For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రమాధకరమైన కెఫిన్ తీసుకోవడం నివారించే చిట్కాలు

By Super
|

కప్రతి రోజూ కాఫీ త్రాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కెఫిన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరం మరియు మనస్సు ఒక ఉద్దీపనకు గురి అవుతుంది. ఒక నియంత్రణలో కెఫిన్ తీసుకోవడం అత్యంత సమర్ధవంతమైన మరియు ఆరోగ్యకరమైనది. కానీ కొన్ని సందర్బాల్లో ప్రజలు కెఫిన్ యొక్క స్టిమ్యులేటింగ్ లక్షణాలకు బానిసలవుతుంటారు. కొన్ని సందర్భల్లో మైండ్ ఫ్రెష్ గా ఉండాలని లేదా మరికొన్ని ఎక్కువ సార్లు త్రాగుతుంటారు . అలా అధనంగా కాఫీ తీసుకోడం ఒక వ్యసనంగా మారితే, అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా అందులో కండరాల బలహీనత, భయం, ఆందోళన మరియు అపక్రమ గుండెచప్పుళ్ళు వంటి సమస్యలు ఎదుర్కుంటారు. ప్రస్తుత రోజుల్లో మోడ్రన్ జీవనశైలితో చాలా మంది ప్రజలు వారి సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే సమయంలో, చాలా మంది, కాఫీలకు, కెఫినేటెడ్ డ్రింక్స్ కు అలవాటు పడి ఉంటారు. ఒక్కసారి అలవాటు పడిన తర్వాత, కెఫిన్ వదిలిపెట్టడం అంత సులభమైన పని కాదు.

కెఫిన్ సముచితంగా మానసిక స్థితి మరింత చురుకుగా ఉండటం కోసం కెఫిన్ కు వ్యసన పరులుగా మారుతుంటారు. అయితే, కెఫిన్ మెకానిజం చర్య ఇతర డ్రగ్స్ వ్యసనపరులతో పల్చితే, డిఫరెంట్ గా ఉంటుంది. కెఫిన్ కు బానిస అయిన వారిలో అనేక మార్పులను గమనించవచ్చు. అయితే ఒక్క రోజులో 300mgమించినట్లైతే ఆరోగ్యప్రమాదాల లక్షణాలు మీద ప్రభావం చూపెడుతుంది. ఇంకా కెఫిన్ వ్యసనాన్ని మరింత ఎక్కువ చేయడంతో పాటు, విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు.

Steps to quit caffeine

కెఫిన్ మోతాదు పెరిగే కొద్ది మనిషిలో ఆందోళన పెరుగుతుంది . కెఫిన్ తీసుకోవడం కేవలం కాఫీ మరియు టీలకు మాత్రమే పరిమితం కాదు,ఎక్కువగా కోలా మరియు ఎనర్జీ డ్రింక్స్, కెఫిన్ తో ప్యాక్ చేసిన పానీయాల్లో ప్యాక్ మీద కెఫిన్ ఎంత శాతం ఉందో గమనించకుండానే పైల్ అప్ మీద ఏకాగ్రత నిండిపోయి ఉంటుంది. అటువంటి కెఫిన్ కంటెంట్ కలిగిన అలాంటి ఎనర్జీ పానీయాలు తీసుకోవడం పరిమితం చేయడం ముఖ్యం. ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఈ కెఫిన్ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుందని గమనించాలి.

1. ప్రత్యామ్నాయాలు: కెఫిన్ విడిచిపెట్టడానికి మొదటి దశ. ఈ వ్యసనాన్ని విడిచిపెట్టడానికి కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో మిమ్మల్ని మీరు దారి మళ్లించాలి. అందుకు అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. వాటిలో ముఖ్యంగా గ్రీన్ టీ, చమోమెలీ టీ మొదలగునవి. ఇలా కొద్దికొద్దిగా అలవాటు పడటం వల్ల కెఫిన్ తీసుకోవడం పరిమితం చేసుకోవడం ముఖ్యం.

2. డైవర్ట్: తరచూ, వ్యక్తులు ఎక్కువ సమయం దృష్టి మళ్లించడానికి కెఫిన్ తీసుకుంటుంటారు. కాబట్టి, ప్రతి సారి మీరు కెఫిన్ లేదా కేఫినేటెడ్ ఎనర్జీ డ్రింక్ తీసుకోవాలనే కోరికను లేదా ఆలోచనను మీ మనస్సు నుండి మళ్ళించండి . ఉదాహరణకు కాఫీ త్రాగాలనే ఆలోచన మీలో కలిగినప్పుడు గేమ్స్ ఆన్ మొబైల్స్, వైరల్ వీడియోను యూటూబ్ లో చూడటం వంటివి, కెఫిన్ మీద ఆధారపడకుండా మీలో చైతన్యం నింపడానికి సహాయపడుతాయి.

3. డైట్: చాలా మంది అలసటను తగ్గించడానికి మరియు శక్తిని పెంచుకోవడానికి కెఫిన్ లేదా కేఫీనేటెడ్ పానీయాలు తీసుకుంటుంటారు. మీ శక్తి పెంచుకోవడానికి మరియు మీ మానసిక స్థితి పరిష్కరించేందుకు అందుబాటులో అనేక డైటరీ ఆహారాలు మరియు ఎనర్జీ బూస్టింగ్ ఫుడ్స్ అరటి వంటివి తీసుకోవచ్చు. ఇతర ఆహారాలు, సాల్మన్, గుడ్లు, వాల్ నట్స్ మొ..వంటివి కూడా అదనపు శక్తిని అంధించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. దాంతో కాఫీ మీద తక్కువగా ఆధారపడి ఉంటారు. ఇది కెఫిన్ వదలడానికి చాలా సులభంగా సహాయపడుతుంది.

4. పవర్ నాప్స్: చాలా సందర్భాల్లో మధ్యహ్నా సమయంలో నిద్రమత్తును, అలసటను తొలగించుకోవడానికి కెఫిన ఎక్కువగా త్రాగుతుంటారు. మీరు పనిచేసే వేళల్లో మరియు ఈవెనింగ్ బ్రేక్స్ లో పవర్ న్యాప్స్ ను ఉపయోగించడం వల్ల మీ మనస్సు మరియు ఆలోచనలు ఒక రసాయనం లేని ఉచిత విధంగా రిఫ్రెష్ పొందడానికి సహాయపడుతుంది. పవర్ నాప్స్ చాలా సమర్థవంతంగా తన పనిని ప్రధాన భాగం చేయడం ద్వారా కెఫినేటెడ్ పానీయాలు భర్తీ చేస్తుంది. మీరు కెఫిన్ విడిచి పెట్టడానికి సహాయపడుతుంది.

5. మంచి నిద్ర: అలసట మరియు శక్తిలేకుండటకు ప్రధాన కారణం నిద్రలేమి సమస్య. ప్రతి రోజూ ఒక నియమిత సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి మరియు సకాలంలో పడుకొని, తగినంత నిద్ర పొందడం చాలా అవసరం. నిద్రలేకపోవడం వల్ల మీరు ఊహించే కంటే ఎక్కవగా కెఫిన్ మీద ఆధారపడటానికి కారణం అవుతుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల తదుపరి రోజు మీరు కెఫిన్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. అందువల్ల ప్రతి రోజూ కనీసం 7-8గంటలు నిద్రపొందడానికి చాలా అవసరం. నిద్రసరిగా పొందడం ద్వారా కెఫిన్ విడిచి పెట్టడానికి సహాయపడుతుంది.

English summary

Steps to quit caffeine

Consumption of Caffeine is promoted as a stimulant to your fatigued body and mind. In moderation, caffeine intake is highly effective and healthy. 
Story first published: Monday, November 18, 2013, 18:11 [IST]
Desktop Bottom Promotion