For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో పురుషుల వ్యాధినిరోధకశక్తి పెంచే ఫుడ్స్

By Derangula Mallikarjuna
|

సాధారణంగా మిగిలిన సీజలన్ లో కంటే శీతాకాలం చాలా ప్రధానమైనది. ఎందుకంటే వాతారణంలోని మార్పులతో పాటు, వెంటనే మన శరీరంలో కూడా అనేక మార్పులు ఏర్పడుతాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోడం, చర్మం పొడిబారడం, జుట్టు పొడిబారి, జుట్టురాలడం వీటితో పాటు అనేక వైరస్ ల వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనారగ్యం పాలు కావడం జరగుతుంది. ఈ వింటర్ సీజన్ చాలా జలుబు మరియు ఫ్లూ వంటివి చాలా ప్రధానమైనవి. ఈ రెండు అంత్యత సమస్యాత్మకమైన రోగాలు.వచ్చినాయంటే అంత త్వరగా పోవు. మిగిలన సీజన్లలో కంటే ఈ సీజన్ లో ఈ రెండు చాలా ప్రభావంతంగా ఏర్పడుతాయి. ఈ భాదనుండి బయటపడటానికి మన శరీరంలో వ్యాధినిరోధకత ఈ రోగ్యాలతో పోరాడే బాధ్యత వహిస్తుంది.

శీతాకాలంలో మీరు వెచ్చదనాన్ని కలిగి ఉండాలి. మీ శరీరం వెచ్చగా ఉన్నప్పుడే మీ శరీరం డీహైడ్రేషన్ మరియు సాధారణ జలుబు మరియు ఫ్లూ వంటి వాటితో ఈరోగ్యకరంగా పోరాడటానికి సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటూ, మంచి నిద్రను, మరియు హెల్తీ డైట్ ను అనుసరించినట్లైతే వ్యాధినిరోధక శక్తిని పెంపొందిచుకోవచ్చు. దాంతో మీశరీరంలో అనారోగ్యం బారిన పడకుండా మీ శరీరాన్ని కాపడటానికి ఇవి చాలా అవసరం. వీటితో పాటు రోగనిరోధకశక్తిని పెంచేందుకు అనేక ఆహారాలున్నాయి. ఈ ఆహారాలు వింటర్ సీజన్ లో వచ్చే జలుబు మరియు ఫ్లూ వంటి రోగాలతో పోరాడే లక్షణాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు, వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి మీరు రెగ్యులర్ వ్యాయామం ద్వారా ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండాలి.

ఆహారాల్లో విటమిన్ ఎ, ఇ, సి మరియు మినిరల్స్-జింక్ సమృద్ధిగా ఉన్నటువంటివి ఆహారాలు మీలో వ్యాధినిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతాయి. పండ్లు మరియు కూరగాయలు : స్వీట్ పొటాటో, టర్నిప్స్, పీయర్స్, గ్రేఫ్ ఫ్రూట్, ఆరెంజ్, క్యాబేజ్, బెల్ పెప్పర్స్, అవొకాడో, ఆపిల్స్ మరియు అరటిపండ్లు వంటివి వ్యాధినిరోధక శక్తికలిగిన ఆహారాలుగా ఉన్నాయి. మీరు మీ ఆహారంలో ఇటువంటి సమృద్ధిగల ఆహారాలను పండ్లు, కూరగాయలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఈ వింటర్ సీజన్ లో మీరు తీసుకోవల్సిన రోగనిరోధకశక్తి ఫైటింట్ ఫుడ్స్ మీకోసం కొన్ని...

1. బ్రొకోలీ:

1. బ్రొకోలీ:

బ్రొకోలీలో విటమిన్ ఎ మరియు సి వీటితో పాటు అనేక న్యూట్రీషియన్స్-ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, మరియు ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి . మరియు ఇందులో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఇతర రక్షక వకచాలైన పదార్థాలు మీ శరీరంలో రోగనిరోధక శక్తిపెంచే పదార్థాలు అధికంగా ఉన్నాయి.

2. క్యారెట్స్:

2. క్యారెట్స్:

క్యారెట్స్ లో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్నాయి. వీటిల విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని కలిగి కాలేయంలోని మలినాలను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది. ఇది అనేక అంటువ్యాధులు మరియు ఇతర రోగాలతో పోరాడే లక్షణాలు కలిగి ఉన్నాయంటారు.

 3. ఆపిల్స్ :

3. ఆపిల్స్ :

ఆపిల్స్ వల్ల అధిక పోషక ప్రయోజనాలున్నాయి. ఇవి వింటర్ సీజన్ లో చాలా ఉపయోగపడుతాయి. ఇది అత్యంత ఆరోగ్యవంతమైనది మరియు ఇది అధికంగా ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అంధిస్తుందిస్తుంది. ఇవి మీ శరీరం జ్వరం, జలుబు, ఫ్లూ బారీన పడకుండా వింటర్ సీజన్ లో మీ శరీరాన్ని కాపాడుతుంది.

4.కివి పండ్లు:

4.కివి పండ్లు:

కివి పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంది.పెద్దలకు రోజంతా అవసరం అయ్యే విటిమన్ సీ కివి పండ్లుల సమృద్ధిగా ఉందని అనేక పరిశోధనలు నిర్ధారించాయి. ఈ విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

5.గ్రీన్ టీ :

5.గ్రీన్ టీ :

ఈ గ్రీన్ టీ సంజీవిని కంటే మరింత ఆరోగ్యకరమైనది మరేది లేదు. ఇది మీ శరీరంలోని టాక్సిన్స్ ను శుభ్రం చేయడానికి మరియు మీ ఆరోగ్యానికి ఎనర్జీని, వ్యాధినిరోధక శక్తిని నింపుతుంది. ఇది అధిక పోషకాలున్న యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉంది.

6.మాంసాహారం:

6.మాంసాహారం:

మీ రెగ్యులర్ డైట్ లో లీన్ మీట్ ను కూడా అధికంగా జోడించాలి . మీ శరీరంలో జింక్ ను పెంచుకోవడానికి లీన్ మాంసం బాగా సహాయపడుతుంది. అందువల్ల మీ రెగ్యులర్ డైట్ లో రెడ్ మీటీ లేదా చికెన్ ను తీసుకోండి.

7.ఓయిస్ట్రెస్:

7.ఓయిస్ట్రెస్:

జింక్ సమృద్ధిగా ఉండే ఇక గొప్ప సీఫుడ్ ఇది. ఒక సింగిల్ ఓయిస్ట్రెస్ పెద్దల్లో రోజుకు సరిపడా అవసరం అయ్యే జింక్ ను అందిస్తుంది. జింక్ మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి తెల్ల రక్త కణాల అభివృద్ధి మరియు పనితీరును పెంచుతుంది.

8. కొబ్బరినూనె:

8. కొబ్బరినూనె:

కొబ్బరి నూనెలో ల్యూరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. అనేక అంటువ్యాధులకు కారణం అయ్యే అనేక వైరెస్ తో పోరాడుతుంది. ఈ బహుముఖ నూనె మీ వంటకాల్లో ఉపయోగించి రోజువారి తీసుకోవడం మంచిది.

 9. బ్లూ బెర్రీస్:

9. బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీ, రాస్ప్బెర్రీస్ , గోజీ పండ్లు మరియు acai బెర్రీస్ ఇవన్నీ కూడా ORACవిలువలను కలిగి ఉంది. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి,శరీరం బలహీన పడకుండా రక్షణ కల్పిస్తుంది. బెర్రీస్ లో కూడా అనేక విటమిన్స్, మినిరల్స్ మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ శరీరాన్ని శుభ్రం చేసి, వ్యాధినిరోధకతను పెంచుతాయి.

 10. మష్రుమ్స్:

10. మష్రుమ్స్:

పుట్టగొడుగులు రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా సహాయపడుతుంది. మష్రుమ్ లో వివిధ రాకలు : maitake , reishi , coriolus , agaracus మరియు శైటెక్ వంటి పుట్టగొడుగులను రకాలు వైద్య విలువలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ పుట్టగొడుగులు రోగనిరోధక వ్యవస్థ యాక్టివ్ గా ఉంచడానికి సహాయపడే, బీటా గ్లూకాన్స్ అని శక్తివంతమైన కాంపౌండ్స్ కలిగి ఉంటుంది.

English summary

Seasonal changes bring a lot of health problems the most common being cold

The weather is changing and the time to boost your immune system has almost come. Seasonal changes bring a lot of health problems the most common being cold, fever and flu. Often a lot of people suffer from cold or flu when the season changes.
Desktop Bottom Promotion