For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన టూత్ బ్రష్ కి సంబంధించిన డర్టీ సీక్రెట్

By Super
|

నోరు మరియు దంత సంరక్షణ లో తూట్ బ్రష్ చాల ముఖ్య పాత్ర పోషిస్తుంది . నోటి సంరక్షణ కోసం చక్కటి తూట్ బ్రష్ తో కూడిన శ్రద్ద అవసరం . ప్రతి 3 నుండి 4 నెలలకి ఒకసారి టూట్ బ్రష్ మార్చటం మంచిదని వైద్యులు సూచిస్తారు .

టూట్ బ్రష్ వాడకం వల్ల, టూట్ బ్రష్ ల నిండా క్రిములు చేరుతాయని ఇంగ్లాండ్ యూనివర్సిటీ అఫ్ మాంచెస్టర్ పరి శోధకులు వెల్లడించారు . సరిగా మూత పెట్టని తూట్ బ్రష్ ల లో 100 మిల్లియన్ ల సూక్ష్మక్రిములు , కలి బాక్టీరియా , స్టపిలోకొకి బాక్టీరియా వంటివి చేరుతాయని ఇవి డయేరియా ,చర్మ వ్యాధులు వంటివాటికి కారణం అవుతయి.

1. మీ టూత్ బ్రష్ పైన ఏముందో మీకు తెలుసా ?

1. మీ టూత్ బ్రష్ పైన ఏముందో మీకు తెలుసా ?

సరిగా మూత పెట్టని తూట్ బ్రష్ ల లో 100 మిల్లియన్ ల సూక్ష్మక్రిములు , కలి బాక్టీరియా , స్టపిలోకొకి బాక్టీరియా వంటివి చేరుతాయని ఇవి డయేరియా ,చర్మ వ్యాధులు వంటివాటికి కారణం అవుతయి.

2. నోటి లోని సుక్ష్మ క్రిములు

2. నోటి లోని సుక్ష్మ క్రిములు

నోటి లో అనేక వందల సుక్ష్మ క్రిములు ఉంటాయి . నోరు శుభ్రం చేసిన ప్రతి సారి పాచి రూపం లో టూత్ బ్రష్ లో కి అవి చేరుతాయి .

3. ఎలా నోటిని బ్రష్ చేస్తే ఇబ్బంది

3. ఎలా నోటిని బ్రష్ చేస్తే ఇబ్బంది

ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ల ద్వారా బ్రష్ చేసుకోటం వలన ఈ క్రిములను మీ నోటి లోని చర్మం కిందకి తోయటం జరుగుతుంది . అయితే ఈ టూత్ బ్రష్ పైన ఉన్న అనేక క్రిములు మీ నోటి లోనే మొదట నుండి ఉన్నవి కావటం వలన కొత్త వ్యాధులను కలిగించక పోయినా సాధారణం గా కలిగే రుగ్మతలను కలిగిస్తాయి .

 4. మీ టూత్ బ్రష్ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుందా?

4. మీ టూత్ బ్రష్ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుందా?

ఖచ్చితంగా కాదు. మీ నోటిలో అప్పటికే ఉన్న కొన్ని క్రిములు ఉన్నా లేదా మీ టూత్ బ్రష్ ద్వారా చేరినా మీ శరీరం లో ఉన్న సహజ సిద్దమైన రక్షణ వ్యవస్థ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.

5. ఫ్లాష్ చేసే చోట బ్రష్ చేయవద్దు

5. ఫ్లాష్ చేసే చోట బ్రష్ చేయవద్దు

చాలా బాత్రూమ్స్ చిన్నగా ఉంటాయి. ఇంకా చాలా ఇళ్ళల్లో, టూత్ బ్రష్ ని ఉంచే బాత్రూం సింక్ కి దగ్గరగా టాయిలెట్ ఉంటుంది. ప్రతి టాయిలెట్ ఫ్లష్ గాలిలోకి కొన్ని సుక్ష్మక్రిములని పంపిస్తుంది. అందువల్ల టూత్ బ్రష్ మీదకి రాకుండా జాగ్రత్తపడాలి. అందువల్ల టాయిలెట్ కి దూరం లో టూత్ బ్రష్ ని ఉంచడం మంచిది.

6. టూత్ బ్రష్ హోల్డర్స్

6. టూత్ బ్రష్ హోల్డర్స్

ఇంట్లో ఉన్న మూడవ మురికి పదార్ధం గా టూత్ బ్రష్ హోల్డర్స్ ని పేర్కొనవచ్చు. టాయిలెట్ ఫ్లష్ చేసిన ప్రతి సారి, కొన్ని క్రిముల్ని ఇది పిక్ అప్ చేసుకుంటుంది.

7. టూత్ బ్రష్ ని భద్రపరిచే చిట్కాలు

7. టూత్ బ్రష్ ని భద్రపరిచే చిట్కాలు

వాడే ప్రతి సారి టూత్ బ్రష్ ని శుభ్రంగా కొళాయి కింద కడగాలి.

సుక్ష్మక్రిములు తడిగా ఉండే ప్రదేశాన్ని ఇష్టపడతాయి కాబట్టి టూత్ బ్రష్ ని ఎప్పుడూ పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. మీరు బ్రష్ చేసే సమయం నుండి మరో సారి బ్రష్ చేసే మధ్యలో మీ టూత్ బ్రష్ ఎండేందుకు తగిన సమయం ఉండేటట్లు చూడండి.

టూత్ బ్రష్ ని హోల్డర్ లో పై నిలువుగా నించోపెట్టండి.

మీ టూత్ బ్రష్ మీరే వాడండి. మీరు మీ సోదరీ సోదరులకి, భర్త/భార్యకి లేదా రూం మేట్ కి ఎంత క్లోజ్ గా ఉన్నా వారి టూత్ బ్రష్ ని ఎప్పుడూ వాడకూడదు.

అలాగే వేరే వాళ్ళు వాడే టూత్ బ్రష్ ల కి అనుకునేటట్టు మీ టూత్ బ్రష్ ని భద్రపరచవద్దు.

టూత్ బ్రష్ లు

టూత్ బ్రష్ లు

టూత్ బ్రష్ లు ఒకదానికి ఒకటి తగిలినప్పుడు సుక్ష్మ క్రిములు అటూ ఇటూ మరే అవకాశం ఉంది. టూత్ బ్రష్ ని ఎప్పుడు మార్చాలి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు టూత్ బ్రష్ ని మార్చాలి. ఒకవేళ మీరు తరచూ అనారోగ్యానికి గురి అవడమో లేదా మీకు బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్నట్లయితే ఇంకా ముందుగానే టూత్ బ్రష్ ని మార్చాలి.

ఆరోగ్యకరమైన నోటి సంరక్షణ ని పాటించండి

ఆరోగ్యకరమైన నోటి సంరక్షణ ని పాటించండి

చిగుర్ల వ్యాధులు, దంత క్షయం అలాగే చెడు శ్వాసని కలగడనికి కారణం సుక్ష్మ క్రిములు. ఆ క్రిముల్ని సాధ్యమయినంత బయటికి పంపించడానికి మీరు తరచూ బ్రష్ చేయాలి. మీ నోటిని ఏదైనా ఏంటిబాక్టీరియల్ మౌత్ వాష్ తో పుక్కిలించడం వల్ల మీ బ్రష్ లో కి చేరకుండా కొంత బాక్టీరియా బయటికి వెళ్ళే అవకాశం కలదు.

English summary

The Dirty Secret Of Our Toothbrush

Toothbrushing plays an important everyday role for personal oral hygiene and effective plaque removal.
Story first published: Wednesday, November 20, 2013, 19:18 [IST]
Desktop Bottom Promotion