For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

|

బ్రెయిన్ ట్యూమర్ ఇబ్బందికరమైన వ్యాధి. ఎలాంటి కారణాలు లేకుండానే మెదడులో క్యాన్సర్, నాన్ క్యాన్సర్ కణితులు ఏర్పడుతుంటాయి. మెదడులో క్రమంగా పాతకణజలాలు పోయి కొత్త కణజాల సృష్టి నిరంతరంగా జరుగుతున్నప్పుడు పాత కణజాలు సమసిపోకుండా మిగిపోయినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తెలుగులో 'మెదడు కణిత' అని అంటారు. ఈ వ్యాధి సంక్రమించడం వల్ల ఏ భాగానికైన దేబ్బతగిలితే అక్కడ పనితీరు మందగిస్తుంది. పిల్లలు, యువకులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి 25 - 35 సం.ల మధ్య వయసులో ఉన్న వాళ్లకి వస్తుంది. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించకపోవడం వల్ల 3 శాతం మంది 5 సం.లకే మరణిస్తారు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి రెండు రకాలు. మెదడులో స్వతహాగా ఏర్పడే కణితిని ప్రైమరీ ట్యూమర్ అంటారు. శరీరంలోని ఛాతీ, పొట్ట,లివర్, లంగ్‌ల సమస్యల ద్వారా మెదడులో ఏర్పడే కణితిని సెకండరీ ట్యూమర్ అంటారు. ధూమపానం వల్ల ఊపరితిత్తుల నుంచి మెదడులో కణితి ఏర్పడవచ్చు. అలాగే అధికంగా మద్యం తాగటం వల్ల లివర్ ద్వారా మెదడులో కణితి ఏర్పడే అవకాశాలున్నాయి. సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక కేవలం రెండు సెకండ్లలోనే మెదడులో ఏర్పడిన కణితిని సులభంగా గుర్తిస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి (మెదడు కణిత) లక్షణాలు:

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

తలనొప్పి: ఈ ఒత్తిడితో కూడిన తలనొప్పి వల్ల సాధారణంగా మందంగా, స్థిరంగా, అప్పుడప్పుడు గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. తీవ్రమైన తలనొప్పి సర్వసాధారణం. మీరు దగ్గినప్పుడు, తుమ్మినపుడు, కిందకి వంగినపుడు లేదా ఎక్కువ శారీరక శ్రమ చెసినపుడు తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఇవ్వన్నీ మెదడులో ఒత్తిడిని పెంచుతాయి. తలనొప్పి రాత్రి సమయంలో ఎక్కువగా ఉండవచ్చు లేదా నిద్రలేచేటపుడు ఉండవచ్చు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

జబ్బుపడినట్లు (వికారం), వాంతి వచ్చినట్టు ఉండడం: ఒత్తిడి పెరిగినపుడు అనారోగ్యంగా ఉంటుంది, అది పగటి సమయంలో కంటే ఉదయాన్నే ఎక్కువగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా మీ వైఖరిని మార్చినపుడు అంటే ఉదాహరణకు కూర్చోవడం లేదా పడిపోఏటట్లు నిలవబడటం వంటి వాటివల్ల కూడా ఎక్కువగా ఉంటుంది.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

మూర్చలు: మూర్చలు (ఫిట్స్) బ్రెయిన్ ట్యూమర్ కి మరో సాధారణ లక్షణం. కొంతమందికి నరాలు హఠాత్తుగా లాగడం, చేతులు లేదా కాళ్ళు, లేదా కొన్నిసార్లు శరీరం మొత్తం కుదిపినట్టుగా ఉండి కండరాల నొప్పులతో బాధపడతారు. అపుడపుడు ఈ కదలిక కారణాలవల్ల స్పృహ కోల్పోతారు.

మూర్చల వల్ల భయంగా ఉండవచ్చు. మీరు రోగాన్ని గుర్తించి , చికిత్స చేయించుకోవడానికి వైద్య సహాయం అవసరమని నిర్ధారించుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్ వల్లే కాకుండా, ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా మూర్చ వచ్చి ఉండవచ్చని మీరు గుర్తుంచుకోవడం ముఖ్యం.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

మగతగా ఉండడం: మగతగా ఉండడం కూడా దీనికి మరో లక్షణం. పుర్రెలో ఒత్తిడివల్ల ఇది జరగవచ్చు. మీరు ఎక్కువగా నిద్రపోయినపుడు లేదా పగలు బద్ధకంగా ఉంటే మీరు ఆరోగ్యంగా లేనట్లు గుర్తించండి.

అదేవిధంగా ఇక్కడ వివరించిన లక్షణాలు, ద్రుష్టి లోపంవల్ల ‘వస్తువులు కదలినట్లు' ఉండడం, ద్రుష్టి స్పష్టంగా లేకపోవడం వంటివి కూడా మెదడులోపల ఒత్తిడి పెరగడం కారణం వల్ల కూడా కావచ్చు. ఇది మీ సమతుల్యాన్ని ప్రభావితం చేస్తుంది లేదా మిమ్మల్ని అయోమయంగా కూడా చేస్తుంది.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

వ్యక్తిత్వంలో, తెలివిలో మార్పులు: అసంబద్ధంగా నడవడం లేదా శరీరంలో ఒకవైపు బలహీనత, వాసన గ్రహించలేకపోవడం, అపుడపుడు మాట్లాడటం కష్టమవడం వంటివి.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

మాట్లాడడ౦ లేదా మాటలను అర్ధంచేసుకోవడం కష్టంగా ఉండడం; చదవడం, రాయడం లేదా చిన్న లెక్కలలో సమస్యలు; మీ చుట్టూ ఉన్నవాటిని గుర్తించడం, కొన్ని కదలికల సమన్వయంలో ఇబ్బందులు; శరీరంలో ఒకవైపు తిమ్మిరిగా, బలహీనంగా ఉండడం.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

మూర్చల వల్ల అసాధారణమైన అనుభూతులు ఏర్పడవచ్చు: భయం లేదా తీవ్రమైన తెలిసిన వింత వాసనలు లేదా భావోద్వేగాలు; మాట్లాడడంలో సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

ఒక వ్యక్తీ సాధారణ కంటి పరీక్షల సమయంలో మొదటిసారి గుర్తించకపోతే ఒక కన్ను దృష్టి లోపిస్తుంది.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

సమన్వయము లేకపోవడం; నిర్లక్ష్య ప్రసంగం; స్తిరంలేకపోవడం; కళ్ళు వాటంతట అవి కొట్టుకోవడం; వాంతులు, మెడ పట్టడం.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

స్థిరత్వం లేకపోవడం, సరిగా నడవకపోవడం; ముఖంలో నీరసం, ఒక వైపు నవ్వడం లేదా కనురెప్ప కిందకు ఉండడం; మాట్లాడడానికి, మింగడానికి కష్టంగా ఉందాం; నిద్రలేచిన తరువాత వాంతి లేదా తలనొప్పి (ఇది అరుదు) లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

పిట్యూటరీ గ్రంధి అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అందువల్ల ఈ గ్రంధిలో ఉండే ట్యూమర్ కి కారణాలు అనేక౦ కావచ్చు వాటిలో; ఋతుక్రమం సరిగాలేకపోవడం; గర్భం రాకపోవడం; బరువు పెరగడం; బద్ధకం; అధిక రక్తపోటు; మధుమేహం; మానశిక కల్లోలం; కాళ్ళూ, చేతులు వాయడం వంటివి. పిట్యూటరీ గ్రంధి లోని కణితి కంటి నరాలు ఒత్తిడికి గురయ్యి ద్రుష్టి లోపానికి కారణం కావచ్చు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!

ముఖం భాగంలో లేదా శరీరంలో ఒకవైపు నీరసించడం అనేది బ్రెయిన్ ట్యూమర్ కి మరో లక్షణం.

కొన్నిసార్లు బ్రెయిన్ ట్యూమర్ వల్ల శరీరంలో లేదా ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఇది మెదడు మస్తిష్క అర్ధగోలంలో కణితి ఉన్నపుడు జరుగుతుంది. ఈ పరిస్థితి వ్యక్తిని, కుటుంబాన్ని చాలా కలవరపెడుతుంది. కొన్నిసార్లు దీన్ని గుర్తించడం, సహాయం కోసం మానసిక నిపుణుడి సలహా అవసరమౌతుంది.

English summary

Symptoms To Identify Brain Tumours | బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి లక్షణాలు ఇవే..!

A brain tumour may cause symptoms because the space it takes up in the skull puts pressure on the brain, or because it is disturbing the function of the part of the brain it's growing in.
Story first published: Friday, April 19, 2013, 17:25 [IST]
Desktop Bottom Promotion