For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రాక్ష... పేరు వింటేనే తినాలనిపిస్తోందా.. అంతటితో ఆగితే ఎలా..!

|

వేసవి కాలం వచ్చేసింది. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ ఎండ వేడిని నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల శీతలపానీయాలను తాగుతుంటారు. అలాగే, శరీరంలోని వేడిని చల్లపరిచే పండ్లను ఆరగిస్తుంటారు. అలాంటి వాటిలో ద్రాక్ష పండ్లు ఒకటి. యి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చును.

వేసవి కాలంలో శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలను అందించడంతో పాటు శక్తివంతమైన యాటి ఆక్సిడెంట్లనీ ద్రాక్ష పండ్లు అందిస్తుందని వైద్యులు చెపుతున్నారు. ఈ కాలంలో సహజంగా వేధించే అలర్జీలు, వాపు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఈ యాటి ఆక్సిడెంట్లు కాపాడతాయని వారు చెపుతున్నారు.

100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతం ఉంటుందన్నారు. పైపెచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, రాగి, మెగ్నీషియం, బీకాంప్లెక్స్ విటమిన్లతో పాటు ప్రధాన ఎలక్ట్రోలైట్ అయిన పొటాషియం అధికంగా ఉంటుంది. అయితే, ద్రాక్ష పండ్లను ఆరగించే ముందు... నీటిలో శుభ్రంగా కడిగినట్టయితే, దానిపై పేర్కొన్న తెల్లని పొర వంటి రసాయన పదార్థం పోతుందంటున్నారు. ద్రాక్ష... పేరు వింటేనే తినాలనిపిస్తుంది. అంతటితో ఆగితే ఎలా! వాటి వల్ల ఆరోగ్యానికి... సౌందర్యానికి ఎంత మేలో తెలుసుకోవద్దూ!

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

ఆస్త్మాను నయం చేస్తుంది: ద్రాక్షలో ఆస్త్మాను నయం చేసే సామర్థ్యం కలిగిన లక్షణాలు చాలా ఉన్నాయి. ఆస్త్మాతో బాధపడేవారు ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆస్త్మాను తగ్గించుకోవచ్చు.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

మలబద్దకాన్ని నివారిస్తుంది: ద్రాక్షలో సెల్యులోజ్,ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది. ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్దక సమస్యను నివారిస్తుంది.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది: మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతంగా ద్రాక్ష పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తరచూ వస్తుంటే కనుక ప్రతి రోజూ ఉదయాన్నే ద్రాక్షరసాన్ని పరకడుపున తీసుకోవాలి. అయితే అందులో నీళ్ళు కలపకూడదు.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

గుండె జబ్బులను నివారిస్తుంది: ఈ ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. తద్వారా గుండెపోటు అవకాశం తగ్గుతుంది. ద్రాక్షలకు ఉన్న యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో తోడ్పడుతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

అజీర్ణానికి ఉపశమనం కలిగిస్తుంది: తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో చీకాకు కలిస్తుంటే ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

అలసటను తగ్గిస్తుంది: మనుషులు శక్తివంతంగా ఉండాలంటే అందుకు ఐరన్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బలాన్ని చేకూర్చడానికి ద్రాక్షలోని ఐరన్ బాగా సహాయపడుతుంది. కాబట్టి వ్యాయామం తర్వాత లేదా రోజులో ఏదో ఒక సమయంలో వైట్ లేదా లైట్ గ్రేప్ జ్యూస్ త్రాగడం వల్ల అలసట నుండి ఉపశమనం పొంది తాజాగా ఆరోగ్యంగా ఉండవచ్చు. తక్షణ శక్తిని అంధించడంలో ద్రాక్ష ఒక ఇన్స్ టాంట్ ఆహారం. శరీరానికి తగినంత శక్తినించి వ్యాధినిరోధకతను పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

దృష్టి లోపాన్ని నిరోధిస్తుంది: వయసు పెరిగినకొద్దీ దాడిచేసే వ్యాధుల్లో మాక్యులర్ డీజనరేషన్ ఒకటి. దీనివల్ల మెల్లమెల్లగా దృష్టి సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ ప్రతిరోజూ ద్రాక్షలు తీసుకుంటే మాక్యులర్ డీజనరేషన్ అవకాశం 36 శాతం తగ్గిపోతుంది. ద్రాక్షల్లో ఉండే ఫ్లేవినాయిడ్లు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు. ఫ్రీరాడికల్స్ దాడిని ఎదుర్కోవడంలో ఇవి అత్యంత సమర్థవంతమైనవి. అందువల్ల క్యాన్సర్లు, గుండె, రక్తనాళాల సమస్యలు, వయసుతో పాటు వచ్చిపడే ఇతరత్రా జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తాయి. పెద్దవారిలో శుక్లాలు సర్వసాధారణం. కానీ రోజూ ద్రాక్షలు తీసుకుంటే కంటిలో శుక్లాలు ఏర్పడే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

క్యాన్సర్ సెల్స్ ను నిరోధిస్తాయి: నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. ద్రాక్షల్లోని రిస్ చూపించే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంవూథోసయనిన్లు యాంటి ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగివున్నాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి. అందుకే ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు.. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

వైరస్ తో పోరాడుతుంది: ద్రాక్షల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచగల సత్తాయే కాదు కొన్ని రకాల బాక్టీరియా, వైరస్‌ల ఇన్‌ఫెక్షన్లను నిరోధించడంలో కూడా ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా పోలియో వైరస్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్‌ల విషయంలో ఇవి మరింత శక్తిమంతమైనవి.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది: ద్రాక్షలో పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవినాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. వయసు వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి. ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. మేనిని కాంతిమంతం చేస్తుంది.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

చర్మానికి: చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉపయోగాలున్నాయని అతిగా తినడం, సౌందర్య పోషణకు వినియోగించడం మంచిది కాదు. తగిన మోతాదు వాడకంతోనే అన్ని విధాలా ఆనందం.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

కేశాలకు: జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

మతిమరుపు: అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారిలో అమైలాయిడల్ బీటా పెప్టైడ్స్ మోతాదును తగ్గిస్తాయి. ద్రాక్షల్లో ఉండే రిస్ అనే పాలీఫినాల్ ఇందుకు తోడ్పడుతుంది. మెదడు చురుకుదనాన్ని పెంచడంలో ద్రాక్షలు కీలకపాత్ర వహిస్తాయి. న్యూరోజనరేటివ్ వ్యాధుల నివారణకు ద్రాక్షలు బాగా పనిచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

కిడ్నీ ఆరోగ్యానికి: ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ద్రాక్షలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

బరువు తగ్గడానికి: అధిక బరువుతో బాధపడుతున్నావారు తమ శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని ద్రాక్షపండ్ల రసం తాగితే బరువు తగ్గి నాజూకుగా తయారవుతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లరసం తాగాలనిపించినప్పుడల్లా ద్రాక్షరసం తాగటం మంచిది. ఈ పండ్ల రసంలో మిగిలిన పండ్లకన్నా తక్కు వ కాలరీలు ఉంటాయి. ద్రాక్ష రసంలో పంచదార వేసుకోకుండా తాగటం ఎంతో మంచిది. ఇందులో ఉన్న పీచుపదార్థం ఈ రసాన్ని ఎక్కువసేపు కడుపులో నిలిపి ఉంచుతుంది. దీంతో ఆకలి తగ్గి ఆహారం ఎక్కువగా తినలేరు. ద్రాక్షలో ఉండే పీచుపదార్థం వలన శరీరంలో కొవ్వును చేరనివ్వదు. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ కొలెస్టరాల్‌ని శరీరంలోకి చేరనివ్వవు. దీంతో శరీరం నాజూకుగా తయారవుతుంది.

English summary

The 15 Amazing Health and Nutritional Benefits of Grapes | సౌందర్యానికి.. ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటింది..ద్రాక్ష..!

The health benefits of grapes include its ability to treat constipation, indigestion, fatigue, kidney disorders, macular degeneration and prevention of cataract. Grapes, one of the most delicious fruits, are rich sources of vitamins A, C, B6 and folate in addition to essential minerals like potassium, calcium, iron, phosphorus, magnesium and selenium.
Story first published: Wednesday, April 17, 2013, 17:21 [IST]
Desktop Bottom Promotion