For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్(రుతుస్రావం) దగ్గర పడుతోందని తెలుసుకొనే లక్షణాలు...!

|

మహిళలకు నెలకోసారి వచ్చేది రుతుస్రావం. దీనినే బహిష్టు అనీ, రుతుక్రమం అని, మెన్సెస్ అనీ అంటుంటారు. స్త్రీ గర్భంతో వున్నా, బాలింతగా వున్నా, మరీ తక్కువ బరువుతో బలహీనంగా వున్నా రుతుస్రావం కాదు. క్రమం తప్పకుండా రుతుస్రావం అయితే ఆ స్త్రీ ఆరోగ్యాన్నీ, గర్భదారణాసామర్థ్యాన్నీ కలిగివుందని అర్థం. నిజానికి గర్భధారణకి, రుతుస్రావానికి సంబంధం వుంది. రుతుస్రావం అయితేనే స్త్రీ గర్భవతి కాగలుగుతుంది.

ఆరోగ్యవంతురాలైన స్త్రీకి రుతుస్రావం 28 రోజులకోసారి జరుగుతుంది. అయితే ఈ రుతుచక్రం ఒక స్త్రీ నుంచి మరో స్త్రీకి మారవచ్చు. కొందరు స్త్రీలకు 24 రోజులకోసారి వస్తే మరి కొందరికి 30 రోజులకోసారి రావచ్చు. 21- 35 రోజుల మధ్య ఎప్పుడొచ్చినా అది సాధారణంగానే భావించాలి. అలాకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూంటే మాత్రం గైనకాలజిస్టును సంప్రదించాలి. రుతుస్రావం ఒక స్త్రీకి 3 రోజుల పాటు వుంటే మరొక స్త్రీకి 5 రోజుల పాటు వుండవచ్చు. ఇది శరీర తత్వాన్ని బట్టి జరుగుతుంది.

సాధారణంగా మహిళలందరూ రుతు క్రమంలో కొన్ని సాధారణ సమస్యలను ఎదుర్కొంటుంటారు ఉదా: ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రుతుక్రమంలో తిమ్మర్లు, లేదా రుతుక్రమంలో అధిక లేదా తక్కువ రక్తస్రావం వంటివి. ఇటువంటి రుతు స్రావ సమస్యలను నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. రుతుక్రమంలో క్రమంగా జరగాలంటే కొన్ని సంకేతాలున్నాయి. వాటిని గుర్తించినట్లైతే ఇటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

డ్రై వైజిన: మహిళల్లో ప్రతి నెలా పీరియడ్స్ మొదలవడానికి ముందు రెండు మూడు రోజుల్లో వైట్ డిచ్ఛార్జ్ అవ్వడం సాధారణం. అలాగే, పీరియడ్స్ రావడానికి ముందు చాలా మంది మహిళలు డ్రై వైజినా(యోని పొడిబారడం)జరుగుతుంది. ఈ లక్షణాలను గమనించాలి.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

గర్భాశయ స్రావాలు: కొంత మంది మహిళలు డ్రై వైజినకు గురవుతారు. అంతే కాంకుడా వైజిన నుండి కొంచెం వైట్ డిచ్ఛార్జ్ అవ్వడంతో పాటు, స్రావం కూడా వెలువడుతుంది. దాంతో మీరు పీరియడ్స్ దగ్గరలో ఉన్నారని సంకేతం.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

టెండర్ బ్రెస్ట్(బస్ట్ బరువుగా అనిపించడం): అండం విడుదలకీ, రుతుక్రమానికీ మధ్య రోజు లలో రొమ్ములు బరువు గా అయి, చిన్నపాటి ఒత్తిడికే నొప్పిగా అనిపిస్తుంది. ఇది రుతుక్రమం దగ్గరకు వచ్చినదానికి సూచనగా అనుకోవచ్చు.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

బ్యాక్ పెయిన్: పీరియడ్స్ మొదలవ్వడానికి ముందు విపరీతమైన వెన్ను నొప్పితో పాటు, కాళ్ళు, తొడలు లాగడం నొప్పితో బాధ కలిగితస్తుంది. పొత్తికడుపులో నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పిని చాలా వరకూ ప్రతి ఒక్క మహిళా అనుభవిస్తుంది. కాబట్టి ఇది పీరియడ్స్ రాబోతుందనడానికి ఒక లక్షణంగా గుర్తించాలి.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

బ్రెస్ట్ పెయిన్: ఏ మహిళ్లో అయినా సరే పీరియడ్స్ మొదలవ్వడానికి ముందు స్తనాలు బరువుగా ఉండటమే కాదు, చాలా వరకూ నొప్పిగా కూడా ఉంటుంది. చిన్న ఒత్తిడి అనిపించినా విపరీతంగా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇది పీరియడ్స్ రాబోతుంది అని తెలుసుకోవడానికి గుర్తించాల్సిన లక్షణాల్లో ఇది ఒకటి.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

తలనొప్పి: రుతుక్రమం దగ్గరకి వచ్చినపుడు తలనొప్పి ప్రతి ఒక్క మహిళా అనుభవిస్తుంది. పీరియడ్స్ ముందు తలనొప్పి, బద్దకం వంటి సాధారణ మస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

నీరు నిలుపుదల: శరీరంలో నీటిశాతం తగ్గుదలతో నోరు తడి ఆరిపోయి, శరీరం మీద చర్మం పొడిబారినట్లు కనిపించడం వల్ల కొంచెం ఇరిటేషన్ కు గురి అవుతారు. దాంతో డీహైడ్రేషన్ కు గురిఅవుతారు. కాబట్టి ఈ సమస్య నివారణకు తరచూ ఎక్కువ నీళ్ళు త్రాగుతూ శరీరాన్ని హైడ్రేషన్ ఉంచుకోవడం చాల మంచిది.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

ఆహరం మీద కోరికలు: ఇది కూడా పీరియడ్స్ రావడానికి ముందు ఒక లక్షణంగా గుర్తించవచ్చు. ఇది గర్భధారణ సమయంలో మాత్రమే కాదు, పీరియడ్స్ మొదలవ్వడానికి ముందు కూడా ఈ లక్షణం కనబడుతుంది. పీరియడ్స్ కు ముందు అధికంగా ఆకలి, మరియు దాహం వేయడం సహజం.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

మానసిక ఒత్తిడి: పీరియడ్స్ మొదలవ్వడానికి ముందు మహిళల్లో మానసిక కల్లోలం మొదలవుతుంది. దాంతో దిగాలుగా, చికాకుగా అనిపిస్తుంది.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

అలసట లేదా ఆయాసం: రుతుస్రావం మొదలవ్వడానికి ముందు చాలా మంది మహిళల్లో బద్దకంగాను, అలసటగాను బాధపడుతుంటారు. సోమరితనం మరియు నిద్ర లేమి లేదా అధిక నిద్ర వచ్చే ఫీలింగ్ రుతుస్రావం మొదలవ్వడానికి ఒక లక్షణంగా గుర్తించాలి.

పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

మొటిమలు: కొంత మంది మహిళల్లో రుతు స్రావానికి రెండు మూడు రోజుల ముందు ముఖం పైన మొటిమలు వస్తాయి. దీన్నికూడా పీరిడ్స్ మొదలవ్వడానికి ముందులక్షణంగా గుర్తుంచుకోవాలి.

రుతుక్రమం(పీరియడ్స్)రాబోతున్నాయంటే కొన్ని సంకేతాలు లేదా లక్షణాలు మనం గుర్తించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈ లక్షణాలు మానసికంగాను శరీరకంగానూ ఉంటాయి. 13 19సంవత్సరాల మథ్య వయసు ఆడపిల్లలలో కొంత మందికి అండం విడుదల కాకుండా నెలసరి రావచ్చు. కొందరికి రుతుక్రమం ఇన్ని రోజులకోసారి అంటూ క్రమబద్ధంగా వస్తే మరికొందరికి ఎప్పుడుపడితే అప్పుడు వస్తుంది. ఎక్కువగా ఇలా టీనేజర్స్‌లో జరుగుతుంది. వాళ్ల శరీరం రుతుక్రమానికి అలవాటు పడిన తరువాత క్రమబద్ధత దానంతటదే వస్తుంది. కాబట్టి అటువంటి వారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కలిగి వారిలో వారి పీరియడ్స్ రాబోతుంది అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలను గుర్తించినట్లైతే నలుగురిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవి తెలుసుకుంటే మీ పీరిడ్స్ ఎప్పుడు రాబోతుంది. అందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలతో మీరు సిద్దంగా ఉండటానికి సహాయపడుతుంది. మరి రుతుక్రమం రావడానికి ముందు కొన్ని లక్షణాలు గమనించాల్సినవి...

English summary

Signs Of Menstruation To Keep In Mind | పీరియడ్స్ దగ్గర పడుతోందని తెలిపే లక్షణాలు..!

Menstruation or period is a periodic shedding of blood from the vagina. It is a method that prepares the body for future pregnancy. Women typically stop bleeding when they get pregnant or when their age for reproducing closes (commonly known as menopause).
Story first published: Saturday, March 23, 2013, 16:01 [IST]
Desktop Bottom Promotion