For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసిక ఒత్తిడిని జయించడానికి సెక్సీ మార్గాలు..!

|

ప్రతి మలుపులోనూ ఒక కిరాతకుడు కాచుకుని ఉంటాడు, మీకు తెలీకుండానే దెబ్బ తీస్తాడు. వత్తిడి మీ మీద అన్ని రకాలుగా దాడి చేస్తుంది, మిమ్మల్ని నిద్దట్లో౦చి హటాతుగా లేపుతుంది (మీకు నిద్ర పడితే) లేదా ఆఫీస్ లో ముఖ్యమైన ప్రెజెంటేషన్ లో వున్నప్పుడు మాటలు తడబడతాయి.

మీరు ఈ ఒత్తిడి రాక్షసుడిని మీ జీవితంనుంచి పారద్రోలేందుకు మేము ఇక్కడ ఒక 10 సెక్సీ మార్గాలు ఇచ్చాం. చదివి మరింత హాయిగా బతకండి.

నీటితో బద్దకాన్ని వదిలించుకోండి

నీటితో బద్దకాన్ని వదిలించుకోండి

మీకు తరచుగా తలనెప్పి, ఆలస్యంగా స్పందించడం, చికాకు, బద్ధకం, అలసట అనిపిస్తోందా? నీరు ఎండిపోవడం వల్ల అని తెలుసుకోండి. ఒత్తిడిలో వున్నప్పుడు మీకు మంచి నీళ్ళు తాగాలని అనిపించదు, కానీ నిజానికి అప్పుడే మీకు నీళ్ళు కావాలి. మద్యం మీ రక్తపు చక్కర స్థాయిలతో ఆడుకుని, మిమ్మల్ని ఇంకా నీరు లేకుండా చేస్తుంది.

ముఖ్యమైన మీటింగ్ ను పాలతో ఎదుర్కో౦డి.

ముఖ్యమైన మీటింగ్ ను పాలతో ఎదుర్కో౦డి.

ముఖ్యమైన మీటింగ్ కు పాలతో సిద్ధం కండి. నిజమే, పాలు ఒత్తిడికి విరుగుడుగా పని చేస్తాయి. ఒత్తిడి మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే రసాయనం సెరొటోనిన్ స్థాయిని తగ్గించి వేస్తుంది. కానీ పాలల్లో వే ప్రోటీన్ వుంటుంది, ఇది పరిశోధనల ప్రకారం సెరొటోనిన్ ను 43 శాతం దాకా పెంపొందించే ట్రిప్టోఫాన్ ను మెరుగు పరుస్తుంది. అయితే ఇందులో చక్కర గానీ, కాఫీ గానీ కలపకండి.

హాయిగా అనిపించాలంటే పచ్చటి ఆకు కూరలు తినండి.

హాయిగా అనిపించాలంటే పచ్చటి ఆకు కూరలు తినండి.

మీకు కావలసిందల్లా ఒక్క సలాడ్ మాత్రమె. హాయిగా అనిపించేలా చేసే సెరొటోనిన్, డోపమైన్ నోరేపినేఫ్రిన్ అనే హార్మోన్లను తయారుచేసే అరుగుల, తోటకూర లలో విటమిన్ బి పుష్కలంగా వుంటుంది. బి6 లోపం వల్ల నరాల బలహీనత, చికాకు, నిస్పృహ కూడా వస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అందువల్ల మీ బాస్ తో మధ్యాహ్నం జరగబోయే ముఖ్యమైన సమావేశానికి ముందు ఏమి చేయాలో ఇప్పుడు మీకు తెలుసు.

ప్రశాంతంగా వుండి మీ చేతులతో మాట్లాడండి

ప్రశాంతంగా వుండి మీ చేతులతో మాట్లాడండి

ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ కి వెళ్తే, మీ మోచేతులు కొంచెం వంచి మీ చేతులు మీ ఒడి మీద పెట్టుకోండి, మీ వేళ్ళు రెండూ దాదాపు అనుకునేలా వుంచండి. మీ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడానికి ఇది మంచి మార్గం, పైగా మీ గొంతు కూడా సంభాషించే స్థాయిలో వుంటుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.

మీ పిక్కలు వత్తుకోండి, లక్ష్యాలు చేరుకోండి

మీ పిక్కలు వత్తుకోండి, లక్ష్యాలు చేరుకోండి

మీరు సరిగానే విన్నారు ! మీ బుర్రను కాదు, మీ పిక్కలు వత్తుకోండి. వత్తిడిలో వున్నప్పుడు వాటిని వత్తి పట్టుకుంటే మీరు వత్తిడిని జయించగలుగుతారు. మీ కాళ్ళ క్రింది భాగాన్ని వత్తితే మీరు చాలా కఠినమైన పరిస్థితుల నుంచి బయట పడతారు.

పచ్చటి చుక్కల నుంచి సంకేతం అందుకోండి

పచ్చటి చుక్కల నుంచి సంకేతం అందుకోండి

అంటే మీరు పూర్తిగా శాకాహారిగా మారిపోవాలని కాదు. మీ ఫోన్ మీద ఒక పచ్చటి చుక్క పెట్టుకుంటే మీరు కాల్ ఆన్సర్ చేసే ముందు ఒక దీర్ఘ శ్వాస తీసుకోవాలనడానికి మీకు అది ఒక రహస్య సంకేతంగా పనికి వస్తుంది. అది వత్తిడిని తగ్గించడమే కాక మీరు మరింత విశ్వాసంగా ఉండేలా చేస్తుందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

సంగీతం తో వత్తిడి జయించండి

సంగీతం తో వత్తిడి జయించండి

మీ ఆఫీస్ కి కూడా మీ సంగీతం తీసుకు వెళ్ళండి, ఆ పాటలు సాధ్యమైనంత సేపు వినండి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల ప్రకారం సంగీతం పని వత్తిడిని తగ్గించడమే కాక జలుబును తగ్గిస్తుంది. నమ్మరా? మీరే తెలుసుకోండి.

గంజితో ఓపిక తెచ్చుకోండి

గంజితో ఓపిక తెచ్చుకోండి

ఒక చిన్న గిన్నెడు ఓట్స్ తింటే మీకు కావలసిన శక్తి వస్తుంది. ఓట్స్ లో చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జి ఐ) వుంటుంది, కనుక మీ రక్తపు చక్కర స్థాయి పెరగదు, పైగా మీరు ఎప్పుడూ ఉత్సాహంగా వుంటారు.

ఓ జె తో వత్తిడి తగ్గించుకోండి

ఓ జె తో వత్తిడి తగ్గించుకోండి

మీరు ఒత్తిడిలో వుంటే మీ విటమిన్ సి స్థాయి తగ్గిపోతుంది. అలాంటప్పుడు రుచికరమైన నారింజ పళ్ళ కన్నా మంచిది, సూపర్ సి వున్నది ఏము౦టు౦ది? కావాలంటే విటమిన్ సి వున్న ఇతర ఆహారాలు కూడా తినండి.

గింజలు తిని ఉత్సాహం పొందండి.

గింజలు తిని ఉత్సాహం పొందండి.

మీకు నీరసంగా అనిపిస్తే అది మెగ్నీషియం లోపం వల్ల కావచ్చు. పరిష్కారం ? బాదం పప్పు లాంటి మెగ్నీషియం ఎక్కువున్న ఆహారాలు పుష్కలంగా తినడం.

English summary

Sexy ways to kill stress

There’s a killer lurking around in every corner, and it often catches you unaware. Stress attacks in all sorts of ways, shaking you up in the middle of your sleep (that is, if you get any) or making you stammer in the middle of an important presentation at work.
Story first published: Sunday, August 11, 2013, 12:04 [IST]
Desktop Bottom Promotion