టమోటో ఫ్రూటా..? వెజిటేబులా.?ఒకటే కన్ఫ్యూజన్.!?

Posted By:
Subscribe to Boldsky

నాకు చిన్నప్పటి నుండి టమోటోల గురించి ఒకటే కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇది పండా లేదా వెజిటేబులా? అని తెలియదు. సైన్స్ టమోటోలను తీసికెళ్ళి పండ్లలో కలపడమే కాదు శాస్త్రీయ నామం ‘ సొలానమ్ లైకోపర్సికమ్' అని పేరు కూడా పెట్టింది. మరి ఇది పండైతే దీన్ని తీసికెళ్ళి వెజిటేబుల్స్ లో ఎందుకు చేర్చారండి?సరే, ఏదైతేనేం మనకు కావల్సింది ఏదో ఒక రకంగా మన రెగ్యులర్ డైట్ లో టమోటోను చేర్చుకోవడమే. టమోటోను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బోలేడు ప్రయోజనాలున్నాయి.

పట్టుకుంటే మెత్తగా జ్యూసీగా ఉండే ఈ ఫ్రూట్ కాదు కాదు వెజిటేబుల్ కాదు.. కాదు ఫ్రూట్ భలే రుచిగా ఉంటుంది. కొద్దిగా పులుపు, కొద్దిగా తియ్యగా ఉండే టమోటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఒక్కటే కాదు, వివిధ రకాల పోషకాంశాలు కూడా ఉండి ఆరోగ్యానికి గొప్పగా మేలు చేస్తుంది. మరి ఆ ప్రయోజనాలు ఏలా ఉంటాయో ఒక సారి చూద్దామా...

చర్మానికి చాలా మేలు చేస్తుంది:టమోటల్లో లైకోపిన్ అనే అంశం ఉండటం వల్ల చర్మానికి చాల మేలు చేస్తుంది. చర్మ సౌందర్యానికి ఉపయోగించే కొన్ని ఫేషియల్స్ లైకోపిన్ ను ఉపయోగిస్తుంటారు.తర్వాత టమోటో గుజ్జును ముఖానికి రాసి 15-20 అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడతుంది మరియు మంచి షైనింగ్ ను అందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే చర్మంలో ఎరుపు దనాన్ని తీసుకొస్తుంది.

క్యాన్సర్ నివారిణి: టమోటోల్లో ఉండి అధిక లైకోపిన్ అనే అంశం వివిధ రకాల క్యాన్సర్లను ‘ప్రేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ మరియు కడు క్యాన్సర్'లను నివారించడానికి బాగా సహాయపడుతుంది. క్యాన్సర్ సెల్స్ అభివ్రుద్దిని నిరోధించగల నేచురల్ యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది.

ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది: టమోటోలో ‘విటమిన్ సి మరియు విటమిన్ కె' పుష్కలంగా ఉండటం వల్ల, ఈ రెండు పోషకాంశాలు ఎముకలను బలంగా ఉంచడానికి కావల్సి మరియు బోన్స్ టిష్యులను డ్యామేజ్ ను అరికట్టడానికి బాగా సహాయపడుతాయి.

స్మోకింగ్ తో క్యాన్సర్ వల్ల నష్టపోయిన భాగాలను బాగు చేస్తుంది: టమోటోలో ఉన్న కౌమారిక్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ స్మోకింగ్ వల్ల నష్టపోయిన బాగాలను బాగు చేస్తుంది. పొగత్రాగడం వల్ల క్యాన్సర్ కారకమైన కారిసినోజెన్ అనేది ఉత్పత్తి కాకుండా ఈ రెండు యాసిడ్స్ రక్షణ కల్పిస్తుంది.

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది: టమోటోల్లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్స్ మరియు బీటాకెరోటిన్ యాంటీఆక్సిడెంట్స్ లా పనిచేస్తాయి . ఇవి శరీరంలోని రక్తనాలల్లోని హానికరమైన ఫ్రీరాడికల్స్ న్యూట్రిలైజ్ చేస్తుంది . ఈ ఫ్రీరాడికల్స్ వల్ల బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాధం ఉంది. టమోటోలను ఉడికించి తినడం కంటే పచ్చిది తినడం వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయోజనం చేకూరుతుంది. ఉడికించడం వల్ల అందులో ఉండే విటమిన్ సి కోల్పోతుంది. టమోటోకున్న ఎరుపుదనం, బీటాకెరోటిన్ లెవల్స్ కు సంకేతం. కాబట్టి ఎరుపుదనం ఎక్కువగా ఉండే టమోటోలను ఎంపిక చేసుకోవడం వల్ల బీటాకెరోటిని పుష్కలంగా పొందవచ్చు .

గుండె ఆరోగ్యానికి: టమోటోలు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు టమోటోలో ఉండే విటమిన్ బి మరియు పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది . హార్ట్ అటాక్ ను, హార్ట్ స్ట్రోక్ ను మరియు గుండెకు సంబంధించి ఇతర సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన టమోటోను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతైనా అవసరం.

కేశ సంరక్షణకు: టమోటోలు కురులకు బలంగా మరియు షైనింగ్ గా ఉంచుతుంది.

కిడ్నీఆరోగ్యానికి: టమోటోలను మితంగా తీసుకోవడం వల్ల గాల్ స్టోన్ ప్రాబ్లెమ్ నుండి కిడ్నీలను కాపాడి. పనిచేసే విధానం చక్కగా ఉంచుతుంది. కాబట్టి మన రెగ్యులర్ డైట్ లో టమోటోలను చేర్చుకోవడానికి ఇది మరొక కారణంగా చెప్పుకోచ్చు.

కళ్ళకు: టమోటోల్లో ఉన్న ‘విటమిన్ ఎ' కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు టమోటో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ ఎ లోపము వలన కలుగు రేచీకటి అభివృద్ధి నిరోధిస్తుంది.

మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది: టమోటో మన శరీరంలోని షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది అందువల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది. ఆ క్రెడిట్ టమోటోని మినిరల్స్ లో ఒకటైన ‘క్రోమియం'దే. ఇది టమోటోని మంచి మన్నికైన పోషకాంశం.

ఇప్పుడు టమోటోలోని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా..మరీ ఇంకెదుకు ఆలస్యం ఎర్రగా పండుగా ఉండే టమోటోలను సలాడ్ రూపంలో తీసుకోండి. లేదా పచ్చివి తినండి. రెగ్యులర వంటకాల్లో ఉపయోగించుకోండి. కాబట్టి ఎర్రని టమోటో చూస్తూనే చటుక్కున లాగేసి కడిగే తినేసేయండి .....

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Some of the health Benefits of tomatoes | టమోటోలోని సూపర్ హెల్త్ బెనిఫిట్స్...!

Since childhood, I'm very confused with tomatoes. I don't know whether it is a fruit or a vegetable. Science includes tomatoes in fruits and the scientific name of this fruit is Solanum lycopersicum. But if it is a fruit, then why is it added to vegetables? Anyway, whatever it is, whether it is fruit or a vegetable we must include it in our regular diet to reap all the benefits of tomatoes. This pulpy red color fruit is delicious in taste as it contains a mix sweet and soury taste.
Story first published: Tuesday, April 2, 2013, 11:47 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter