For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్.!నివారణ ఎలా?

By Super
|

నిద్రపోవడం అంటే అందరికీ ఇష్టమే. సాధారణంగా ఉద్యోగస్తులైతే సమయం దొరికితే చాలా, ఒక్క సెలవు దొరికితే చాలు హ్యాపీ నిద్రపోవాలి. రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత. ఈ విషయం అందరికీ తెలిసిందే. నిద్రలేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం మనందరీకి తెలిసినదే. ఈ విషయాన్ని డాక్టర్స్ వద్ద లేదా ఇంట్లో పెద్దవాల నుండి ఈ విషయాన్ని తరచూ వినే ఉంటాం. అందువల్ల సుకవంతంగా నిద్రపొందడానికి అనేక ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నిద్రలేమిని నుండి నివారణ పొందడానికి మందులు మరియు కొన్ని హోం రెమడీస్ తో ఈ నిద్రలేమిని పరిష్కరించుకోవచ్చు.

కానీ, ఇది వ్యతిరేకిస్తే ఏమవుతుంది? మీరు అధికంగా నిద్రపోతే ఏమవుతుంది? అది ఒక సమస్య కావచ్చు? నిజానికి, అవును అది. అధికంగా నిద్రపోవటం వల్ల కొన్ని సమస్యలకు కారణం కావచ్చు.

అధికంగా నిద్రపోవటాన్ని నివారించేందుకు ఇక్కడ కొన్ని ఉపయోగపడే పాయింట్లు ఉన్నాయి..

డయాబెటిస్:

డయాబెటిస్:

ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల లేదా ప్రతి రోజూ రాత్రి సరిపడా నింద్రపొందలేకపోవడం వల్ల మధుమేహాన్ని పెంచే ప్రమాదాన్ని కలిగిస్తుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.

ఊబకాయం:

ఊబకాయం:

ఎక్కువగా నిద్రపోవడం లేదా తక్కువగా నిద్రపోవడం లేదా చాలా అలస్యంగా పడుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది.

తలనొప్పి:

తలనొప్పి:

వారాంతంలో లేదా సెలవుల్లో నిద్రించే సమయం కంటే అధిక సమయం నిద్రపోవడం వల్ల కొందరికి అధిక తలనొప్పికి దారితీస్తుంది. పరిశోధకులు ఈ ప్రభావం అతిగా నిద్రపోవటం సెరోటోనిన్ సహా, మెదడులో కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లు దీనికి కారణంగా భావిస్తున్నారు.

వెన్నునొప్పికి:

వెన్నునొప్పికి:

పడుకొనే సమయంలో తలను నిటారుగా పెట్టుకొని పడుకోవడం వల్ల వెన్ను నొప్పికి దారితీస్తుందని వైద్యులు నిర్ధారించారు. కానీ వైద్యులు, కొన్నియాక్టివిటీలను ఒక నిర్ధిష్ట స్థాయిలో కొనసాగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలంటాయని గుర్తించారు. కాబట్టి సాధ్యమైనంత వరకూ సాధారణంగా నిద్ర కంటే వ్యతిరేకంగా నిద్రించరాదని సలహాలిస్తుంటారు.

డిప్రెషన్:

డిప్రెషన్:

నిద్రలేమి వల్ల డిప్రెషన్ కు గురి అవుతారనేది సాధారణంగా విషయం. అయితే అధిక నిద్ర వల్ల కూడా డిప్రెషన్ కు లోనవుతారని కొన్ని స్టడీస్ కనుగొనబడ్డాయి. కాబట్టి రెగ్యులర్ చాలా అవసరం.

గుండె వ్యాధి:

గుండె వ్యాధి:

నర్సెస్ 'ఆరోగ్యం స్టడీ ప్రకారం దాదాపు 72,000 మహిళలు మీద చేసిన అధ్యయనం ప్రకారం రాత్రిల్లో ప్రతి తొమ్మిది నుంచి 11 గంటల పడుకున్నమహిళల్లో

ఎనిమిది గంటల పడుకున్న మహిళల కంటే, పదకొండు గంటలు నిద్రించిన మహిళల్లో గుండె వ్యాధి 38% ఎక్కువ కలిగి ఉండే అవకాశం ఉందని తేలింది.

డెత్:

డెత్:

ప్రతి రోజూ రాత్రి 7-8 గంటల సమయం నిద్రపోయే వారికంటే, 8-9 నిద్రపోయే వారిలో డెత్ రేట్స్ అధికంగా ఉన్నట్లు కొన్ని పలు అధ్యనాలు కనుగొన్నారు.

అధికంగా నిద్రపోవటాన్నినివారించడానికి 6 మార్గాలు:

స్టెప్ 1: టైమ్ కు నిద్రలేవాని నిర్ణయించుకోవాలి!

స్టెప్ 1: టైమ్ కు నిద్రలేవాని నిర్ణయించుకోవాలి!

ఇది చెప్పటానికి అంత సులభమైన మార్గం కాదు. మీరు తరచుగా అతి నిద్ర పొందాలని భావిస్తుంటే.. మీరు అధిక సమయం బెడ్ మీద గడపడానికి ఇష్టపడుతున్నట్లు భావించాలి. కొన్ని సార్లు, అధిక నిద్రను ‘ఎస్కేప్ మెకానిజ', వాస్తవానికి ఇది నిద్రలేవలేకపోవడానికి ఇది ఒక మార్గం. అలా మీరు నిద్రపోవాలనుకున్నప్పుడు, మీ ముఖం అస్యహ్యంగా మారుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని టైమ్ కు నిద్రలేవడానికి ప్రయత్నించండి.

స్టెప్ 2:

స్టెప్ 2:

అధిక నిద్రపోవటం ఆపుచేయడానికి ప్రేరణ పొందండి:

అధిక నిద్రను నివారించడానికి ప్రేరణ పొందడం చాలా సులభం:

a. మీరు అధిక నిద్రను ఎందుకు ఆపుచేయాలనుకుంటున్నారు అది మీరు ముందుగా తెలుసుకోవాలి. ఈ విషయంలో స్పష్టమైన మరియు మీరు అంత ఖచ్చితంగా ఉండండి.

b. వర్తమానంలో కంటే ప్రస్తుతం జరుగుతున్న విషయంలో చాలా ఫర్ ఫెక్ట్ గా, సానుకూలంగా వ్రాసి పెట్టుకోండి. (ఉదాహరణకు: "నేను ప్రతి ఉదయం 7am వద్ద సులభంగా నిద్రలేస్తున్నాను. దాంతో నేను పూర్తి శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉన్నాను)ఇటువంటి విషయాలు మీలో కొంత ఉత్సాహాన్ని నింపుతాయి. చాలా సంతోషంగా మరియు నన్ను నేను గర్వంగా రెడీ").

c. ఇటువంటి విషయాలు చదవడం లేదా రాయడం వంటివి మళ్ళీ మళ్ళీ చేస్తుండాలి. అప్పుడే మీలో త్వరగా నిద్రలేవాలనే ప్రేరణ కలుగుతుంది.

స్టెప్ 3:

స్టెప్ 3:

మీరు నిద్రపోవడం మరియు నిద్రలేవడం మీ ఆలోచనల్ని ఎలా మారుస్తుందో చూడండి:

మీరు నిద్ర గురించి (నిద్రపోవడం, నిద్రలేవడం సమయానికి జరిగేలా)ఆలోచించడం మొదలు పెట్టండి, అప్పుడే మీరు మరింత మనుగడ సాగించగలుగుతారు.

స్టెప్ 4:

స్టెప్ 4:

ఒక స్థిరమైన సమయానికి నిద్రపోవడానికి నిర్ధారించుకోండి.

మీరు ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒక సమయానికి నిద్రలేవడం చాలా మంచిది. కనీసం సరైన టైమ్ కు నిద్ర లేవడం వల్ల మీరు ఎంత సేపు నిద్రపోయార్నది ఒక అంశంగా గుర్తించాల్సిన అవసరం లేదు.

స్టెప్ 5:

స్టెప్ 5:

మీ నిద్రను మెరుగుపరచుకోండి

మీరు తక్కువ సమయంలోనే మంచి నిద్రను పొందడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలతో తక్కువ సమయంలో సుఖమైన నిద్రను పొందడంతో పాటు, మంచి శక్తిని కూడా పొందగలుగుతారు.

a) ఒక స్థిరమైన నిద్ర షెడ్యూల్ ను ప్లాన్ చేసుకోండి.

b) మధ్యాహ్నం కెఫీన్ తీసుకోవడం మానుకోండి.

c) బెడ్ టైమ్ నికోటిన్ మరియు మద్యం తీసుకోవడం మానుకోండి.

d) ప్రతి రోజు కనీసం 2 గంటల సూర్యరశ్మిలో (ముఖ్యంగా సూర్యోదయం)లో గడపడానికి ప్రయత్నించండి

స్టెప్ 6:

స్టెప్ 6:

క్రమంగా నిద్రను తగ్గించుకోండి

వారానికి 30-60 తగ్గించండి. ఇది మొదట కొంచెం కష్టం కావచ్చు. అందుకు మీ శరీరం సర్ధుబాటుకోసం కనీసం 7-10 రోజుల సమయం పట్టవచ్చు. అయితే అధికం చేసుకోకండి. ప్రతి రోజూ 6-8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. అవసరం అయినప్పుడు (20-40) నిముషాలు కునుకు తీయండి.

English summary

Side Effects of Oversleeping, Get Rid Off This Habit

Everybody likes sleeping. There is nothing better after a long day’s work than to crawl into a comfy bed and take a nap. It is also something that we all do. Everyone needs sleep.
Desktop Bottom Promotion