For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీరకాయను తక్కువగా అంచనా వేయకండి..అందులోని గుణగణాలను చూడండి.!

|

కీరదోసకాయకు ఆకట్టుకునే రూపం లేదు. దీని రుచియేమో చిరు చేదు. అయినా కూడా ఇష్టంగానో, కష్టంగానో తింటూనే ఉంటాం. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో రోజు కనిపిస్తూనే ఉంటుంది. వేసవిలో అయితే మరీనూ. అదే మరి ‘కీరదోసకాయ'గొప్పదనం.

ప్రతి రోజూ మనం తినడానికి ఎన్నో రుచికరమైన పండ్లు , కూరగాయలు ఉండగా పనిగట్టుకుని మరీ అంతా కీర ముక్కలనే ఎందుకు తింటారు? ఇది ఆరోగ్యానికి చక్కని ఔషధం. సౌందర్యానికి ప్రియనేస్తం. ఊబకాయలకు బద్ధ శత్రువు. అన్నిటికీ మించి కీరకాయ.... వేసవి దాహం..తాపం తీర్చే మంచినీటి భండాగారం. ప్రధానంగా దీన్ని సలాడ్స్ లో, ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు.

కాయ.... పండా...? శాస్త్రీయంగా చెప్పాలంటే పండే ... కాని పచ్చిగా ఉండగానే కోసి తింటాం కాబట్టే టొమాటో మాదిరిగా కీర దోసకాయను కూడా తినే కూరగాయగానే చెప్పాలి. అదిగాక దాహాన్ని తీర్చి వంటిని చల్ల బరచడంలో పుచ్చకాయ(కర్భూజాను) మించిన కాయ కీర దోస కాయ. ఇందులో ఉండేది 96% శాతం నీరే. దాహం ఇట్టె తీరిపోతుంది. ముఖ్యంగా ఊబకాయలకు ఆకలి అనిపించగానే కొన్ని కీరకాయ ముక్కలు తింటే పొట్ట ఇట్టె పుల్ అయిపోతుంది. క్యాలరీలు చేరావు. కాబట్టి. ఇది వారి పాలిట ఓ రకముగా అక్షయ పాత్రే. అయితే ఇందులో ఉండే ఫినైల్దియో కార్బైడ్ కారణంగా కీర కాస్త చేదుగా అనిపిస్తుంది. అందుకే చాలామంది తోడిమకి దగ్గరగా ఉన్న ఆ చివర భాగాన్ని కొంత మేరకు తీసేస్తారు. కొందరైతే దీంతో ఊరగాయ కూడా పెడతారు. దీనిలో ఉన్న మంచి వాసన కారణంగా ఫెర్ ఫ్యూమ్ లో కూడా వాడతారు. దీని చల్లని గుణం కరణంగా మందులు, క్రీములలో దిన్ని వాడుతుంటారు. మరి ఆరోగ్యానికి..సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఒక సారి లిస్ట్ చూడండి.....

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

చర్మసంరక్షణకు: చర్మానికి సహజమైన సౌందర్య లేపనం కీరదోసకాయ. ఇందులో విటమిన్ ఎ, బి మరియు సి మెగ్నిషియం, క్యాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి అందుకే అన్నిరకాల పేస్ ప్యాక్ లలో కీరదోస గుజ్జుని జోడిస్తారు. చర్మాన్ని శుభ్రపరచి మృదువుగా చేస్తుంది. అద్బుతమైన క్లీనర్ గా సహాయపడుతుంది. చర్మ మీద ఏర్పడ్డ ముడతల నివారణలో మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీముల కన్నా కీరదోసకాయ గుజ్జు నూటికి నూరు శాతం మంచిది. కీరదోసలో ఉండే 96%నీరు చర్మంలోని టాక్సిన్ ను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి చర్మాన్ని మంచి కండీషన్లో ఉంచుతుంది. జిడ్డు చర్మం, మొటిమలతో బాధపడేవాళ్ళు దీని గుజ్జును పూయడం వలన చక్కని పలితం ఉంటుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

హైడ్రేషన్: కీర దోసకాయలో ప్రధానంగో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ నీరుతో పోల్చితే దీనిలోని నీరు చాలా ఉపయోగకరం. ఇందులో ఎన్నో ఔషధ గుణములు ఉన్నాయి. సి-విటమిన్, ఏ విటమిన్, పోలిక్ యాసిడ్, పొటాషియం, సిలికా, మేగ్నిషియంలకు కీరాదోసకాలయులు మంచి నిల్వలు. శరీరంలో పేరుకున్న వ్యర్ధ, విష పదార్ధములను చక్కగా తొలగించగలదు. శరీరంలోని ఉష్గోగ్రతను నియంత్రిస్తుంది. చర్మాన్ని ఎప్పుడూ తేమగా(హైడ్రేటషన్ లో) ఉంచడానిక చాలా బాగా సహాయపడుతుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

కళ్ళకు: రోజు నిద్రపోయేముందు కీరదోసకాయను చక్రల్లా కట్ చేసిన ముక్కలను పెట్టుకుంటే కల్ల కింద నల్లని వలయాలు, వాపులు తగ్గుతాయి. అలసిన కళ్లకు సేద తీరేలగా చేస్తుంది. కళ్ళ దగ్గర చర్మ కాంతి పెంచుతుంది. ఇందులో ఉండే ఆస్కార్బిక్ మరియు కాఫిక్ పుష్కలంగా ఉండటం. ఇంకా కీరదోసకాయ తొక్కు సూర్యరశ్మి వల్ల పాడైన చర్మాన్ని తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కీర ముక్కల్ల్ని కంటిమీద పెడితే మంట తగ్గుతుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

క్యాన్సర్: కీరదోసకాయలను రెగ్యులర్ గా వినియోగించడం ద్వారా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ మరియు క్లోమం క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల అభివృద్ధి అయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

పళ్ళు మరియు మంచి చిగుళ్ళ ఆరోగ్యానికి: దంతాల ఆరోగ్యానికి మరియు చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి దోసకాయ రసం చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

జీర్ణక్రియను పెంచుతుంది: కీరదోసకాయను తరచూ తినడం వల్ల ఎసిడిటి, గుండెల్లో, పొట్టలో పుండ్లు మరియు పూతల వంటి పలు జీర్ణ అల్సర్లకు కీర దోసకాయ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. కీరదోసకాయలో ఉండే నీరు మరియు డైటరీ ఫైబర్ మనం తినే ఎటువంటి ఆహారాన్నైనా సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దోసకాయ కూడా క్రమం తప్పకుండా వినియోగించే ఉంటే, దీర్ఘకాల మలబద్ధకం వ్యతిరేకంగా ఉపయోగకరంగా గుర్తించారు.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

బలమైన కీళ్ళ కోసం: దోసకాయలోని సిలికా కీళ్ళ జాయింట్లను, సహాయపడే కణజాలాలకు పటిష్టం చేయడానికి బాగా సహాయపడుతుంది. శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుకోవడం ద్వార వచ్చే కీళ్ళ జబ్బులకు కీర రసంలో క్యారెట్ రసం కలిపి తాగితే ఎంతో మంచిది. ఆర్థరైటిస్ మరియు గౌట్ నివారణకు: ఆర్థరైటిస్ మరియు గౌట్ నొప్పి నివారణకు ఉపశమనం కలిగించే యూరిక్ ఆమ్లస్థాయిని తగ్గిస్తుంది. ఎగ్జిమ , గౌట్ రోగులు క్రమం తప్పకుండ కీర రసం తీసుకోవడం వల్ల పలితం ఉంటుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

ముక్కు మరియు గొంతు నొప్పికి: ముక్కు మరియు గొంతు, మ్యూకస్ పొర యొక్క వాపు కూడా దోసకాయ గింజలు తగ్గిస్తుంది. దోసకాయ గింజలను పొడి చేసి నీటిలో కలిపి త్రాగడం వల్ల ఈ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

గోళ్ళ సంరక్షణ: కీరదోసకాయ చేతి మరియు కాలు వేళ్ళ గోళ్లకు చాలా మంచిది. గోళ్ళు చిట్లడం వంటి వాటికి నిరోధిస్తుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

చెడు శ్వాస తగ్గిస్తుందని: దోసకాయ ఒక ముక్క తీసుకోని తినడం లేదా నోట్లో కొద్దిసేపు అలాగే 30 సెకన్ల పెట్టుకోవడం లేదా నాలుకమీద ఒత్తడం ద్వారా, చెడుశ్వాసకు దోహదం చేసే బ్యాక్టీరియాను కీర దోసలో ఉండే ఫైటో కెమికల్స్ నాశనం చేస్తుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: దోసకాయ మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడం ద్వారా మధుమేహం నియంత్రిస్తుంది. శరీరంలో యూరిక్ ఆమ్లం పెరుకోవడం ద్వార వచ్చే కీళ్ళ జబ్బులకు కీర రసంలో క్యారెట్ రసం కలిపి తాగితే ఎంతో మంచిది. డయాబెటిస్ వాళ్లకి కూడ ఇది చాల మంచి ఆహారం.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

కొలెస్ట్రాల్ తగ్గించడానికి: కీర దోసకాయలో స్టెరాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. చాతీ, ఉపిరితిత్తులు , ఉదర వ్యాదులకు కీర ఎంతో మంచిది. ఇందులోని పొటాషియం బీపిని నియంత్రణలో ఉంచితే మేగ్నీషియం రక్త ప్రసరణకు మెరుగుపరచి నరాలు, కండరాలు కదలికలకు ప్రాణం పోస్తుంది. ఇక కీరలో పీచు కొలస్ట్రాల్ శాతాన్ని నియంత్రిస్తుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

జుట్టు ఆరోగ్యానికి: కీరదోసకాయలో ఉండే సిలికాన్ మరియు సల్ఫర్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. పాలకూర, క్యారెట్ రసాలకు కాస్త కీర రసం కలపి తరచు తాగితే శీరోజాలు చక్కగా పెరుగుతాయి.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

మలబద్దకాన్ని తగ్గిస్తుంది: కీర దోసకాయను ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో నిల్వఉండే విషాలను యూరిన్ ద్వారా తొలగిస్తుంది. ఇంకా దీన్ని క్రమంగా తినడం వల్ల మలబద్దకాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. మూత్రపిండాల్లోను మూత్రాశాయంలోను ఉన్న రాళ్ళను కరిగిస్తుంది. కీరదోసకాయలోని గింజలు కడుపులో నులిపురుగులను నివారించడానికి ఉపయోగించి చికిత్సలో ఉపయోగిస్తారు. రోజు కీర తింటే మలబద్దకం ఉండదు. కడుపులో నులిపురుగులు , బద్దె పురుగులను ఇది నాశనం చేస్తుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

బరువు తగ్గించడానికి : కీర దోసకాయలో 96% నీరు ఉంది, కనుక అధిక బరువు తగ్గడానికి ఇందులో ఉండే లోక్యాలరీలు తరచూ తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా సహాయపడుతుంది.

అందానికి ప్రియనేస్తం..ఊబకాయలకు బద్ధ శత్రువు..!

కాలిన గాయాలకు: దురదలు , కాలిన గాయాలకు, పుండ్లు వంటివి వస్తే కీరగుజ్జుని రాసి అరగంట సేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

అందుకే .... ఇష్టంగా కాకపోతే కాస్త కష్టంగా అయిన సరే , అటు అందాన్ని , ఇటు ఆరోగ్యాన్ని పంచె చల్లచల్లని కీరదోసకాయలను బాగా తినండి. రాబోయే వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందండి.

English summary

The Health and Beauty Benefits of Eating Cucumber..! | అందానికి ప్రియనేస్తం..ఊబకాయులకు బద్ధ శత్రువు..!

Cucumber has countless health benefits as well as cosmetic properties. It is an excellent source of vitamin C, folic acid (when it is not peeled it contains folic acid) and potassium. The skin of the cucumber is rich in fibre that contains variety of minerals such as potassium, magnesium and silica.
Desktop Bottom Promotion