగా తీసుకోవచ్చు, ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. రక్తం శుద్ది చేయడంలో చాలా సాధారణ హోం మేడ్ టీ, అల్లం టీ , పెప్పర్ మింట్ టీ మరియు డాండలైన్ టీ. రక్తం శుద్ది చేసుకోవడంలో గ్రీన్ టీని ఎన్ని సార్లైనా త్రాగవచ్చు.


English summary

Natural Blood Purifiers For Good Health

Blood is an important element in your body and system that serves a lot of purpose like transporting nutrients and oxygen to organs etc. major organs depend on blood to function making it critical to our system.
Story first published: Sunday, December 22, 2013, 16:35 [IST]
Desktop Bottom Promotion