For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన వంటగదిలోని వస్తువులే మన పెయిన్ కిల్లర్స్...!

|

అనవసరంగా తీసుకొనే డ్రగ్స్(మందులు)శరీర ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. అంటువంటి డ్రగ్స్(మందు)ల్లో పెయిన్ కిల్లర్స్ ఒకటి. సాధారణంగా చాలా మంది పెయిన్ కిల్లర్స్ కు చాలా అలవాటు పడి ఉంటారు. ఏ చిన్న నొప్పి అనిపించినా డాక్టర్ ప్రిస్రిప్షన్ లేకుండానే పెయిన్ కిలర్స్ తినేస్తుంటారు. చాలా మంది అతి చిన్న సమస్యలకే చిన్న తలనొప్పి లేదా రుతుక్రమంలో వచ్చే సాధారణ నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ, నేచురల్ పెయిన్ కిల్లర్స్ లోనే చాలా రకాలు యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ (నొప్పి నివారిణి) ఉన్నాయి. ఈ సహజ నేచురల్ పెయిన్ కిల్లర్స్ ను ఇంటర్నల్ గా మీడైయట్ లో చేర్చుకోవచ్చు మరికొన్ని ఎక్స్ టర్నల్ గా మసాజ్ చేయవచ్చు.

నేచురల్ పెయిన్ కిల్లర్స్ మీ నొప్పి నివారించడానికి చాలా బాగా సహయం చేస్తాయి. కానీ, అదే సమయంలో ఏ దీర్ఘకాలం మరియు దీర్ఘకాల నొప్పిలకు వైద్యం తీసుకోవాలి . పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం వల్ల అవి కేవలం నొప్పి సంకేతాలను అడ్డుకోవటంతో కండరాలు సడలించడం లేదా నరాలకు ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. వేడి అనేది నొప్పి నివారిణిగా పరిగణించవచ్చు. నొప్పిని నివారించడానికి ఇది ఇంట్లో చేసుకొనే సాధారణ పరిస్కారం.

ఇటువంటి సహజ నొప్పి నివారుణుల మరికొన్ని మీ వంటగదిలోనే ఉన్నాయి. నొప్పి నివారించుకోవడానికి వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి సురక్షితం మాత్రమే కాదు. ఎక్కువగా నొప్పిగా ఉన్నా చాలా ప్రభావవంతగా పనిచేస్తాయి. కాబట్టి ఎటువంటి నొప్పికోసమైనా మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకొనే ముందు ఈ వంటగదిలో లభ్యం అయ్యే ఈ నేచురల్ రెమడీస్ ను ట్రై చేసి చూడండి..ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. మరి ఆ సహజనివారణోపాయాలేంటో ఒకసారి చూద్దాం...

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

పంటినొప్పికి లవంగాలు: పంటినొప్పితో బాధపడుతుంటే కనుక లవంగాలను నమలడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది గమ్ ఇన్ఫ్లమేషన్ గా బాగా పనిచస్తుంది. లవంగాల్లో ఉండే ఈజినోల్(eugenol)అనే కారం కలిగించే అంశం ఉండటం వల్ల ఇది నొప్పిని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన సహజ నివారిణి.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

కండరాల నొప్పి నివారిణి అల్లం: అల్లంను ప్రతి రోజూ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది కండరాలను స్టిఫ్ గా ఉంచడంతో పాటు కీళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇది పచ్చి అల్లంలో ఉండే జింజరోల్స్ వల్ల ఇలా నొప్పినివారిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో అల్లంను తప్పనిసరిగా ఉండేవిధంగా చూసుకోవాలి.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

చెవి నొప్పికి వెల్లుల్లి: గోరువెచ్చని వెల్లుల్లి నూనెను నొప్పి ఉన్న చెవిలో పోయాలి. ఇలా రోజుకు రెండు సార్లు, ఒక ఐదురోజులు క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే జర్మేనియం, సెలీనియం మరియు సల్ఫర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి వివిధ బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

గొంతునొప్పికి ఉప్పు: గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి, ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కలించడం లేదా గార్గిల్ చేయడం వల్ల చాలా మంచి ప్రభావాన్ని చూపెడుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడ్డ ఎటువంటి వాపులనైనా ఉప్పు తగ్గిస్తుంది. కాబట్టి రోజులో రెండు మూడు సార్లు ఇలా ఉప్పునీటిని గలగరించడం వల్ల గొంతునొప్పి నివారించుకోవచ్చు.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

రుతుక్రమ తిమ్మిరులకు ఓట్ మీల్: ఓట్ మీల్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుండి. రుతుక్రమంలో వచ్చే నొప్పులను, తిమ్మిరులను నివారించడానికి తక్షణ ఉపశమనం కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. అంతే కాదు ఓట్ మీల్ లో జింక్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల పెయిన్ ఫుల్స్ పీరియడ్స్ నుండి మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే నొప్పులకు బ్లూబెర్రీస్: యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో బ్లూబెర్రీస్ అద్భుతంగా సహాయపడుతాయి. బ్లూబెర్రీస్ లో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ బ్లాడర్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కాబట్టి ఎటువంటి యూటీఐ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం పొందాలంటే మీ డైట్ లిస్ట్ లో బ్లూ బెర్రీస్ కు స్థానం కల్పించండి.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

బాడీ పెయిన్స్ కు పుదీనా: నరాల నొప్పులను సహజంగా ఉపశమనం కలిగిస్తుంది పెప్పర్ మింట్. గోరువెచ్చని నీటిలో కొన్ని ఆకులను లేదా పెప్పర్ మింట్ ఆయిల్ 10చుక్కలు వేసి నానబెట్టి తీసుకోవడం వల్ల బాడీ పెయిన్స్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. నరాలు విశ్రాంతి పొందుతాయి.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

జీర్ణవ్యవస్థలో క్రమబద్దానికి పైనాపిల్: జీర్ణవ్యవస్థ వల్ల వచ్చే కడుపు నొప్పి ఎసిడిటి వల్ల వచ్చే నొప్పిని నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పైనాపిల్ జీర్ణ వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. పైనాపిల్లో ఉండే ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ తిన్న ఆహారం సరిగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

కీళ్ళ నొప్పులకు పసుపు: కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో పసుపును ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు కీళ్ళ నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఎటువంటి నొప్పి అయినా చిటికెలో మాయం..!

తలనొప్పికి యూకలిప్టస్ ఆయిల్ : తరచూ తలనొప్పితో బాధపడుతున్నట్లైతే యూకలిప్టస్ ఆయిల్ తలకు మర్ధన చేసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ అంశాలు నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.

English summary

Natural Pain Killers From Your Kitchen | మన వంటగదిలోని వస్తువులే మన పెయిన్ కిల్లర్స్...!

Unnecessary use of drugs are harmful to our body in more than one way. Painkillers are one among those drugs which people use without even the prescription of a medical practitioner. For most people it is a habit to take painkillers for even a mild headache or a menstrual cramp. 
Story first published: Wednesday, May 15, 2013, 13:21 [IST]
Desktop Bottom Promotion