For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్డ్ చేసి, ముక్కు మూసుకుపోయిందా?ఇవిగో గొప్ప పరిహారం

|

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ వేధించే సమస్య అలర్జీ. ఈ సమస్య సాధారణమైనదిగానే కనిపించినా బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సుమారు 20 శాతం మందిలో అలర్జీ సమస్య ఉంటోంది. అందులో 40 శాతం మంది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో అలర్జీ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అలర్జీ శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ ముక్కు, ఊపిరితిత్తుల్లో అలర్జీ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కొందరిలో ఫుడ్ అలర్జీ ఉంటుంది. పడని వస్తువు తిన్న వెంటనే అలర్జీ బయటపడుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలర్జీ ముక్కు వరకే పరిమితం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. ఈ నాసల్ బ్లాకేజ్ కలగడానికి అనేక కారణాలున్నాయి. అందులో కొన్ని జలుబు, అలర్జీ, ఫ్లూ, లేదా సైనస్ సమస్యల వల్ల నాసల్ బ్లాకేజ్ కు కారణం కావచ్చు. ఎవరైతే జలుబు లేదా అలర్జీ వల్ల బాధపడుతుంటారో వారిలో చాలా చిరకా లేదా నొప్పి, లేదా బాధను కలిగిస్తాయి. ఇలా చికాకును కలిగించే ముక్కులోని అదనపు శ్లేష్మాన్ని బయటకు ప్లష్ చేయాలి.

లక్షణాలు: నాసల్ అలర్జీతో బాధపడే వారి జీవనప్రమాణం దెబ్బతింటుంది. రోజు వారి పనులు చేసుకోలేకపోతారు. ముక్కులు మూసుకుపోతాయి. ముక్కు వెంట నీళ్లు కారుతుంటాయి. ముక్కుదిబ్బడ వేసి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. నోటితో గాలి పీల్చుకోవాల్సి వస్తుంటుంది. అదే సమయంలో కళ్ల దగ్గర దురద, కళ్లు ఎర్రగా మారడం, నీరు కారడం జరుగుతుంది. దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. పిల్లల్లో అలర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పాఠశాలకు వెళ్లలేకపోతారు. వెళ్లినా పాఠాలు సరిగ్గా వినలేరు. అలర్జీ కొందరిలో సీజనల్‌గా వస్తుంటుంది. మరికొందరిలో ఏడాది పొడవునా ఉంటుంది. శరీరానికి పడని వస్తువు తిన్న వెంటనే దద్దుర్లు వస్తుంటాయి.

తుమ్ములు మొదలుకాగానే కొందరు తెలిసిన మాత్రలు తెచ్చి వేసుకుంటుంటారు. మరికొందరు ముక్కులు బ్లాక్ అయ్యాయని నాసల్ డ్రాప్స్ తెచ్చి వేసుకుంటారు. అయితే నాసల్ డ్రాప్స్‌ను నాలుగు రోజులకు మించి వాడకూడదు. నాసల్ డ్రాప్స్ అతిగా వాడితే రైనైటిస్ మెడికమెంటోసా అనే పరిస్థితి తలెత్తుతుంది. అంటే వాడుతున్న మందు వల్ల కూడా అలర్జీ మొదలవుతుంది. అంతేకాకుండా అతిగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. మాత్రలు కూడా ఇష్టానుసారంగా వాడకూడదు. తరచు ముక్కు కారుతుంటే, తడి తడిచేసి, పొడిబారిలే చేసుకోవడం కాదు, వాటికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నాసల్ బ్లాకేజ్, ముక్కు కారడాన్ని నయం క్లియర్ చేసే కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. మందులు వాడకుండా, ఈ హోం రెమడీస్ ఉపయోగించి, నాసల్ బ్లాకేజ్, ముక్కు కారడం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

వేడి వేడిగా టీ:

వేడి వేడిగా టీ:

నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఒక ఉత్తమ మార్గం, ఒక కప్పు వేడి వేడి టీని తాగాలి. కొన్ని సందర్భల్లో ఇటువంటి వేడి, వేడి పానీయాలో ముక్కు కారడాన్ని మరియు అసౌకర్యాన్ని నయం చేడంలో బాగా సహాయపడుతాయి. కానీ, ఈ వేడి వేడి టీ మాత్రం నాసిక ప్రతిష్టంభన మరియు వాపు తొలగించేందుకు ఒక అదనపు ప్రయోజనం కలిగి ఉంది. కొన్ని పానీయాలు వేడి వేడి గ్రీన్ టీ మరియు పెప్పర్ మింట్ టీ మరియు అల్లం టీ వంటివి నాసికా మరియు సైనస్ నొప్పిని నుండి ఉపశమనం కలిగించడంలో గొప్పగా సహాయపడుతాయి.

ఆవిరి పట్టడం:

ఆవిరి పట్టడం:

ఇది ఒక గొప్ప రెమడీ, పురాతన కాలం నుండి ఈ రెమడీని ఉపయోగిస్తున్నారు. ఇది ముక్కు మూసుకుపోవడాన్ని మరియు సైనస్ రద్దీ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఒది ఒక గొప్ప పరిహారం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, ముక్కు కారడాన్ని మరియు ముక్కు కారునట్లు అగుపించడాన్ని నయం చేస్తుంది. ఒక పెద్ద పాత్ర లేదా గిన్నెలో వేడి నీటిని తీసుకొని అందులో, మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపాలి. ఇప్పుడు తలకు పూర్తిగా ఒక మందపాటి, టవల్ కప్పుకొని ఆవిరి బటయ పోకుండా తల గిన్నెలోకి వచ్చు ఆ ఆవిరిని పూర్తిగా ముక్కు, నోటితో పీల్చాలి. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన ముక్కుకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

వేడి నీటి స్నానం:

వేడి నీటి స్నానం:

నాసల్ బ్లాకేజ్ నుండి ఉపశమనం పొందడానికి మరో గొప్ప మార్గం వేడినీటితో స్నానం చేయడం. ఎప్పుడుతై మీరు ముక్కు మూసుకుపోయినట్టు మరియు సైనస్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేయడం ఒక మంచి మార్గం. వేడి నీటి స్నానం వల్ల మూసుకుపోయిన ముక్కను శ్వాసపీల్చడానికి సులభతరం చేస్తుంది. దాంతో మీరు తక్షణం సౌకర్యవంతంగా మరియు ఉపశమనం కలిగిన అనుభూతిని పొందుతారు.

స్పైసీ ఫుడ్:

స్పైసీ ఫుడ్:

నాసల్ బ్లాకేజ్ నుండి ఉపశమనం పొందడానికి ఒక మంచి హోం రెడీ స్పైసీ ఫుడ్. కారంగా ఉండే ఆహారాలు తీసుకొన్నప్పుడు. నాసికా ప్రకరణము ద్వారా శ్లేష్మం ప్రవాహం అభివృద్ధిలో సహాయపడుతుంది. ఎప్పుడైతే మీరు నాసల్ బ్లాకేజ్ లేదా సైనస్ తో బాధపడుతుంటారో అప్పుడు మీరు తీసుకొనే ఆహారంలో కొంత స్పైసీ, కారంగా వేడి, వేడిగా తినడానికి ప్రయత్నించండి. ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

నీళ్ళు మరియు ఉప్పు:

నీళ్ళు మరియు ఉప్పు:

ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో రెగ్యులర్ సాల్ట్ ను మిక్స్ చేసి, ఈ నీటిని తల పక్కకు ముందుకు వంచి ఒక నాసికా రంద్రంలో పోయాలి. ఇలా చేయడం ద్వార నాసల్ బ్లాకేజ్ లేదా సైనస్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశననం పొందడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఉల్లిపాయలు. ఉల్లిపాయలను అతి దగ్గరగా పెట్టుకొని, చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల వల్ల నాసల్ పాసేజ్ ఫ్రీగా అవుతుంది. మరియు పచ్చి ఉల్లిపాయను తినడం ద్వారా నాసికా ప్రతిష్టంభన నుండి ఉపశమనం పొందవచ్చు.

హాట్ టమోటో జ్యూస్:

హాట్ టమోటో జ్యూస్:

నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన హోం రెమడీ టమోటో జ్యూస్. నాజల్ బ్లాకేజ్ నుండి ఉపశనం పొండానికి ఈ హాట్ టమోటో జ్యూస్ ను చాలా సులభంగా తయారు చేవచ్చు. అందుకు ఒక కప్పు నీళ్ళలో టమటో ముక్కలు, ఒక టేబుల్ స్సూన్ కట్ చేసిన వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరటేబుల్ స్పూన్ హాట్ సాస్, చిటికెడు ఉప్పు, అరటేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు వేసిబాగా మరిగించాలి. ఈ టమోటో జ్యూస్ ను వేడి వేడిగా రోజుకు రెండు సార్లు తాగడం వల్ల నాసల్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Remedies For Nasal Blockage

Nasal blockage or sinus congestion may stem up due to a number of different causes. Some of the main reasons for nasal blockages would be cold, allergies, flu or sinus problems. When a person suffers from a cold or allergy, it irritates and inflames the nasal passage.
Story first published: Monday, August 5, 2013, 11:22 [IST]
Desktop Bottom Promotion